రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడేందుకు అనువుగా రసాయనాలు, ఎరువులు, ఔషధాల లభ్యతను దేశంలో మెరుగు పరిచేందుకు చేస్తున్న ప్రయత్నాలను క్రమబద్దీకరిస్తున్నాము : గౌడ

Posted On: 21 APR 2020 7:08PM by PIB Hyderabad

కోవిడ్-19 మహమ్మారి వల్ల ఎదురౌతున్న సవాళ్ళను అధిగమించేందుకు అవసరమైన మందులు, ఎరువులు, క్రిమి సంహారక రసాయనాల సరఫరా సమృద్ధిగా ఉండేవిధంగా తమ మంత్రిత్వశాఖ అవసరమైన చర్యలన్నీ చేపడుతోందని రసాయనాలు, ఎరువుల శాఖ కేంద్ర మంత్రి శ్రీ డి.వి.సదానంద గౌడ పేర్కొన్నారు. 

ఈ మేరకు శ్రీ గౌడ ఒక ట్వీట్ చేస్తూ, రైతులకు ఎరువులు, సాధారణ ప్రజలకు మందులు, ఆరోగ్య సేవలుకరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి అవసరమైన క్రిమి సంహారక రసాయనాల లభ్యతను మెరుగు పరిచేందుకు తగిన వ్యూహాలను రూపొందించాలని తన మంత్రిత్వ శాఖ లోని మూడు విభాగాలైన ఎరువులుఫార్మారసాయనాలు మరియు పెట్రోకెమికల్స్ కు చెందిన కార్యదర్శులు, ఇతర సీనియర్ అధికారులతో జరిపిన చర్చల్లో కోరినట్లు తెలిపారు

ఎటువంటి ఆటంకాలు లేకుండా అవసరమైన వస్తువుల సరఫరా  కొనసాగేందుకు తమలో తాము సంప్రదిస్తూ, ఇతర మంత్రిత్వ శాఖల అధికారులతో కూడా సమన్వయంతో సన్నిహితంగా పనిచేయాలని ఈ సమావేశంలో శ్రీ గౌడ తమ శాఖ అధికారులను కోరారు

కేంద్ర రసాయనాలుఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ మన్ సుఖ్ మాండవీయ కూడా ఇటీవల తమ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.  కోవిడ్-19 మహమ్మారి విజృంభణ సమయంలో రసాయనాలు, పెట్రోకెమికల్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తీసుకోవలసిన చర్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా శ్రీ మాండవీయ ఒక ట్వీట్ చేస్తూ - "ప్రపంచం అంతా ఒక కుటుంబమని విశ్వసించే భారతదేశం, సోదర భావాన్ని ప్రోత్సహిస్తుంది. " అని వ్యాఖ్యానించారు. 

రానున్న ఖరీఫ్ పంట కాలానికి రైతులకు అవసరమయ్యే ఎరువులు సమృద్ధిగా సరఫరా చేయడానికి ఎరువుల కంపెనీలు ఇప్పటికే పూర్తి సామర్ధ్యంతో పనిచేయడం ప్రారంభించాయని, మంత్రిత్వశాఖ పేర్కొంది  ఫార్మా రంగం కూడా హైడ్రోక్సీక్లోరోక్విన్ తో సహా అవసరమైన మందులను సమృద్ధిగా ఉత్పత్తి చేయడానికి నిర్విరామంగా కృషి చేస్తోంది.  ప్రపంచంలో హైడ్రోక్సీక్లోరోక్విన్ భారీగా ఉత్పత్తి చేసే దేశాల్లో భారతదేశం ఒకటిగా ఉంది. దేశీయ అవసరాలను తీర్చడంతో పాటు మిగిలిన మందులను భారతదేశం ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తోంది.  క్రిమిసంహారకాలుగా ఉపయోగించే అవసరమైన రసాయనాల ఉత్పత్తి, సరఫరా కూడా సంతృప్తికరంగా ఉంది

 ***


(Release ID: 1616902) Visitor Counter : 197