హోం మంత్రిత్వ శాఖ

జూమ్ సమావేశ వేదిక ను సురక్షితంగా ఉపయోగించేందుకు సూచనలను జారీ చేసిన ఎమ్.హెచ్.ఏ.

Posted On: 16 APR 2020 4:30PM by PIB Hyderabad

జూమ్ సమావేశ వేదిక ను ప్రయివేటు వ్యక్తులు సురక్షితంగా ఉపయోగించుకునేందుకు వీలుగా, కేంద్ర హోం మంత్రిత్వశాఖ (ఎమ్.హెచ్.ఏ.) కింద పనిచేస్తున్న సైబర్ సమన్వయ కేంద్రం సూచనలు జారీ చేసింది.  ఈ వ్యవస్థను అధికారిక కార్యక్రమాల కోసం ఉపయోగించవద్దని ప్రభుత్వ అధికారులకు సూచించింది. 

గతంలో కూడా ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (సీ.ఈ.ఆర్.టి.-ఇన్) జారీ చేసిన సూచనలను ప్రస్తావిస్తూ, జూమ్ సురక్షితమైన వేదిక కాదనే విషయాన్ని ఈ సూచనల్లో మళ్ళీ పేర్కొనడం జరిగింది. తమ ప్రయివేటు అవసరాలకోసం ఈ వేదికను ఉపయోగిస్తున్న ప్రైవేట్ వ్యక్తులకు రక్షణ కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ మార్గదర్శకాలను జారీ చేయడం జరిగింది. 

 

జూమ్ సమావేశం నిర్వహించే గదిలోకి అనధికారికంగా ఎవరూ ప్రవేశించకుండా నిరోధించడం, సమావేశంలో పాల్గొన్న ఇతర వినియోగదారుల టెర్మినల్స్ పై హానికరమైన దాడి చేయకుండా అరికట్టడమే, ఇప్పుడు ఈ మార్గదర్శకాలను జారీ చేయడానికి ప్రధాన కారణం. 

జూమ్ సమావేశ వేదిక ను ఉపయోగించే  ప్రయివేటు వ్యక్తులు  తీసుకోవలసిన  రక్షణ చర్యల వివరాలను  ఈ లింక్   ( link )  ద్వారా పొందవచ్చు.   

 *****


(Release ID: 1615162) Visitor Counter : 273