రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ఆర్మీ సిబ్బందిని తరలించడానికి ప్రత్యేక రైలు

प्रविष्टि तिथि: 17 APR 2020 6:35PM by PIB Hyderabad

బెంగళూరు, బెల్గాం మరియు సికిందరాబాదుల్లో వృత్తిపరమైన ప్రత్యేక కోర్సును పూర్తి చేసుకున్న సుమారు 950 మంది ఆర్మీ సిబ్బందిని ఉత్తర భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో వారి విధులను నిర్వర్తించడానికై వారిని తరలించేందుకు ఈ రోజు(17 ఏప్రిల్ 2020)న ప్రత్యేక రైలు బెంగళూరు నుండి బయలుదేరింది. ఇందులోని ఆర్మీ సిబ్బంది అందరూ కూడా తప్పనిసరియైన  క్వారంటైన్ కాలాన్ని పూర్తిచేసుకుని పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. ఈ ప్రత్యేక రైలు 20 ఏప్రిల్ 2020 నాటికి గమ్యస్థానానికి చేరుకుంటుంది.

కొవిడ్-19 వ్యాప్తి నిరోధ ప్రక్రియలో భాగంగా ఈ ప్రత్యేక రైలు యొక్క అన్ని బోగీలు, సిబ్బంది సామాను మరియు స్టేషన్లలోని ప్లాట్ఫాంలతో సహా శుభ్రపరచడానికి ప్రత్యేక సానిటేషన్ టన్నెల్ను అదనంగా ఏర్పాటు చేసారు. వీరిని రైలు ఎక్కేటప్పుడు మరియు తరలించేటప్పుడు సామాజిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకున్నారు.  తదనంతరం ఈశాన్య భారతానికి  ఆర్మీ సిబ్బందిని తరలించడానికి మరొక రైలు నియమిత సమయంలో బయలుదేరనుంది.

 

***


(रिलीज़ आईडी: 1615494) आगंतुक पटल : 192
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Punjabi , Gujarati , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Tamil , Kannada