రైల్వే మంత్రిత్వ శాఖ
కొవిడ్ విధులను నిర్వహిస్తున్న ఢిల్లీ పోలీసులకు బాసటగా 10000 నీటి సీసాలను ఏర్పాటు చేసిన రైల్వే
పెరుగుతున్న వేసవి వేడిలో ఢిల్లీలో రోడ్ నాకస్తోపాటు వివిధ ప్రాంతాల్లో కొవిడ్ విధులు నిర్వహిస్తున్న పోలీసులకు పిఎస్యు ఐఆర్సిటిసి సహకారంతో రైల్ నీర్ నీటి సీసాలను అందించడం ప్రారంభించిన భారతీయ రైల్వే
ఇప్పటి వరకు 50000 నీటి సీసాల సరఫరా; మే 3 వరకు నీటి సీసాలను సరఫరా చేయడానికి ఏర్పాట్లు
Posted On:
21 APR 2020 3:31PM by PIB Hyderabad
ఐఆర్సిటిసి, ఆర్పిఎఫ్, జోనల్ రైల్వే వంటి రైల్వే సంస్థల సంయుక్త సహకారంతో కొవిడ్పై నిరంతరం పోరాటం చేస్తోంది భారతీయ రైల్వే. ఇందులో భాగంగా కొవిడ్-19 బాధ్యతలను నిర్వహిస్తున్న ఢిల్లీ పోలీసులకు బాసటగా ఇటీవల వారి కోసం 10000 నీటి సీసాలను అందించింది. ఇప్పటి వరకు 50000 నీటి సీసాలను సరఫరా చేసింది.
రోజు రోజుకూ పెరుగుతున్న ఎండ వేడిమిలో నిరంతరం లాక్డౌన్ విధులు నిర్వహిస్తున్న పోలీసులు అదే విధంగా వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది వంటి వారికి ఈ విపత్కర పరిస్థితుల్లో తమ సహకారాన్ని అందిస్తున్నారు. ఈ కొవిడ్-19పై చేస్తున్న ఈ యుద్ధంలో ముందు వరుసలో నిలుస్తున్న ఈ యోధుల కృషికి ప్రశంసగా వారికి ఈ సేవలను అందిస్తున్నది భారతీయ రైల్వే.
ఈ ప్రయత్నంలో భాగంగా 16.04.2020 నుండి పిఎస్యు ఐఆర్సిటిసి సహకారంతో రోజుకు 1లీటరు నీరు కలిగిన 10000 రైల్ నీర్ నీటి సీసాలను సరఫరాచేసింది. ఈ నీటి సీసాలను నంగ్లోయి రైల్ నీర్ ప్లాంట్ నుండి సేకరించింది. ఇప్పటి వరకు 50000 నీటి సీసాలను పంపిణీ చేసింది భారతీయ రైల్వే.
దీనితో పాటు స్వచ్ఛందంగా అవసరంలో ఉన్నవారికి ఆహార పొట్లాట పంపిణీ కూడా చేపట్టడం గమనార్హం. ఆర్పిఎఫ్ మరియు స్వచ్ఛంద సంస్థల విరాళాలతో ఐఆర్సిటిసి వంటశాల ద్వారా భారీ స్థాయిలో వండిన ఆహర పొట్లాలను పేపర్ ప్లేట్లతోపాటుగా సరఫరా చేస్తున్నది భారతీయ రైల్వే, జాతీయ లాక్డౌన్ సమయంలో చేపట్టిన ఈ కార్యక్రమం నిన్ననే 2మిలియన్ల మార్కును దాటింది.
(Release ID: 1616751)
Visitor Counter : 166
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada