ఆర్థిక మంత్రిత్వ శాఖ

ఆరోగ్య ,మోటారు (థ‌ర్డ్ పార్టీ) ఇన్సూరెన్సు పాల‌సీ హోల్డ‌ర్లు కోవిడ్ -19 లాక్‌డౌన్‌కాలంలో ప్రీమియం బ‌కాయి క‌లిగిన వారు త‌మ చెల్లింపుల‌ను మే 15 వ‌ర‌కూ చెల్లించేందుకు అనుమ‌తి పాలసీ కొనసాగింపు,ఇబ్బందులు లేకుండా గ్రేస్ పీరియ‌డ్ లో క్లెయిమ్‌ల ప‌రిష్కారానికి ఏర్పాటు

Posted On: 16 APR 2020 11:23AM by PIB Hyderabad

కోవిడ్ -19 లాక్ డౌన్ స‌మ‌యంలో హెల్త్‌, మొటార్ (థ‌ర్డ్ పార్టీ) ఇన్సూరెన్సు పాల‌సీలు రెన్యువ‌ల్‌కు ఉన్నవారి ఇబ్బందుల‌ను తొల‌గించ‌డానికి , అలాంటి పాల‌సీదారులు ప్రీమియం చెల్లింపు గ‌డువును మే 15 వ‌ర‌కూ పొడిగిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఇది పాల‌సీదారుల‌కు పాల‌సీ క‌వరేజ్‌ని కొన‌సాగించ‌డంతోపాటు, గ్రేస్‌పీరియ‌డ్‌లో ఇబ్బందులు లేకుండా క్లెయిమ్ ల ప‌రిష్కారానికి వీలు క‌ల్పిస్తుంది.
మార్చి 25,2020 నుంచి మే 3,2020 మ‌ధ్య  హెల్త్‌, మోటార్ వెహికిల్ (థ‌ర్డ్‌పార్టీ ) ఇన్సూరెన్సు పాల‌సీల  రెన్యువ‌ల్ చేసుకోవ‌ల‌సి ఉండి,కోవిడ్ -19 లాక్ డౌన్ కార‌ణంగా ప్రస్తుతం దేశంలో నెల‌కొన్న ప‌రిస్థితుల‌లో ఇన్సూరెన్స్ సంస్థ‌కు రెన్యువ‌ల్‌ ప్రీమియం చెల్లించ‌లేక‌పోయిన వారు, చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన థ‌ర్డ్ పార్టీ మోటార్ వెహికిల్ ఇన్సూరెన్స్ క‌వ‌ర్‌ను పాల‌సీ రెన్యువ‌ల్ తేదీనుంచి కొన‌సాగించ‌డానికి ప్రీమియంను 2020 మే 3 వ తేదీలోగా  చెల్లించ‌వ‌చ్చు. దీనివ‌ల్ల గ్రేస్ పీరియ‌డ్‌లో ఏవైనా అర్హ‌త క‌లిగిన క్లెయిమ్‌లు ఉంటే వాటిని  చెల్లిస్తారు.
 .

*********


(Release ID: 1615001) Visitor Counter : 247