రైల్వే మంత్రిత్వ శాఖ
కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో సరుకు రవాణాకు ప్రోత్సాహకాలను ప్రకటించిన భారత రైల్వే
24.03.2020 నుండి 30.04.2020 వరకు ఖాళీ కంటైనర్లు మరియు ఖాళీ వ్యాగన్ల రాకపోకలకు అదనపు చార్జీలు వుండవు
గూడ్స్ షెడ్స్ కి వ్యక్తిగతంగా రానవసరం లేకుండానే మరింతమంది వినియోగదారులు వారి డిమాండ్లను ఎలక్ట్రానిక్ విధానంలో రిజిస్టర్ చేసుకొని రసీదు పొందవచ్చు. ఇది వినియోగదారులకు మరింత సౌలభ్యంగాను వేగవంతంగాను ఉంటుంది
వినియోగదారుడు రసీదు పొందలేని పక్షంలో తమ గమ్యం దగ్గర సరుకును రైల్వే ఇన్వాయిస్ (రసీదు) లేకుండానే ప్రత్యామ్నాయ పద్దతిలో పొందవచ్చు
ట్రైన్ లోడ్ రేట్లు వర్తించాలంటే గతంలో ఉన్నట్టు కనీస బిసిఎన్హెచ్ఎల్ (ఆహారధాన్యాలు, వ్యవసాయ ఉత్పత్తుల మొదలైన సరుకుల తో నిండిన వ్యాగన్లు ) సంఖ్యను 57 నుండి 42 కి తగ్గించారు. దీని ద్వారా నిత్యావసర వస్తువుల రవాణాకు ప్రోత్సాహం ఇచ్చినట్టవుతుంది
పరిశ్రమకు ప్రోత్సాహం ఇవ్వడానికి దూరానికి సంబంధించిన షరతులైన మినీ రేక్, రెండు పాయింట్ల రేక్ విషయంలో సడలింపు ఉంటుంది
ఈ ప్రోత్సాహకాలు ధర-పోటీతత్వాన్ని పెంచడమే కాకుండా వ్యాపారాన్ని సులభతరం చేస్తాయి
Posted On:
22 APR 2020 5:00PM by PIB Hyderabad
కోవిడ్-19 మహమ్మారిని ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సరకు రవాణా వినియోగదారులకు భారత రైల్వే భారీగా ప్రొత్సాహకాలు ప్రకటించింది. దేశీయ ఎగుమతులకు, ఆర్ధిక పరిస్థితికి ఇవి మరింత ఊతం ఇస్తాయి. ఈ ప్రోత్సాహకాల వల్ల ముఖ్యంగా గూడ్స్ షెడ్స్ కి వ్యక్తిగతంగా రానవసరం లేకుండానే మరింతమంది వినియోగదారులు వారి డిమాండ్లను ఎలక్ట్రానిక్ విధానంలో రిజిస్టర్ చేసుకొని రసీదు పొందవచ్చు. ఇది వినియోగదారులకు మరింత సౌలభ్యంగాను వేగవంతంగాను, పారదర్శకంగాను ఉంటుంది విలంబన శుల్కం కానీ ఇతర సుంకాలను కానీ వసులు చేయరు :
సరుకును విడిపించడానికి ఇచ్చిన ఉచిత సమయాన్ని మించినప్పటికీ విలంబన శుల్కాన్ని కానీ, ఇతర చార్జీలను కానీ వసూలు చేయకుండా అవకాశం కల్పిస్తారు. సరుకు రవాణా వినియోగదార్లకు సులభతర సేవలు అందించడానికి, కోవిడ్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని అవసరమైన వస్తువుల కదలికకు లాజిస్టిక్స్ మద్దతును అందించడానికి, వస్తువులు / పార్శిల్ ట్రాఫిక్ విషయంలో ఉండే వివిధ ఛార్జీల విషయంలో కొంత వెసులుబాటు కలిగి ఉంటుంది. అదేవిధంగా కంటైనర్ ట్రాఫిక్ కోసం డిటెన్షన్ ఛార్జ్ మరియు గ్రౌండ్ యూజ్ ఛార్జ్ వసూలు చేయరు. ఈ మార్గదర్శకాలు 22.03.2020 నుండి 03.05.2020 వరకు వర్తిస్తాయి.
2. రవాణా సరుకు, ఉక్కు, ఇనుము, ముడి ఖనిజం, ఉప్పు రవాణా విషయంలో ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ఆఫ్ డిమాండ్ (ఇ-ఆర్డి), రైల్వే రసీదు (ఇటి-ఆర్ఆర్) సౌకర్యం పొడిగింపు.
ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ఆఫ్ డిమాండ్ (ఇ-ఆర్డి) వినియోగదారులకు గూడ్స్ షెడ్లను భౌతికంగా సందర్శించకుండా ఎలక్ట్రానిక్ పద్ధతిలో నమోదు చేసుకునే సౌకర్యాన్ని అందిస్తుంది. ఇది సరళమైనది, సౌకర్యవంతమైనది, వేగవంతమైనది, పారదర్శకంగా ఉంటుంది. రైల్వే రసీదు ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్ (ఇటి-ఆర్ఆర్) అనేది ఒక దశ పైన ఉన్న కాగిత రహిత లావాదేవీ వ్యవస్థ, ఇక్కడ రైల్వే రశీదు కూడా ఎఫ్ఓఐఎస్ ద్వారా వినియోగదారునికి ఎలక్ట్రానిక్ విధానంలో అందిస్తారు. వస్తువుల పంపిణీ కూడా ఇటి-ఆర్ఆర్ ఇ-సరెండర్ ద్వారా ఇవ్వబడుతుంది. ఫ్రైట్ ఫార్వార్డర్స్, ఇనుము, ఉక్కు, ముడి ఇనుమ ఖనిజం, ఉప్పు రవాణా విషయంలో ఇ-ఆర్డి మరియు ఇటి-ఆర్ఆర్ ప్రయోజనాన్ని విస్తరించే మార్గదర్శకాలు జారీ చేశారు. కస్టమర్ డిమాండ్ రిజిస్ట్రేషన్, ఆర్ఆర్ / ఇన్వాయిస్ స్వీకరించడం, సరుకు తీసుకోవటానికి గూడ్స్ షెడ్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేస్తుంది.
3. రైల్వే రసీదు (ఆర్ఆర్) లేకపోయినా సరుకు విడిపించుకోవడం :
సాధ్యమైనంతవరకు, వినియోగదారులను ఇటి-ఆర్‌ఆర్‌లవిధానం వైపే ప్రోత్సహిస్తున్నారు, తద్వారా సరుకు తీసుకోవటానికి ఒరిజినల్ పత్రాలను, ఆర్ఆర్‌లను, గమ్యం పాయింట్లకు తీసుకెళ్లవలసిన అవసరం లేదు. అయితే, వినియోగదారుడు సాధారణ కాగితం ఆర్ఆర్ పై వస్తువులను బుక్ చేస్తే, అప్పుడు ఉన్న నిబంధనల ప్రకారం, కస్టమర్ సరుకు చెల్లింపునకు సరుకు బయల్దేరే స్టేషన్ వద్ద ఆర్ఆర్ / రైల్ ఇన్వాయిస్ అందుకుంటాడు. వస్తువుల డెలివరీ తీసుకోవడానికి గమ్యస్థానంలో అసలు ఆర్ఆర్ ని సమర్పించాలి. ఒక వేళ ఆర్ఆర్ లేకపోతే గమ్యం వద్ద సరుకు పొందే వ్యక్తి, స్టాంప్ చేసిన పత్రాన్ని సమర్పించిన తరువాత సరుకు ఇవ్వబడుతుంది. కానీ దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఉన్నందున, వినియోగదారుడు ఆర్ఆర్ ను సరుకు బయల్దేరే స్థానం నుండి గమ్యస్థానానికి పంపడం కష్టం. అందువల్ల, సరుకు రవాణా వినియోగదారులను సులభతరం చేయడానికి, సాధ్యమైనంతవరకు ఈటి-ఆర్ఆర్ ఇ-సరెండర్‌పై డెలివరీ పొందేలా చూడాలని ఈ మేరకు ఈటి-ఆర్ఆర్ లను జారీ చేయాలని నిర్ణయించారు.
4. కంటైనర్ రవాణా కు విధానపరమైన చర్యలు:
సరుకు రవాణాను విస్తృతంగా చేపట్టాల్సిన ఆవశ్యకతను రైల్వే ముందుగానే గుర్తించింది. భారీ సరకులైన బొగ్గు, ఇనుప ఖనిజం, మొదలైనవాటిని సంప్రదాయేతర రవాణా ద్వారా చేపట్టడానికి ఆలోచన చేసింది. ఆ దిశగా ఖాళీ కంటైనర్లు, వ్యాగన్ల విషయంలో ప్రస్తుత కాలంలో మర్చి 24 నుండి ఏప్రిల్ 30 వరకు వివిధ రకాల సుంకాలను వసూలు చేయకూడదని ఒక నిర్ణయానికి వచ్చింది రైల్వే.
5. సరకు రవాణా సడలింపులు :
మినీ రేక్ కోసం దూర పరిమితి 600 కిమీ, ఇంట్రా జోనల్ ట్రాఫిక్ కోసం 1000 కిలోమీటర్లకు పెంచబడింది. ఇప్పుడు ఇంటర్ జోనల్ మరియు ఇంట్రా జోనల్ ట్రాఫిక్ రెండింటికీ 1500 కిలోమీటర్ల వరకు అనుమతి ఉంది. ప్రామాణిక పొడవు రేక్‌ల కంటే తక్కువ బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్ల కోసం రవాణా ఉత్పత్తులు / పథకాలు విషయంలో ఈ సడలింపు ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే ట్రైన్ లోడ్ సౌకర్యంలో వెసులుబాటు పొందాలంటే నిర్దిష్ట సంఖ్యలో వ్యాగన్లు సరుకుతో నిండి వెళ్ళాలి. ఆ సంఖ్యను కూడా ఇపుడు లాక్ డౌన్ సందర్బంగా తగ్గించారు. దీనివల్ల నిత్యావసర సరకు రవాణా సజావుగా సాగుతుంది. ఈ సడలింపులు సెప్టెంబర్ 30 వ తేదీ వరకు ఉంటాయి.
*****
(Release ID: 1617312)
Visitor Counter : 267
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada