ఆర్థిక మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 పరిణామాల నేపథ్యంలో జిఎస్ టి చెల్లింపుదారులకు సహాయం : సిబిఐసి
Posted On:
17 APR 2020 9:12PM by PIB Hyderabad
ప్రస్తుతం కోవిడ్-19 కారణంగా దేశంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా జిఎస్ టి పన్ను చెల్లింపుదారులకు అవసరమైన సహాయం అందించేందుకు పూర్తిగా కట్టుబడి ఉన్నట్టు కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సిబిఐసి) ప్రకటించింది.
2020 మార్చి 30 నుంచి తాము రూ.5,575 కోట్ల విలువ గల 12,923 రిఫండ్ దరఖాస్తులను ప్రాసెస్ చేసినట్టు తెలిపింది. గత వారం రోజుల వ్యవధిలోనే రూ.3854 కోట్ల విలువ గల 7873 దరఖాస్తులు ప్రాసెస్ చేసినట్టు వివరించింది.
జిఎస్ టి రిటర్న్ లు దాఖలు చేసిన వారికి సత్వరం ఐటిసి రిఫండ్ లు అందించేందుకు, అసంపూర్తి సమాచారం ఉన్న రిటర్న్ లు మాత్రం ప్రాసెస్ చేయకుండా ఉంచేందుకు 31.03.2020 తేదీ నాటి 133 సర్కులర్ పరిధిలో తీసుకున్న వాణిజ్య, వ్యాపార మిత్ర చర్యలను కోవిడ్-19 వంటి సంక్షోభ సమయంలో పన్ను చెల్లింపుదారులను ఇబ్బంది పెట్టే చర్యలుగా సోషల్ మీడియాలోను, ఇతర మీడియాలోను తప్పుడు ప్రచారం జరిగిందని సిబిఐసి తెలిపింది.
14.03.2020న జరిగిన జిఎస్ టి కౌన్సిల్ 39వ సమావేశంలో ఆమోదించిన మేరకు అమలులోకి వచ్చిన నిబంధనల పరిధిలోనే నకిలీ ఐటిసి క్లెయిమ్ లు ప్రాసెస్ చేయకుండా, నిజాయతీతో పన్నులు చెల్లించిన వారికి ఐటిసి రిఫండ్ లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్టు వివరించింది. పన్ను చెల్లింపుదారులు సహా విభిన్న వర్గాలు ఆ విషయం జిఎస్ టిసికి తెలియచేశారని పేర్కొంది. వాస్తవానికి రిఫండ్ క్లెయిమ్ లు ప్రాసెస్ చేయడంలో భాగంగా సేవలు లేదా కొన్ని వర్గీకరణల్లోకి వచ్చే పెట్టుబడి వస్తువులపై క్రెడిట్ ఉపయోగించుకున్నారా లేదా అనేది తనిఖీ చేయడానికి చాలా సమయం పడుతూ ఉంటుందని గుర్తించినట్టు తెలిపింది.
ఈ గణాంకాలన్నీ క్లెయిమ్ ప్రాసెస్ చేసే సమయానికే సమర్పించడంలో వాణిజ్య వర్గాల ఇబ్బందిని, అందుకు చాలా సమయం పడుతుందని, ఆ నిబంధనకు కట్టుబడేందుకు అయ్యే వ్యయాలు కూడా పెరిగిపోతాయన్న అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని వర్గీకరణ కోడ్ ప్రకటన కూడా దరఖాస్తులో భాగంగా చేయాలని జిఎస్ టి కౌన్సిల్ నిర్ణయించిందని సిబిఐసి తెలిపింది. అలాగే ఎగుమతిదారుల రిఫండ్ క్లెయిమ్ ల సత్వర పరిష్కారానికి వీలుగా పన్ను కాలపరిమితులను విభిన్న ఆర్థిక సంవత్సరాల్లో గుది గుచ్చడానికి కూడా అనుమతించాలని అదే సమావేశంలో జిఎస్ టి కౌన్సిల్ నిర్ణయించిందని సిబిఐసి తెలిపింది. 2020 మార్చి 31వ తేదీ తర్వాత వచ్చిన దరఖాస్తులకు మాత్రమే ఇది వర్తిస్తుందని పేర్కంది. అంతే కాదు, మార్చి 20వ తేదీ నుంచి జూన్ 29 తేదీల మధ్యలో సమర్పించాల్సిన దరఖాస్తులకు గడువు తేదీని జూన్ 6 వరకు పొడిగించినట్టు కూడా తెలిపింది.
రిఫండ్ దరఖాస్తులకు సంబంధించి హెచ్ ఎస్ఎన్/ ఎస్ఏసి కోడ్ ఇవ్వడానికే సర్కులర్ 133 (తేదీ 31.03.2020) జారీ చేసినట్టు సిబిఐసి వివరణ ఇచ్చింది. అయితే కొన్ని వర్గీకరణల్లోకి వచ్చే సేవలు, పెట్టుబడి ఉపకరణాలకు జిఎస్ టి చట్టంలోని నిబంధనల ప్రకారం రిఫండ్ వర్తించదు. ఉదాహరణకి పెట్టుబడి ఉపకరణాలపై ఇచ్చే ఐటిసి... ఎగుమతి, ఇతర జీరో సుంకాలు వర్తించే సరఫరాల కోసం కొనుగోలు చేసే పెట్టుబడి ఉపకరణాలకు వర్తించదు. అలాగే సేవలు, పెట్టుబడి ఉపకరణాలపై ఇస్తున్న ఐటిసి ఇన్వర్టెడ్ రిఫండ్ విధానంలో వర్గీకరణలోకి వచ్చే వాటికి ఇవ్వరు.
(Release ID: 1615616)
Visitor Counter : 238