సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ప్రింట్, ఎలక్ర్టానిక్ మీడియా సంస్థలకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సూచన
Posted On:
22 APR 2020 2:16PM by PIB Hyderabad
ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తూ మీడియా ప్రతినిధులు కొవిడ్-19 బారిన పడుతున్న నేపథ్యంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఇవాళ ప్రింట్, ఎలక్ర్టానిక్ మీడియా సంస్థలకు కొన్ని సూచనలు చేసింది.
దేశవ్యాప్తంగా కొవిడ్-19 సంబంధిత వార్తలను సేకరించే రిపోర్టర్లు, కెమెరామెన్లు, ఫొటోగ్రాఫర్లు సహా మీడియా ప్రతినిధులంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది. విధి నిర్వహణలో భాగంగా వార్తల కవరేజీ కోసం ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి, కంటెన్‌మెంట్ జోన్లు, హాట్‌స్పాట్లు, కొవిడ్ కేసులున్న ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. క్షేత్రస్థాయికి వెళ్లే మీడియా సిబ్బందితోపాటు, కార్యాలయంలోనే ఉండి పనిచేసే ఉద్యోగుల ఆరోగ్యం విషయంలోనూ తగిన శ్రద్ధ చూపాలని మీడియా సంస్థలకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది.
ఈ మార్గదర్శకాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో కింది లింక్ ద్వారా చదవవచ్చు.
https://mib.gov.in/sites/default/files/Advisory%20to%20Print%20and%20Electronic%20Media.pdf
***
(Release ID: 1617062)
Visitor Counter : 292
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam