మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
స్వయం, స్వయం ప్రభపై సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి
Posted On:
20 APR 2020 7:23PM by PIB Hyderabad
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్ ఫోఖ్రియాల్ నిశాంక్ ఈ రోజు జాతీయ ఆన్ లైన్ విద్యా వేదిక స్వయం మరియు 32 డి.టి.హెచ్. టెలివిజన్ ఎడ్యుకేషన్ ఛానల్స్ స్వయం ప్రభ గురించి ఆన్ లైన్ ద్వారా సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ శాఖ కార్యదర్శి ఎం.హెచ్.ఆర్.డి. శ్రీ అమిత్ ఖరే, యు.జి.సి. ఛైర్మన్ శ్రీ డి.పి.సింగ్, ఏ.ఐ.సి.టి.ఈ. ఛైర్మన్ శ్రీ అనిల్ సహస్ర బుద్ధి, ఎన్.సి.ఈ.ఆర్.టి. ఛైర్మన్ శ్రీ హృషికేశ్ సేన్ పతి, ఎన్.ఐ.ఓ.ఎస్. ఛైర్మన్, ఇతర సీనియర్ అధికారులు, జాతీయ సమన్వయ కర్తలు, మరియు ఐఐటి, ఢిల్లీ, ఐఐఎం, బెంగళూరు, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ తదితర సంస్థలకు చెందిన ప్రొఫెసర్లు పాల్గొన్నారు.
ఈ పథకాల పురోగతి గురించి ఈ సందర్భంగా లఘ ప్రదర్శన ఏర్పాటు చేశారు. లాక్ డౌన్ స్థితి కారణంగా స్వయం కోర్సులు మరియు స్వయం ప్రభ వీడియోలకు మంచి డిమాండ్ ఏర్పడింది.
స్వయం
ప్రస్తుతం స్వయంలో 1902 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకూ 1.56 కోట్ల మంది విద్యా ర్థులకు వీటిని అందించారు. 26 లక్షల మంది విద్యార్థులు ఆఫర్ మీద 574 కోర్సులు తీసుకుంటున్నారు. మొత్తం మీద 1509 కోర్సులు స్వీయ అభ్యాసం కోసం అందుబాటులో ఉన్నాయి. స్వయం 2.0 ఆన్ లైన్ డిగ్రీ ప్రోగ్రాముల ప్రారంభానికి కూడా మద్దతు అందిస్తోంది. ఎ.ఐ.సి.టి.ఈ. మోడల్ పాఠ్య ప్రణాళికకు స్వయం కోర్సుల మ్యాపింగ్ జరిగింది. ఇందులోని సమస్యలను గుర్తించడం జరిగింది. నాన్ టెక్నికల్ కోర్సుల విషయంలో దీనికి సంబంధించిన అన్ని అంశాలను యు.జి.సి. కమిటి నిర్వహిస్తోంది.
1900 స్వయం కోర్సులు మరియు 60,000 స్వయంప్రభ వీడియోలను పది ప్రాంతీయ భాషల్లోకి అనువదించి, విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. తద్వారా ఎక్కువ ప్రయోజనం పొందవచ్చని భావిస్తున్నారు. మొదటి సంవత్సరంలో బోధించే ఇంజనీరింగ్ కోర్సుల అనువాదం కొరకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఫలితంగా ఇంది మరింత జనాదరణ పొందిన కోర్సుగా నిలిచింది. జాతీయ కోఆర్డినేటర్లకు అనువాద పనిని వికేంద్రీకరించాలని నిర్ణయించారు. విద్యార్థులు, ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఎజెన్సీలతో పాటు ఈ అనువాదం చేపట్టడానిక అందుబాటులో ఉన్న సాంకేతికత వంటి అన్ని అంశాలను వారు వినియోగించుకోవచ్చు.
మొత్తం ప్రాజెక్టును వెంటనే ప్రారంభించి, వీలైనంత త్వరలో పూర్తి చేయవలసి ఉంది. జనాదరణ పొందిన కోర్సులు మరియు వీడియోలను మొదట పూర్తి చేస్తారు. ఈ పనిని అతి తక్కువ సమయంలో పూర్తి చేయడానికి దేశ వ్యాప్తంగా అనేక విద్యాసంస్థలు సహాకారం కోరనున్నారు. ప్రతి ఎన్.సి. ఏప్రిల్ 23 లోపు ఎం.హెచ్.ఆర్.డి (E-mail: NMEICT@nmeict.ac.in) కార్యాచరణ ప్రణాలికను సమర్పించాల్సి ఉంది.
ఐఐటి డైరక్టర్లందరూ కంటెంట్ అనువాదం, తెలియని కొత్త కంటెంట్ తయారు చేయడం మరియు క్రెడిట్ బదిలీ అంగీకరించే పనిలో ఎన్.సి.లకు అన్ని రకాల సహాయం అందించాల్సి ఉంది.
స్వయం క్రెడిట్లను అంగీకరించడానికి యుజిసి మరియు ఎ.ఐ.సి.టి.ఈ. విశ్వవిద్యాలయాలు మరియు సంస్థలను అనుసరించాలని నిర్ణయించారు. ఇది విద్యార్థుల ఎం.ఓ.ఓ.సి.లో భాగం అయినా, వివిధ కోర్సుల్లో కొంత భాగం చేయడానికి వీలు కల్పిస్తుంది.
అలాగే స్వయం కింద మరిన్ని కోర్సులు అందించేందుకు అధ్యాపకులను ప్రోత్సహించడానికి, వారి వృత్తికి తగిన ప్రోత్సాహకాలు అందించబడతాయి.
ఇంకా, స్థూల నమోదు నిష్పత్తిని పెంచేందుకు ఆన్ లైన్ మరియు దూర విద్య మార్గదర్శకాలకు సంబంధించిన మార్గదర్శకాలను సిద్ధం చేయాలని యు.జి.సి.ని కోరింది.
స్వయం ప్రభ
జిశాట్ -15 ఉపగ్రహాన్ని ఉపయోగించి 24 గంటల పాటు అధిక నాణ్యత కలిగిన విద్యా కార్యక్రమాలను ప్రసారం చేయడానికి అంకితం చేసిన 32 డి.టి.హెచ్. ఛానళ్ళ సమూహమే స్వయం ప్రభ. దీని కోసం రోజుకు 5 సార్లు పునఃప్రసారం చేసే విధంగా కనీసం 4 గంటల కొత్త కంటెంట్ ప్రసారం అవుతుంది. దీని వల్ల విద్యార్థులు వారి సౌలభ్య సమయాన్ని ఎంచుకోవచ్చు.
దీని విషయంలో ఈ క్రింది నిర్ణయాలు తీసుకున్నారు.
· ఛానల్ రీ డిస్ట్రిబ్యూషన్ అవకాశం కోసం అందుబాటులో ఉన్న కంటెంట్ మరియు వీక్షకుల సంఖ్య తెలుసుకోవలసి ఉంటుంది.
· .విద్యాదాన్ ప్రోగ్రాం కింద ఇంత వరకూ సహకరించేందుకు సిద్ధంగా ఉన్న వారి నుంచి కంటెంట్ సేకరించి, స్వయం ప్రభలోని కంటెంట్ నాణ్యత, సంఖ్య పెంచాలని నిర్ణయించారు. సేకరించిన కంటెంట్ ను స్వయం ప్రభలో అప్ లోడ్ చేయడానికి ముందు ప్రతి ఎన్.సి. చేత సబ్జెక్ట్ నిపుణుల కమిటీలను ఏర్పాటు చేయాలి.
· రేడియో, సోషల్ మీడియా సహా అందుబాటులో ఉన్న అన్ని ఛానల్స్ ద్వారా డి.టి.హెచ్. ప్రసారం ప్రాచుర్యం పొందుతుంది.
· స్వయం ప్రభలోని వీడియో కంటెంట్ పాఠ్యాంశాలకు మరియు విద్యా క్యాలెండర్ కు మ్యాప్ చేయడం జరుగుతుంది.
· నాలుగు ఐఐటి-పాల్ ఛానల్స్ కు కంటెంట్ అనువాదం కోసం సి.బి.ఎస్.ఈ, ఎన్.ఐ.ఓ.ఎస్ లు ఢిల్లీ ఐఐటీకి అన్ని రకాల సహాయాలను అందించాలి. ఈ విషయాన్ని ఎం.హెచ్. ఆర్.డి. జాయింట్ సెక్రటరీ (ఐ.ఈ.సి) పర్యవేక్షిస్తారు.
సమావేశ నిర్ణయాల అమలును మంత్రిత్వ శాఖ సమీక్షిస్తుంది.
--
(Release ID: 1616520)
Visitor Counter : 219