ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 అప్ డేట్‌

Posted On: 19 APR 2020 5:37PM by PIB Hyderabad

రాష్ట్రాలు , కేంద్ర‌పాలిత ప్రాంతాల‌ సమిష్టి కృషి ద్వారా కోవిడ్ -19 నివారణ, నియంత్రణ, నిర్వహణ కోసం భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. వీటిని క్రమం తప్పకుండా ఉన్న‌త‌ స్థాయిలో సమీక్ష‌చేస్తున్నారు.
ఔష‌ధ పరీక్షలు, టీకాలకు సంబంధించిన‌ శాస్త్ర‌ప‌రిశోధ‌న‌ల‌లో  పనిచేయడానికి ఉన్నత స్థాయి టాస్క్‌ఫోర్స్ ను ఏర్పాటు  చేశారు. ఈ టాస్క్‌ఫోర్స్‌కు నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం), ,ప్ర‌ధాన‌మంత్రికి శాస్త్ర వ్య‌వ‌హారాల ప్ర‌ధాన స‌ల‌హాదారు స‌హ అధ్య‌క్ష‌త వ‌హిస్తారు. వీరు కాకుండా, ఆయుష్, ఐసిఎంఆర్, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం, బయోటెక్నాలజీ, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ , ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్ఐఆర్), డిఆర్డిఓ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డిజిహెచ్ఎస్) , డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) ల ప్ర‌తినిధులు ఇందులో  స‌భ్యులుగా ఉంటారు.

టీకా అభివృద్ధికి సంబంధించిన అంశంపై అన్ని మంత్రిత్వ శాఖల కృషిని స‌మ‌న్వ‌యం చేయ‌డాన్ని  ఈ టాస్క్‌ఫోర్స్ వేగ‌వంతం చేస్తుంది.  అంతర్జాతీయ ప్రయత్నాల ద్వారా విద్యారంగంలోని సంస్థ‌లు, పరిశోధనా సంస్థలు జరిపిన పరిశోధన పనులను వేగవంతం చేయడానికి ఇది మరింత దోహదపడుతుంది. వ్యాక్సిన్ అభ‌వృద్ధికి డిపార్ట‌మెంట్ ఆఫ్ బ‌యోటెక్నాల‌జీ ఒక నోడ‌ల్ ఏజెన్సీ గా ఉంటుంది. వాక్సిన్ అభివృద్ధికి టాస్క్ ఫోర్స్ ద్వారా, మార్గాల‌ను గుర్తించ‌డంపై దీని కృషి కేంద్రీకృత‌మై ఉంటుంది.
 వాక్సిన్‌ అభివృద్ధిలో జాతీయ  అంతర్జాతీయ ప్రయత్నాల పురోగతిని ప్రభుత్వం  ఈ టాస్క్ ఫొర్స్ ద్వారా మ‌రింత  సులభతరం చేస్తుంది,దీనిని ఎప్ప‌టిక‌ప్పుడు  పర్యవేక్షిస్తుంది. ఈ టాస్క్ ఫోర్స్ వ్యాధుల‌కు సంబంధించి, వాటిని అదుపు చేయ‌డంపై మంచి అనుభ‌వం క‌లిగిన ప‌రిశోధ‌న బృందాల‌దీర్ఘ‌కాలిక ప్ర‌య‌త్నాల‌పై దృష్టిపెడుతుంది.

2020 ఏప్రిల్ 20 నుండి, కంటైన్‌మెంట్ లేని  ప్రాంతాల్లో పరిమితులనుస‌డ‌లిస్తారు., కాని హాట్‌స్పాట్ జిల్లాల్లోని కంటైన్ మెంట్‌ ప్రాంతాలకు ఎటువంటి సడలింపు ఇవ్వరు.. రాష్ట్రాలు , కేంద్ర‌పాలిత ప్రాంతాలు, స్థానిక అవసరాలకు అనుగుణంగా మరిన్ని అదనపు చర్యలను చేప‌ట్ట‌వ‌చ్చు.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం కంటైన్‌మెంట్‌ జోన్లు క్రింద ఇవ్వ‌డం జ‌రిగింది.:

హాట్ స్పాట్ ప్రాంతాలంటే కోవిడ్ -19 మ‌హ‌మ్మారి పెద్ద ఎత్తున విస్త‌రించిన ప్రాంతం లేదా  చెప్పుకోద‌గిన స్థాయి క్ల‌స్ట‌ర్ల‌లో వ్యాధి వ్యాప్తి చెందిన ప్రాంతాలు
నాలుగు రోజుల కంటే త‌క్కువ లో కేసులు రెట్టింపు రేటులో న‌మోదైన ప్రాంతాలు
కోవిడ్ -19 వైర‌స్  వ్యాప్తిని అరిక‌ట్టేందుకు హాట్‌స్పాట్ల‌లోప‌ల స్థానిక అధికార యంత్రాంగం కంటైన్‌మెంట్ జోన్లు, బ‌ఫ‌ర్ జోన్లుగా విభ‌జిస్తుంది.
కంటైన్‌మెంట్ జోన్ల‌లో, నిత్యావ‌స‌ర‌ సేవలు మినహా , ఇత‌ర  కార్యకలాపాలు అనుమతించరు. ఎంపిక చేసిన స‌డ‌లింపులు మంజూరు చేసిన ప్రాంతాల‌లో, రాష్ట్రాలు , కేంద్ర‌పాలిత ప్రాంతాలు,జిల్లా పాల‌నాయంత్రాంగాలు, ఇప్పటికే ఉన్న లాక్డౌన్ చర్యలను కఠినంగా పాటించేలా చూడాలి. కార్యాలయాలు, కర్మాగారాలు , ఆయా సంస్థలలో సామాజిక దూరానికి సంబంధించిన స్టాండ‌ర్డ్ ఆప‌రేటింగ్ ప్రోసీజ‌ర్ల (ఎస్ఒపి) ల ప్రకారం చ‌ర్య‌లు చేప‌ట్ట‌వ‌ల‌సి ఉంటుంది.

కొన్ని ప్రదేశాలకు కేసులు వస్తే ఇది  ఇత‌ర ప్రాంతాల‌కు విస్త‌రించే ప్ర‌మాదం ఉంది క‌నుక‌ , ఈ ప్రదేశాలు కూడా రెడ్ జోన్ ,కంటైన్‌మెంట్ జోన్‌లో భాగంగా మారవచ్చు. కంటైన్మెంట్‌ జోన్ల లో  క‌ఠినంగా లాక్డౌన్ చర్యలను అమలు చేయాలి, తద్వారా  ఆ ప్రాంతాలు  క్రమంగా సాధారణ స్థితికి రావ‌డానికి వీలుంటుంది.. స‌డ‌లింపు అమ‌లులో ఉన్న ప్రాంతాలు కూడా ఎస్‌.ఒ.పి ప్ర‌కారం నిబంధ‌న‌లు పాటిస్తూ వాటికి  క‌ట్టుబ‌డి ఉండాలి. సామాజిక దూరం పాటించ‌డం, ఇత‌ర జాగ్ర‌త్త చ‌ర్య‌ల వంటివి చేప‌ట్ట‌వ‌ల‌సి ఉంటుంది.

కేంద్ర , రాష్ట్రాల‌ స్థాయిల‌లో  21449 ప్ర‌త్యేక కోవిడ్‌ ఆస్పత్రులను గుర్తించారు, ఇందులో 755  కోవిడ్ ప్ర‌త్యేక  ఆస్పత్రులు కాగా , 1389  కోవిడ్  ప్ర‌త్యేక ఆరోగ్య కేంద్రాలు (DCHC) లుఉన్నాయి
.
దేశంలో మొత్తం 15,712 కోవిడ్ -19 నిర్ధారిత కేసులు న‌మోద‌య్యాయి. ఇందులో 2231 మంది అంటే మొత్తం కేసుల‌లో 14.19 శాతం మంది కి వ్యాధి న‌యం కాగా , వారిని ఆస్ప‌త్రినుంచి డిశ్చార్జి చేశారు.

గత 28 రోజులలో మహే (పుదుచ్చేరి) , కొడగ్గు (కర్ణాటక)ల‌లో  తాజా కోవిడ్ కేసులు న‌మోదు కాలేదు.   23 రాష్ట్రాలు కేంద్ర‌పాలిత ప్రాంతాల‌లోని 54 జిల్లాల‌లో గత 14 రోజులలో కోవిడ్ పాజిటివ్ కొత్త  కేసులు నమోదు కాలేదు. మునుపటి జాబితా కాకుండా, కొత్తగా 10 జిల్లాలు  చేర్చ‌డం జ‌రిగింది. అవి: గయ ,సరన్ (బీహార్); బరేలీ (ఉత్తర ప్రదేశ్); ఫతేగ‌ఢ్ సాహిబ్ , రూపానగర్ (పంజాబ్); భివానీ, హిసార్, ఫతేహాబాద్ (హర్యానా); కాచర్ , లఖింపూర్ (అస్సాం).

కోవిడ్ -19 కి సంబంధించి తాజా , అధీకృత స‌మాచారం , దీనికి సంబంధించిన సాంకేతిక అంశాలు, మార్గ‌ద‌ర్శ‌కాలు, ఇత‌ర సూచ‌న‌ల‌కోసం క్ర‌మం త‌ప్ప‌కుండా గ‌మ‌నించండి : https://www.mohfw.gov.in/.

కోవిడ్ -19 కి సంబంధించి సాంకేతిక అంశాల‌పై త‌మ ప్ర‌శ్న‌ల‌ను technicalquery.covid19[at]gov[dot]in  ఈమెయిల్‌కు పంపవ‌చ్చు. ఇత‌ర ప్ర‌శ్న‌ల‌ను ncov2019[at]gov[dot]in .కు పంప‌వచ్చు.

కోవిడ్ -19పై ఏవైనా ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాల కోసం కేంద్ర ఆరోగ్య‌,కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ హెల్ప్‌లైన్ నెంబ‌ర్ :  +91-11-23978046 లేదా 1075 (టోల్ ఫ్రీ) కు ఫోన్ చేయ‌వ‌చ్చు. కోవిడ్ -19 పై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల హెల్ప్‌లైన్ ల జాబితా కోసం కింది లింక్‌ను గ‌మ‌నించ‌వ‌చ్చు.
https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .

*****


(Release ID: 1616139) Visitor Counter : 153