సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

మంత్రిత్వ శాఖల మూసివేతకు ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు: అది నకిలీ వార్త అని ధ్రువీకరించిన పిఐబి ఫ్యాక్ట్ చెక్

ప్రభుత్వం “సే నమస్తే” పేరిట ఎలాంటి వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ విడుదల చేయలేదు/ అనుమతించలేదు : ప్రభుత్వం

Posted On: 21 APR 2020 9:28PM by PIB Hyderabad

నకిలీ వార్తలకు అడ్డుకట్ట వేసే కార్యక్రమంలో భాగంగా పిఐబి ఫ్యాక్ట్ చెక్ వివిధ ప్రసార మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్న పలు వార్తలను నకిలీవిగా ప్రకటించింది.
సే నమస్తే పేరిట ప్రభుత్వం ఒక వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ బెటా వెర్షన్ ను ప్రారంభించిందని, త్వరలోనే ఆ యాప్ అధికారికంగా విడుదల చేస్తారని ఒక ప్రముఖ వెబ్ పోర్టల్ వార్త ప్రచురించింది. ప్రభుత్వం అలాంటి యాప్ ఏదీ విడుదల చేయడం లేదా విడుదలకు అనుమతించడం జరగలేదని పిఐబి ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. దానికి ప్రభుత్వ అనుమతి ఉన్నదన్న అభిప్రాయంతో ప్రజలు దాన్ని డౌన్ లోడ్ చేసుకోకుండా నిలువరించడం దీని లక్ష్యం.

https://twitter.com/PIBFactCheck/status/1252603481136877568?s=20
 
రైల్వే మంత్రిత్వ శాఖ ఉద్యోగులు, పెన్షనర్లకు లాక్ డౌన్ సమయంలో వేతనాల కోత విధించనున్నదంటూ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వచ్చినది కూడా నకిలీ వార్తేనని పిఐబి మరోసారి ధ్రువీకరించింది. అది నిరాధారమైన వార్త అని, రైల్వే మంత్రిత్వ శాఖ అలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదని పిఐబి ఫ్యాక్ట్ చెక్ పునరుద్ఘాటించింది. 

 

https://twitter.com/PIBFactCheck/status/1252541165083127813?s=20

 
మంత్రిత్వ శాఖలన్నింటినీ మూసివేయాలంటూ ప్రభుత్వం ఆదేశించిందని పేర్కొంటూ ఒక స్క్రీన్ షాట్ ను కూడా జతపరిచి సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలోని వాస్తవాన్ని కూడా పిఐబి ఫ్యాక్ట్ చెక్ పరిశీలనకు తీసుకుంది. ప్రభుత్వం నుంచి అలాంటి ఆదేశం ఏదీ వెలువడలేదని స్పష్టం చేసింది. ఆ చానెల్ అందుకు బాధ్యత వహించి ఆ వార్తను ఉపసంహరించి కరెక్షన్ ప్రకటించింది. 

https://twitter.com/PIBFactCheck/status/1252468471029395456?s=20 


రాష్ర్టాల స్థాయిలో నకిలీ వార్తలను గుర్తించి వాటిలోని వాస్తవాలు తెలియచేయడంలో పిఐబి ప్రాంతీయ యూనిట్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. పంజాబ్ లోని ఒక వర్గానికి చెందిన వారు పాలు తీసుకురావడాన్ని హిమాచల ప్రదేశ్ అనుమతించడంలేదంటూ ఒక ప్రముఖ పోర్టల్ లో ప్రచురించిన వార్తను ఖండిస్తూ ఉనా జిల్లా మెజిస్ర్టేట్ ఇచ్చిన లేఖను జతపరుస్తూ పిఐబి సిమ్లా యూనిట్ ఒక ట్విట్టర్ సందేశం విడుదల చేసింది. 
 

https://twitter.com/PIBShimla/status/1252191586567372801?s=20

 
లాక్ డౌన్ కారణంగా ఆహారం లభించక బీహార్ లోని జెహానాబాద్ లో బాలలు కప్పలు తింటున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రసారం అయిన నకిలీ వీడియోను కూడా ఖండిస్తూ పిఐబి ఫ్యాక్ట్ చెక్ ఒక కౌంటర్ జారీ చేసింది. జిల్లా యంత్రాంగం జరిపిన పరిశీలనలో ఆ బాలలకు చెందిన కుటుంబాలన్నింటి వద్ద తగినంత ఆహారం ఉన్నట్టు తేలిందని తెలిపింది. 

 

https://twitter.com/PIBFactCheck/status/1252169585832255488?s=20

 
ఆహారం కొరత కారణంగా అరుణాచలప్రదేశ్ లో కూడా ప్రజలు పాములు తింటున్నారంటూ మరో వీడియో ప్రసారం అయింది. ఆ వార్త పూర్తిగా నిరాధారమని, మూడు నెలలకు అవసరం అయిన ఆహారం నిల్వలు రాష్ట్రంలో ఉన్నాయంటూ ప్రభుత్వం ఇచ్చిన వివరణను పిఐబి గౌహతి ప్రాంతీయ కార్యాలయం ట్విట్టర్ సందేశం ద్వారా తెలియచేసింది. రాష్ర్టానికి క్రమం తప్పకుండా ఆహార సరఫరాలు కూడా అందుతున్నట్టు తెలిపింది.

https://twitter.com/PIB_Guwahati/status/1252570210382602240?s=20  
పూర్వాపరాలు...
సుప్రీంకోర్టు నిర్దేశకత్వం మేరకు సామాజిక మాధ్యమాల్లో వదంతులు, నిరాధారమైన వార్తలు వ్యాపింపచేయడాన్ని అరికట్టడానికి పిఐబి ఒక ప్రత్యేక యూనిట్ ఏర్పాటు చేసింది. ఈ విభాగం సామాజిక మాధ్యమాల్లో అమితవేగంగా వ్యాపిస్తున్న వదంతులను గుర్తించి వాటిలోని నిజానిజాలను వెలికి తీస్తుంది. “పిఐబి ఫ్యాక్ట్ చెక్”  పేరిట ట్విట్టర్ లో ఏర్పాటైన ఈ హ్యాండిల్ నిరంతరం సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ట్రెండింగ్ సందేశాలను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ వాటిలో నిరాధారమైన వార్తలను గుర్తించడంతో పాటు ఆ సందేశాల్లోని అంశాలను సమగ్రంగా సమీక్షిస్తూ ఉంటుంది. పిఐబి_ఇండియా హ్యాండిల్ తో పాటు పిఐబికి చెందిన వివిధ ప్రాంతీయ విభాగాల హ్యాండిళ్లు ఆయా వార్తల వాస్తవ, అధికారిక వెర్షన్లను ట్విట్టర్ వినియోగదారుల కోసం #పిఐబిఫ్యాక్ట్ చెక్ హ్యాష్ టాగ్ తో ప్రచురిస్తున్నాయి.
సామాజిక మాధ్యమాల్లో వచ్చిన టెక్ట్స్ సందేశం, ఆడియో, వీడియోల్లో వచ్చిన అంశాల్లో నిజానిజాలను పరిశీలించేందుకు పౌరులెవరైనా వాటిని పిఐబిఫ్యాక్ట్ చెక్ కు పంపవచ్చు. https://factcheck.pib.gov.in/  లింక్  ద్వారా ఆన్ లైన్ లోనే వాటిని పరిశీలనకు పంపవచ్చు. లేదా +918799711259 నంబర్ కు వాట్సప్ చేయవచ్చు. లేదా pibfactcheck[at]gmail[dot]com కు సందేశం పంపవచ్చు. అలాంటి వార్తల్లోని నిజానిజాలన్నీ పిఐబి వెబ్ సైట్   https://pib.gov.in లో కూడా అందుబాటులో ఉంటాయి.

 

WhatsApp Image 2020-04-21 at 8.38.39 PM.jpeg

***(Release ID: 1616952) Visitor Counter : 233