హోం మంత్రిత్వ శాఖ
గతంలో అనుమతించినట్టే నిత్యావసర వస్తువుల లావాదేవీలను కొనసాగించనున్న ఈ-కామర్స్ కంపెనీలు
ఈ-కామర్స్ కంపెనీల లావాదేవీలతో పాటు మొత్తం నిత్యావసర సరుకుల సరఫరా గొలుసు సజావుగా సాగేలా రాష్ట్రాలు తగు చర్యలు తీసుకోవాలి
प्रविष्टि तिथि:
19 APR 2020 6:45PM by PIB Hyderabad
కోవిడ్-19ని ఎదుర్కోడానికి దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కి సంబంధించి అన్ని మంత్రిత్వ శాఖలు / విభాగాలకు సూచించిన ఏకీకృత సవరించిన మార్గదర్శకాల ప్రకారం కొన్ని కార్యకలాపాల మినహాయింపునకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) ఆదేశాలు జారీ చేసింది.
(https://www.mha.gov.in/sites/default/files/MHA%20order%20dt%2015.04.2020%2C%20with%20Revised%20Consolidated%20Guidelines_compressed%20%283%29.pdf)
నేటి ఆదేశాల ప్రకారం ఈ-కామర్స్ కంపెనీలకు సంబంధించిన 14(v) నిబంధనను ఏకీకృత సవరించిన మార్గదర్శకాల నుండి మినహాయించారు. దీనిపై మళ్ళీ స్పష్టతను ఇస్తూ నిత్యావసరం కాని వస్తువుల లావాదేవీలకు ఈ-కామర్స్ కంపెనీలపై ఆంక్షలు కొనసాగుతాయి, అయితే గతంలో లాగే నిత్యావసర వస్తువులను మాత్రం ఆపరేట్ చేయడానికి ఈ-కామర్స్ కంపెనీలకు మార్గదర్శకాల్లో 13(i) నిబంధన కింద అనుమతి ఉంటుంది.
ఈ సమాచారాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపి, ఈ అంశాలను అన్ని క్షేత్ర స్థాయి ఏజెన్సీలకు, ప్రజలకు తెలిసేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. తద్వారా ఈ-కామర్స్ తో సహా నిత్యావసర వస్తువుల సరఫరా గొలుసు వ్యవస్థ సజావుగా పనిచేసేలా చూడాలని హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. తదనుగుణంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు జారీ చేసే ఆదేశాలు సక్రమంగా అమలయ్యేలా చూడాలని కేంద్ర ఆదేశాలు వెళ్లాయి.
Click here to see the Official Communication to States/UTs
(रिलीज़ आईडी: 1616167)
आगंतुक पटल : 315
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam