సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

03.05.2020 వరకు కేంద్రీయ పరిపాలనా ట్రిబ్యునల్ బెంచిల కార్యకలాపాల నిలిపేత

Posted On: 21 APR 2020 3:00PM by PIB Hyderabad

లాక్డౌన్ పై కేంద్ర ప్రభుత్వ  నిర్ణయానుసారంగా 20.04.2020 తరువాత కేంద్రీయ పరిపాలనా ట్రిబ్యునల్ బెంచిల కార్యలాపాల నిర్వహణా సాధ్యతను  గురించి తెలుపుతామని 14.04.2020న ట్రిబ్యునల్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

కాగా ప్రభుత్వం పేద వర్గాల జీవనాధారం కోసం అత్యవసారైలైన ఆహార వస్తువులు మరియు ఇతరముల సరఫరా కోసం  అవసరమైన రవాణాకు మాత్రమే కొన్ని  వెసులుబాట్లను కల్పించింది. కార్యాలయాల్లో సిబ్బంది హాజరుకు అనుమతి లేకపోగా మరి కొన్ని కార్యలయాల్లో సామజిక దూరాన్ని తప్పనిసరిగా పాటిస్తూ తమ విధులను నిర్వహిస్తున్నారు సిబ్బంది.

హైకోర్టులేవీ పనిచేయకుండగా ప్రత్యేక లేదా మినహాయింపు కలిగిన కేసులను మాత్రం  వీడియో కాన్ఫరెన్సుల ద్వారా విచారిస్తున్నారు. న్యాయస్థానాల బెంచులన్నీ దాదాపు హాట్ స్పాట్లు కలిగిన ప్రాంతాల్లోనే ఉండగా  ఈ పరిస్థితుల్లో కేసులను ఫైల్ చేయడంలో బార్ ప్రతినిధులు తమకు ఎదురవుతున్న కష్టాన్ని ఇప్పటికే నివేదించారు. కావున 03.04.2020 వరకూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యులనళ్ళ బెంచుల కార్యకలాపాలను, విచారనలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది.  కొన్ని ప్రత్యేక దినాల్లో పనిచయు సాధ్యతను ఇప్పటికే సెలవు  రోజులుగా లేదా సెలవు కాలంగా పరిగణిస్తున్నట్లు ప్రకటించగా కార్యాలయాలు పనిచేయడం ప్రారంభించగానే వాటిని సెలవులు పరిగణిస్తారు.

***



(Release ID: 1616701) Visitor Counter : 219