హోం మంత్రిత్వ శాఖ
కోవిడ్ 19 కు సంబంధించి ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసి, దాని వ్యాప్తిపై పోరాటం, సమర్థంగా అరికట్టే చర్యలను వేగవంతం చేసేందుకు, కేంద్ర ప్రభుత్వం 6 అంతర్ మంత్రిత్వ శాఖ బృందాలను ఏర్పాటు చేసింది.
Posted On:
20 APR 2020 1:47PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వం 6 అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందాలను (ఐఎంసిటిలు) ఏర్పాటు చేసింది. వీటిలో రెండు పశ్చిమ బెంగాల్‌కు, రెండు మహారాష్ట్రకు, ఒకటి మధ్యప్రదేశ్ , మరొకటి రాజస్థాన్‌కు నియమించారు. ఈ బృందాలు అక్కడికక్కడే పరిస్థితిని అంచనా వేసి సమస్య పరిష్కారానికి రాష్ట్రప్రభుత్వాలకు అవసరమైన ఆదేశాలు జారీ చేస్తుంది. అలాగే సాధారణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది. ఇండోర్ ( ఎంపి), ముంబాయి, పూణె( మహారాష్ట్ర), జైపూర్ (రాజస్థాన్), పశ్చిమబెంగాల్ లోని కోల్‌కతా, హౌరా, మిడ్నపూర్ ఈస్ట్, ఉత్తర 24 పరగణాలు, డార్జిలింగ్, కాలింపాంతగ్, జాల్పాయ్‌గురి లలో పరిస్థితి ప్రత్యేకంగా సీరియస్‌గా ఉంది.
ఐఎంసిటిలు ప్రభుత్వ నిబందనల ప్రకారం లాక్‌డౌన్ చర్యల అమలు విషయంలో ఫిర్యాదులు, నిత్యావసర సరకుల పంపిణీ, సామాజిక దూరం పాటింపు, ఆరోగ్య మౌలిక సదుపాయాల సంసిద్ధత, వైద్యరంగంలోని వారి భద్రత, పేదలు, కార్మికులకోసం ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలలో పరిస్థితులు వంటి వాటిపై దృష్టిపెడుతుంది.
హాట్‌స్పాట్ జిల్లాలలో లేదా హాట్‌స్పాట్ ప్రాంతాలుగా మారుతున్న వాటిలో లేదా పెద్ద ఎత్తున వైరస్ వ్యాపించిన ప్రాంతాలలో, వైరస్ వ్యాపించడానికి అవకాశం ఉన్న క్లస్టర్లలో లాక్‌డౌన్ నిబందనల ఉల్లంఘనలను ఏమాత్రం నియంత్రణ లేకుండా కొనసాగడానికి అనుమతిస్తే అది ఆయా జిల్లాల ప్రజలకు తీవ్ర ముప్పుగా పరిణమించడమే కాక దేశంలోని ఇతర ప్రాంతాలలో నివసిస్తున్నవారికి తీవ్ర ఆరోగ్య ముప్పును తెచ్చిపెట్టగలదు. ప్రధాన హాట్‌స్పాట్ జిల్లాలలో ఇలాంటి ఉల్లంఘనలను విశ్లేషించిన తర్వాత ,పైన పేర్కొన్న ప్రాంతాలలో పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని , అందువల్ల తమ నైపుణ్యాన్ని వినియోగించడం అవసరమన్న అభిప్రాయానికి కేంద్ర ప్రభుత్వం వచ్చింది.
.2005 విపత్తు నిర్వహణ చట్టం లోని సెక్షన్ 35(1),35(2)(ఎ), 35 (2)(ఇ), 35(2)(ఐ) అధికారాలను ఉపయోగించుకుని కేంద్ర ప్రభుత్వం ఈ కమిటీలను ఏర్పాటు చేసింది. లాక్‌డౌన్ ఉత్తర్వులు, ఇతర మార్గదర్శకాలు, సవరించిన ఉమ్మడి మార్గదర్శకాలలో లాక్‌డౌన్ నిబంధనలను, ఇతర చర్యలను కచ్చితంగా అమలు చేయాలని సూచించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రభుత్వం గుర్తు చేసింది. రాష్ట్రప్రభుత్వాలు, కేంద్ర పాలిత యంత్రాంగాలు కేంద్రం పేర్కొన్న మార్గదర్శకాలకు మించి కఠిననిబంధనలు అమలు చేయవచ్చుకాని విపత్తు నిర్వహణ చట్టం 2005 కింద జారీ చేసిన మార్గదర్శకాలను నీరుగార్చరాదని సూచించింది.
కేంద్రప్రభుత్వం 31.03.2020న రిట్‌పిటిషన్ 9సివిల్)నెంబర్ 468 ఆఫ్ 2020 పై ఉత్తర్వులు జారీ చేస్తూ, సుప్రీంకోర్టు రాష్ట్రప్రభుత్వాలు, పబ్లిక్ అథారిటీలు, దేశ ప్రజలు, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు, ఉత్తర్వులను ప్రజా రక్షణలో భాగంగా అక్షరాలా వాటి స్ఫూర్తితో పాటించాలని, పాటించగలరని విశ్వసిస్తున్నామని పేర్కొంది. సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలను ఆదేశాలుగా పాటించి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంత్ర ప్రభుత్వాలకు తెలియజేయడం జరిగింది.
కేంద్రప్రభుత్వం ఏర్పాటుచేసిన పై ఐఎంసిటిలు విపత్తు నిర్వహణ చట్టం 2005 కింద జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం లాక్‌డౌన్ చర్యల అమలుతీరుపై దృష్టిపెడుతుందని మరోసారి స్పష్టం చేశారు. అలాగే వారు నిత్యావసర సరకుల సరఫరా, ప్రజలు ఇళ్లనుంచి బయటకు వచ్చినపుడు సామాజిక దూరం పాటిస్తున్నారా లేదా, ఆరోగ్య మౌలిక సదుపాయాలు,ఆస్పత్రులలో సదుపాయాలు ,జిల్లాలొ నమూనా గణాంకాలు, ఆరోగ్య సిబ్బంది భద్రత, టెస్ట్ కిట్ ల లభ్యత, పిపిఇలు, మాస్క్‌లు ,ఇతర భద్రతా పరికరాలు,
పేదలు, కార్మికుల కోసం ఏర్పాటు చేసిన శిబిరాలలో పరిస్థితులు వంటి వాటిపై కూడా దృష్టిపెడతారు.
ఐఎంసిటిలు తమ పర్యటనలను వీలైనంత త్వరలో ప్రారంభిస్తాయి.
(Release ID: 1616399)
Visitor Counter : 325
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam