ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 అప్ డేట్స్
Posted On:
16 APR 2020 6:18PM by PIB Hyderabad
రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాల సమిష్టి కృషి ద్వారా కోవిడ్ -19 నివారణ, నియంత్రణ, నిర్వహణ కోసం భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. వీటిని క్రమం తప్పకుండా ఉన్నత స్థాయిలో సమీక్ష,పర్యవేక్షణ చేస్తున్నారు.
భారతదేశంలో కోవిడ్ -19 నియంత్రణ చర్యలపై కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ నిన్న ఆరోగ్య కార్యకర్తలు , సీనియర్ అధికారులతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్ర డాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ, జిల్లాల స్థాయిలో పనిచేసే డబ్ల్యు.హెచ్.ఒ అధికారులు, క్లస్టర్‌ల కోసం మైక్రో ప్లాన్‌ల అభివృద్ధికి సాంకేతిక సమన్వయం చేస్తున్నారని, రాష్ట్రాలు , కేంద్ర పాలిత అధికారులతో కలిసి వైరస్ వ్యాప్తి చెందకుండా చూస్తున్నారని, జిల్లాలలో నిరంతర నిఘా కోసం ఒక వ్యూహాన్ని రూపొందించడంలో వారికి సహాయపడుతున్నారని చెప్పారు . ట్రాన్స్‌మిషన్ తీరు, కేసుల పరీక్షల ఆధారంగా నిఘా, చర్యలను మరింత బలోపేతం చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ జాతీయ పోలియో నిఘా నెట్‌వర్క్ బృందం, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు మద్దతు ఇస్తుంది.
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) భారతీయ పరిశ్రమ నాయకులతో ఒక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో డాక్టర్ హర్షవర్ధన్ పాల్గొన్నారు. పిఎమ్-కేర్స్ నిధికి సహకరించినందుకు హర్షవర్ధన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. వారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ప్రభుత్వానికి తెలుసునని, ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం కోసం తీసుకుంటున్న చర్యల సందర్భంలో వారి సమస్యలను పరిష్కరిస్తామని ఆయన వారికి హామీ ఇచ్చారు. కోవిడ్ -19 నుంచి ఎదురైన సవాలును తట్టుకోవడానికి ఆరోగ్య సంరక్షణలో మేక్ ఇన్ ఇండియా అవకాశాలను బాగా ఉపయోగించుకోవాలని డాక్టర్ హర్షవర్ధన్ సూచించారు., తద్వారా దేశం క్లిష్టమైన ఆరోగ్య సంరక్షణ పరికరాలను అందించడంలో మరింత స్వావలంబన సాధించగలుగుతుందన్నారు.
లాక్‌డౌన్ సమయంలో సురక్షితమైన తాగునీటి పద్ధతులను అలవరచుకోవలసిందిగా కోరుతూ ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రజలకు సూచించింది. సహాయ శిబిరాలు, సమాజంలోని బలహీన వర్గాలపై ప్రత్యేక దృష్టి సారించి నీటి సరఫరాను పెంచాలని ప్రజారోగ్య శాఖలకు సూచించింది. క్లోరిన్ మాత్రలు, బ్లీచింగ్ పౌడర్ హైపోక్లోరైట్ ద్రావణాన్ని సముచితంగా వాడటం కూడా మంచిదని సూచించింది.
కోవిడ్ వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితులలో ఆరోగ్య వ్యవస్థపై పడిన డిమాండ్‌ను ఎదుర్కోవడానికి అవసరమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడానికి వీలుగా ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు ,కేంద్రపాలిత ప్రాంతాలకు వివరణాత్మక మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ సేవలలో తల్లి పిల్లల ఆరోగ్యం, అంటువ్యాధుల నివారణ , నిర్వహణ, సమస్యలను పరిష్కరించడం, దీర్ఘకాలిక వ్యాధుల చికిత్స , అత్యవసర సేవలు అందించడం వంటివి ఉన్నాయి. ఇదే సందర్బంలో ఆరోగ్య కార్యకర్తల రక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించింది. అలాగే కోవిడ్ -19 ప్రత్యేక సదుపాయాలు, ఇతర సదుపాయాలను లాభాపేక్ష లేని, ప్రైవేటు సంస్థల సహకారంతో నిర్వహించాలని సూచించింది. ఆస్పత్రులలొ రద్దీ పెరగకుండా టెలి హెల్త్ సేవలను ప్రోత్సహించాలని సూచించింది. లాక్‌డౌన్ లేదా ఆంక్షల కాలంలో రోగనిరోధకత , గర్భస్థ శిశు సంరక్షణ వంటి సేవలను పునర్వ్యవస్థీకరించాలని సూచించారు. లేదంటే సామాజిక దూరం , వైరస్ వ్యాప్తినిరధానికి సంబంధించిన ప్రోటోకాల్ నియమాలకు అనుగుణంగా అటువంటి సేవలకు ప్రత్యేక రోజులు నిర్ణయించవచ్చని సూచించడం జరిగింది..
గర్భిణులు, పిల్లలు (తీవ్ర,పౌష్టికాహారలోపం కలిగినవారు), టిబి, లెప్రసీ,హెచ్.ఐ.వి, వైరల్ హెపటైటిస్,సిఒపిడి, డయాలసిస్ కేసులను ఆయుష్మాన్ భారత్ హెల్త్, వెల్‌నెస్‌సెంటర్లు(హెచ్‌డబ్ల్యుసిలు), సబ్ హెల్త్‌సెంటర్ లోని ప్రైమరీ హెల్త్ కేర్ బృందం ద్వారా ఎప్పటికప్పడు కనిపెట్టి ఉండాలి.
ఇవాల్టి వరకూ కోవిడ్ -19 నిర్ధారిత కేసులు దేశవ్యాప్తంగా 12,380 నమోదు కాగా, 1489 మందికి వ్యాధి నయమై ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. కోవిడ్ -19 కేసుల మరణాల రేటు (సిఎఫ్ఆర్) భారతదేశంలో 3.3 గా ఉంది. కోలుకున్న వారి శాతం 12.02 శాతం.
ఇప్పటివరకూ, 325 జిల్లాలలో ఏ కేసులూ నమోదు కాలేదు. మహే, పుదుచ్చేరిలలో గత 28 రోజులలో ఎలాంటి పాజిటివ్ కేసులూ నమోదు కాలేదు. కింద పేర్కొన్న జిల్లాలలో గత 14 రోజులలో ఎలాంటి కేసులు నమోదు కాలేదు.
రాష్ట్రం
|
జిల్లాలు
|
జిల్లాల పేర్లు
|
బీహార్
|
1
|
పాట్నా
|
పశ్చిమబెంగాల్
|
1
|
నదియా
|
రాజస్థాన్
|
1
|
ప్రతాప్ ఘడ్
|
గుజరాత్-
|
2
|
గిర్ సోమనాథ్ పోర్‌బందర్
|
తెలంగాణ-
|
1
|
భద్రాద్రి కొత్తగూడెం
|
గోవా-
|
1
|
దక్షిణగోవా
|
ఉత్తరాఖండ్
|
1
|
పౌరి గర్వాల్
|
యుపి-
|
1
|
ఫిలిబిత్
|
జమ్ముకాశ్మీర్ -
|
1
|
రాజౌరి
|
మణిపూర్ -
|
1
|
ఇంఫాల్ వెస్ట్
|
ఛత్తీస్‌ఘడ్-
|
3
|
బిలాస్‌పూర్,దుర్గ్,రాజనందగావ్, రాయ్‌పూర్
|
మిజోరం
|
1
|
ఐజ్వాల్ వెస్ట్
|
కర్ణాటక-
|
5
|
దావణగేరె,కొడగు, తుముకూరు, బళ్లారి, ఉడుపి
|
కేరళ-
|
2
|
వయనాడ్, కొట్టాయం
|
పంజాబ్
|
2
|
- ఎస్‌బిఎస్ నగర్,
హోషియార్‌పూర్ (29-03-2020)
|
హర్యానా-
|
2
|
పానిపట్
రోహతక్ (30-03-2020)
|
మధ్యప్రదేశ్ -
|
1
|
శివపురి
|
కోవిడ్ -19 కి సంబంధించి తాజా , అధీకృత సమాచారం , దీనికి సంబంధించిన సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, ఇతర సూచనలకోసం క్రమం తప్పకుండా గమనించండి : https://www.mohfw.gov.in/.
కోవిడ్ -19 కి సంబంధించి సాంకేతిక అంశాలపై తమ ప్రశ్నలను technicalquery.covid19[at]gov[dot]in ఈమెయిల్‌కు పంపవచ్చు. ఇతర ప్రశ్నలను ncov2019[at]gov[dot]in .కు పంపవచ్చు.
కోవిడ్ -19పై ఏవైనా ప్రశ్నలకు సమాధానాల కోసం కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్‌లైన్ నెంబర్ : +91-11-23978046 లేదా 1075 (టోల్ ఫ్రీ) కు ఫోన్ చేయవచ్చు. కోవిడ్ -19 పై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల హెల్ప్‌లైన్ ల జాబితా కోసం కింది లింక్‌ను గమనించవచ్చు.
https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .
(Release ID: 1615172)
Visitor Counter : 330
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam