ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 అప్‌డేట్
Posted On:
20 APR 2020 5:29PM by PIB Hyderabad
రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాల సమిష్టి కృషి ద్వారా కోవిడ్ -19 నివారణ, నియంత్రణ, నిర్వహణ కోసం భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. వీటిని క్రమం తప్పకుండా ఉన్నత స్థాయిలో సమీక్షిస్తున్నారు.
ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయడానికి వీలుగా , కేంద్ర హోం మంత్రిత్వశాఖ 20 ఏప్రిల్ 2020 కోసం జారీచేసిన ఏకీకృత మార్గదర్శకాలకు అనుగుణంగా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు తగిన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవలసిందిగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ తమ శాఖ అధికారులు , ఉద్యోగులకు సూచించింది.
పునర్ వినియోగ లేదా గుడ్డ తో తయారు చేసిన ఫేస్ మాస్క్ తప్పని సరిగా ఉపయోగించాలి.
ఇన్‌ఫెక్షన్‌రహిత ప్రొటోకాల్స్‌ను కచ్చితంగా పాటించాలి.
తరచూ చేతులు సబ్బు లేదా నీటితో లేదా ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ రబ్‌తో, శానిటైజర్‌తో శుభ్రంగా కడుగుకోవాలి.
ఒకరికి ఒకరికి మధ్య తగినంత దూరం పాటించాలి.
ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుమికూడకుండా చూడాలి.
కోవిడ్ -19 కేసులు రెట్టింపు అయ్యే రేటును గత ఏడు రోజుల పురోగతి ఆధారంగా కేసులను లెక్కించడం జరుగుతుంది. దీనిని బట్టి ఇండియా డబులింగ్ రేటు లాక్‌డౌన్ ముందరి వారం 3.4 ఉండగా , అది 2020 ఏప్రిల్ 19 నాటికి 7.5 కు మెరుగుపడింది.(గత ఏడు రోజులకు) 18 రాష్ట్రాలు,19 ఏప్రిల్ నాటికి జాతీయ సగటుతోపోల్చినపుడు డబులింగ్ రేటును మెరుగుదల కనబరిచాయి.
డబులింగ్ రేటు : 20 రోజుల కంటే తక్కువ-
ఢిల్లీ(యుటి)- 8,5 రోజులు
కర్ణాటక- 9.2 రోజులు
తెలంగాణ- 9.4 రోజులు
ఆంధ్రప్రదేశ్- 10.6 రోజులు
జమ్మూ & కె (యుటి) - 11.5 రోజులు
పంజాబ్- 13.1 రోజులు
ఛత్తీస్‌గఢ్- 13.3 రోజులు
తమిళనాడు- 14 రోజులు
బీహార్- 16.4 రోజులు
డబులింగ్ రేటు: 20 రోజుల నుండి 30 రోజుల మధ్య:
అండమాన్ ,నికోబార్ (యుటి) - 20.1 రోజులు
హర్యానా - 21 రోజులు
హిమాచల్ ప్రదేశ్ - 24.5 రోజులు
చండీగ ఢ్(యుటి) - 25.4 రోజులు
అస్సాం - 25.8 రోజులు
ఉత్తరాఖండ్ - 26.6 రోజులు
లడఖ్ (యుటి) - 26.6 రోజులు
డబులింగ్ రేటు: 30 రోజుల కంటే ఎక్కువ:
ఒడిశా - 39.8 రోజులు
కేరళ - 72.2 రోజులు
గోవాలో కోవిడ్ -19 రోగులందరూ కోలుకుని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు, ఇప్పుడు గోవాలో యాక్టివ్ కేసు ఏదీ లేదు. మూడు జిల్లాలు - మహే (పుదుచ్చేరి), కొడగ్గు (కర్ణాటక) , పౌరి గర్హ్వాల్ (ఉత్తరాఖండ్)లలో కూడా గత 28 రోజులలో తాజా కేసులు ఏవీ నమోదు కాలేదు. గత 14 రోజులలో 23 రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలోని 59 అదనపు జిల్లాల నుంచి ఎలాంటి కొత్త కేసూ నమోదు కాలేదు. ఆరు కొత్త జిల్లాలు ఈ జాబితాలో చేరాయి. అవి:
రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్ , పాలి
గుజరాత్‌లోని జామ్‌నగర్ , మోర్బి
గోవాలో ఉత్తర గోవా
త్రిపురలో గోమతి
దేశంలో కోవిడ్ -19 కు సంబంధించి మొత్తం 17,265 కేసులు నమోదయ్యాయి. 2547 మంది వ్యక్తులు, అంటే మొత్తం కేసులలో 14.75 శాతం కోలుకున్న తర్వాత ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయ్యారు.కోవిడ్ -19 కారణంగా ఇప్పటివరకు మొత్తం 543 మంది మరణించారు.
కోవిడ్ -19 కి సంబంధించి తాజా , అధీకృత సమాచారం , దీనికి సంబంధించిన సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, ఇతర సూచనల కోసం క్రమం తప్పకుండా గమనించండి : https://www.mohfw.gov.in/.
కోవిడ్ -19 కి సంబంధించి సాంకేతిక అంశాలపై తమ ప్రశ్నలను technicalquery.covid19[at]gov[dot]in ఈమెయిల్‌కు పంపవచ్చు. ఇతర ప్రశ్నలను ncov2019[at]gov[dot]in .కు పంపవచ్చు.
కోవిడ్ -19పై ఏవైనా ప్రశ్నలకు సమాధానాల కోసం కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్‌లైన్ నెంబర్ : +91-11-23978046 లేదా 1075 (టోల్ ఫ్రీ) కు ఫోన్ చేయవచ్చు. కోవిడ్ -19 పై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల హెల్ప్‌లైన్ ల జాబితా కోసం కింది లింక్‌ను గమనించవచ్చు.
https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .
****
(Release ID: 1616470)
Visitor Counter : 331
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam