హోం మంత్రిత్వ శాఖ

కోవిడ్-19పై పోరాటంలో భాగంగా విధించిన లాక్ డౌన్ పరిమితుల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో మైనర్ అటవీ ఉత్పత్తులు, ఉద్యానవన తోటలు, ఎన్ బిఎఫ్ సిలు, సహకార పరపతి సంఘాలు, నిర్మాణ కార్యక్రమాలకు మినహాయింపులు ఇస్తూ హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ

Posted On: 17 APR 2020 10:42AM by PIB Hyderabad

కోవిడ్-19పై పోరాటంలో భాగంగా అమలులో ఉన్న జాతీయ స్థాయి లాక్ డౌన్ నుంచి కొన్ని కార్యకలాపాలకు మినహాయింపు ఇస్తూ సవరించిన ఏకీకృత మార్గదర్శకాలపై హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) ఉత్తర్వులు జారీ చేసింది.
 https://www.mha.gov.in/sites/default/files/MHA%20order%20dt%2015.04.2020%2C%20with%20Revised%20Consolidated%20Guidelines_compressed%20%283%29.pdf 
 
హోంమంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఈ దిగువన పొందుపరిచిన కార్యకలాపాలు కొన్నింటికి లాక్ డౌన్ పరిమితుల నుంచి మినహాయింపు ఇచ్చింది.
- అటవీ ప్రాంతాల్లో నివశిస్తున్న షెడ్యూల్డు తెగలు, ఇతర వర్గాల అటవీ జాతులకు తేలికపాటి అటవీ ఉత్పత్తులు (ఎంఎఫ్ పి)/ కలపేతర అటవీ ఉత్పత్తుల (ఎన్ టిఎఫ్ పి) పెంపకం, సేకరణ, ప్రాసెసింగ్ కార్యకలాపాలు 
- వెదురు, కొబ్బరి, వక్క, కోకో, సుగంధ ద్రవ్యాల తోటల పెంపకం, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, విక్రయం, మార్కెటింగ్ కార్యకలాపాలు
- నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలు (ఎన్ బిఎఫ్ సి), హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (హెచ్ఎఫ్ సి), సూక్ష్మ రుణ కంపెనీలు (ఎన్ బిఎఫ్ సి-ఎంఎఫ్ఐ) కనీస సిబ్బందితో పని చేసేందుకు అనుమతి 
- సహకార పరపతి సంఘాలు
- నీటి సరఫరా, పారిశుధ్యం, విద్యుత్ ట్రాన్స్ మిషన్ లైన్ల నిర్మాణం, టెలికాం ఆప్టికల్ ఫైబర్, కేబుల్స్ వేయడం వంటి కార్యకలాపాలు

 



(Release ID: 1615288) Visitor Counter : 192