PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 15 APR 2020 6:49PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు

పీఐబీ వాస్తవాలను నిఖీచేసిన అంశాలు ఇందులో భ్యవుతాయి)

  • నిన్నటినుంచి 1,076 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసులు 11,439కి చేరగా, మరణాల సంఖ్య 377గా ఉంది.
  • దేశంలోని జిల్లాల్లో హాట్‌స్పాట్‌, నమోదయ్యే కేసులనుబట్టి హాట్‌స్పాటేతర, గ్రీన్‌జోన్‌ జిల్లాలుగా విభజిస్తారు.
  • దిగ్బంధ కాలంలో పాటించాల్సిన సవరించిన ఏకీకృత మార్గదర్శకాలను దేశీయాంగ శాఖ విడుదల చేసింది; నియంత్రణ మండళ్ల పరిధిలో నిషేధిత-ఆమోదిత అంశాలుసహా ఏప్రిల్ 20 నుంచి అనుమతించే నిర్దిష్ట అంశాలను ఇందులో వివరించింది
  • కోవిడ్‌-19 పరిస్థితి నేపథ్యంలో పన్నుచెల్లింపుదారులకు ఊరట దిశగా సీబీడీటీ 10.2 లక్షల వాపసుల కింద రూ.4,250 కోట్లను విడుదల చేసింది.
  • రాష్ట్రాల మధ్య నశ్వర వస్తు రవాణాకోసం అఖిలభారత వ్యవసాయ రవాణా సహాయ కేంద్రం ప్రారంభం
  • దిగ్బంధ కాలంలో ఇప్పటిదాకా 1.27 కోట్ల మంది యాచకులు/అనాథలు/నిరాశ్రయులకు సామాజిక న్యాయశాఖ ఉచిత భోజనం అందించింది

 

కోవిడ్-19పై ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నుంచి తాజా సమాచారం

దేశంలో నిన్నటినుంచి కొత్తగా 1,076 కేసుల నమోదుతో మొత్తం కేసులు 11,439కి చేరగా, మొత్తం మరణాల సంఖ్య 377గా ఉంది. వైరస్ బారినపడి కోలుకున్న/పూర్తిగా నయమైన 1,306 మంది ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లారు. ఇక దేశంలోని జిల్లాలను హాట్స్పాట్ జిల్లాలు, కొత్త కేసుల నమోదునుబట్టి హాట్స్పాటేతర జిల్లాలు, గ్రీన్జోన్ జిల్లాలుగా విభజిస్తారు. కాగా, మంత్రిమండలి కార్యదర్శి ఇవాళ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వ్యాధిగ్రస్థులతో సంబంధాలున్న వారి అన్వేషణ కోసం ప్రత్యేక బృందాలతో ఇంటింటి సర్వే చేయించనున్నారు. బృందాల్లో ఆరోగ్య, స్థానిక రెవెన్యూ, కార్పొరేషన్ సిబ్బందిసహా రెడ్క్రాస్, ఎన్ఎస్ఎస్, ఎన్వైకే తదితర స్వచ్ఛంద కార్యకర్తలు సభ్యులుగా ఉంటారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614877

దేశంలో కోవిడ్-19 నియంత్రణ కోసం సవరించిన ఏకీకృత మార్గదర్శకాలు విడుదల చేసిన దేశీయాంగ శాఖ

దేశంలో కోవిడ్-19 వ్యాప్తి నియంత్రణ కోసం కేంద్ర మంత్రిత్వశాఖలు, రాష్ట్ర్ర/కేంద్రపాలిత ప్రభుత్వాలు దిగ్బంధం సమయంలో చేపట్టాల్సిన చర్యలను వివరిస్తూ దేశీయాంగ శాఖ సవరించిన ఏకీకృత మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇందులో కోవిడ్-19 నిర్వహణపై జాతీయ ఆదేశాలతోపాటు ఆఫీసులు, పని ప్రదేశాలు, ఫ్యాక్టరీలు, సంస్థలు తదితరాల్లో సామాజిక దూరం పాటింపుపై ప్రామాణిక నిర్వహణ ప్రక్రియలను కూడా సూచించింది. అలాగే దిగ్బంధం నిబంధనల ఉల్లంఘనను విపత్తు నిర్వహణ చట్టం-2005, భారత శిక్షాస్మృతి-1860లోని వివిధ సెక్షన్ల కింద శిక్షార్హంగా పరిగణించి కేసులు నమోదు చేస్తారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614715

సవరించిన ఏకీకృత మార్గదర్శకాలు జారీచేసిన దేశీయాంగ శాఖ

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రకటనలకు అనుగుణంగా జాతీయ దిగ్బంధాన్ని 2020 మే 3 తేదీదాకా పొడిగిస్తూ 2020 ఏప్రిల్ 14 తేదీతో ఉత్తర్వులు జారీచేసింది. దీంతోపాటు 2020 ఏప్రిల్ 15 తేదీన మరొక తాజా ఉత్తర్వు ఇచ్చింది. దీని ప్రకారం... రాష్ట్ర/కేంద్రపాలిత ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు కోవిడ్-19 నియంత్రణ మండళ్లుగా ప్రకటించని ప్రాంతాల్లో నిర్దేశిత అదనపు కార్యకలాపాలను అనుమతిస్తారు. అలాగే దీనికి అనుబంధంగా 2020 ఏప్రిల్ 15 తేదీనాడే జారీచేసిన ఆదేశాల కింద సవరించిన ఏకీకృత మార్గదర్శకాలను దేశీయాంగ శాఖ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 2020 ఏప్రిల్ 20 నుంచి నిషేధిత; నియంత్రణ మండళ్లలో అనుమతించబడిన, ఇతర ప్రాంతాల్లో నిర్దిష్ట అనుమతిగల కార్యకలాపాల గురించి మార్గదర్శకాలలో విశదీకరించింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614671

కోవిడ్-19 నియంత్రణార్థం చేపట్టిన దిగ్బంధ కాలపు చర్యలు 2020 మే 3వతేదీదాకా కొనసాగుతాయి

దేశంలో కోవిడ్-19 నియంత్రణార్థం దేశీయాంగ శాఖ విడుదల చేసిన ఏకీకృత మార్గదర్శకాల్లో పేర్కొన్న దిగ్బంధ చర్యలు 2020 మే 3 తేదీదాకా అమలులో ఉంటాయని కేంద్ర ప్రభుత్వం ఇవాళ అన్ని మంత్రిత్వశాఖలు/విభాగాలు, రాష్ట్ర/కేంద్రపాలిత ప్రభుత్వాలు, ఇతర ప్రాధికార సంస్థలకు పంపిన ఆదేశాలలో పేర్కొంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614615

కోవిడ్-19 పరిస్థితుల నడుమ పన్నుచెల్లింపుదారులకు ఊరటనిస్తూ 10.2 లక్షల వాపసు పరిష్కారాలద్వారా రూ.4,250 కోట్లు విడుదల చేసిన సీబీడీటీ

కోవిడ్-19 మహమ్మరి పీడిస్తున్న వేళ పన్ను చెల్లింపుదారులకు ఊరటనిచ్చేలా పెండింగ్లోగల రూ.5 లక్షల లోపు ఆదాయపు పన్ను వాపసు చేయాలన్న ప్రభుత్వం ఆదేశాలను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు-సీబీడీటీ అమలు చేసింది. మేరకు 2020 ఏప్రిల్ 14నాటికి 10.2 లక్షల వాపసు అభ్యర్థనలను పరిష్కరించి రూ.4,250 కోట్లు విడుదల చేసింది. కాగా, ఏడాది మార్చి 31దాకా పరిష్కరించిన 2019-20 ఆర్థిక సంవత్సరపు 2.50 కోట్ల వాపసు అభ్యర్థనలకు ఇవి అదనమని, వీటికింద రూ.1.84 లక్షల కోట్లు విడుదల చేశామని సీబీడీటీ గుర్తుచేసింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614811

దిగ్బంధం వేళ రాష్ట్రాల మధ్య నశ్వర వస్తు రవాణా కోసం ‘1800-180-4200, 14488’ నంబర్లతో అఖిలభారత వ్యవసాయ రవాణా సహాయ కేంద్రం ప్రారంభం

కోవిడ్-19 ముప్పువల్ల దేశంలో ప్రస్తుతం దిగ్బంధం కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రాల మధ్య నశ్వర వస్తువుల నిరాటంక రవాణా కోసం కేంద్ర వ్యవసాయ-రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ఇవాళ ఢిల్లీలోని కృషి భవన్లో అఖిలభారత వ్యవసాయ రవాణా సహాయ కేంద్రాన్ని ప్రారంభించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614697

దిగ్బంధం మొదలైన నాటినుంచి దేశవ్యాప్తంగా 1.27 కోట్ల మంది యాచకులు/అనాథలు/నిరాశ్రయులకు ఉచిత భోజనం అందించిన సామాజిక న్యాయం-సాధికారత మంత్రిత్వ శాఖ

దేశంలో దిగ్బంధం మొదలైనప్పటినుంచి సామాజిక న్యాయం-సాధికారత మంత్రిత్వశాఖ ప్రధాన పురపాలక సంస్థల సహకారంతో 2020 ఏప్రిల్ 10 తేదీదాకా 1.27 కోట్ల మంది యాచకులు/అనాథలు/నిరాశ్రయులకు ఉచిత భోజనం అందించింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614876

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ-పాలస్తీనా అధ్యక్షుడి మధ్య టెలిఫోన్ సంభాషణ

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ పాలస్తీనా అధ్యక్షుడు గౌరవనీయ మహమూద్ అబ్బాస్తో టెలిఫోన్లో సంభాషించారు. కోవిడ్-19 మహమ్మారి విసిరిన సవాళ్ల గురించి, పరిస్థితులను చక్కదిద్దడంలో తమతమ దేశాల్లో తీసుకున్న చర్యల గురించి దేశాధినేతలిద్దరూ చర్చించుకున్నారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614436

దిగ్బంధం సమయంలో రైతులకు, వ్యవసాయానికి అగ్ర ప్రాధాన్యం ఇవ్వాలి: కేంద్ర-రాష్ట్రాలకు ఉప రాష్ట్రపతి సూచన

దేశంలో దిగ్బంధం కొనసాగినంత కాలం రైతులకు, వ్యవసాయానికి అగ్ర ప్రాధాన్యం ఇవ్వాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. వ్యవసాయ కార్యకలాపాలతోపాటు పంట ఉత్పత్తుల రవాణా సజావుగా సాగిపోయేలా చూడాలని కోరారు. వ్యవసాయ రంగాన్ని రక్షించేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ తీసుకున్న చర్యలను మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ఉప రాష్ట్రపతికి వివరించిన సందర్భంగా ఆయన సూచనలు చేశారు. అటు ఉత్పత్తిదారుల ఇటు వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించాలని కూడా కోరారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614791

దిగ్బంధం సమయంలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు ప్రోత్సాహంపై వ్యవసాయ-సహకార-రైతు సంక్షేమ శాఖ చర్యలు

దిగ్బంధ సమయంలో రైతులకు, వ్యవసాయ కార్యకలాపాలకు క్షేత్రస్థాయిలో వెసులుబాటు కల్పించేందుకు కేంద్ర వ్యవసాయ-సహకార-రైతు సంక్షేమ శాఖ అనేక చర్యలు చేపట్టింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614534

ప్రజలకు అత్యవసర మందుల సరఫరాలో ప్రభుత్వం, విమానయాన పరిశ్రమ చిత్తశుద్ధి

కోవిడ్-19పై జాతి పోరాటానికి మద్దతునివ్వాలని సంకల్పించిన కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ దేశవిదేశాలకు మందుల రవాణాను అత్యంత సమర్థ-చౌక విధానంలో నిర్వహిస్తోంది. మేరకు దేశంలోని మారుమూల ప్రాంతాలకు వైద్య సరఫరాల కోసం లైఫ్లైన్ ఉడాన్‌’ విమానాలను వినియోగిస్తోంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614616

భారత పరిశ్రమల సమాఖ్య ముఖ్యులతో డాక్టర్ హర్షవర్ధన్ చర్చలు

కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఇవాళ దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా 50 మందికిపైగా భారత పారిశ్రామిక రంగ దిగ్గజాలతో వివిధ అంశాలపై ఇష్టాగోష్ఠిగా చర్చించారు. కోవిడ్-19పై పోరాట సమయంలో ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం ఇవ్వడంసహా పరీక్ష సదుపాయాల లభ్యత, క్వారంటైన్ సౌకర్యాలు, మందుల పరిశ్రమకు ముడి ఔషధాల సరఫరా, వ్యాధులపై నిఘా, టెలిమెడిసిన్ సేవల వినియోగం, వ్యాధి నివారక ఆరోగ్య సంరక్షణ తదితరాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆందోళ చెందాల్సిన అవసరంలేదని సందర్భంగా మంత్రి వారికి వివరించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614617

దిగ్బంధం నేపథ్యంలో పరీక్షల షెడ్యూలును ప్రకటించినున్న యూపీఎస్సీ

దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి అభ్యర్థులు హాజరు కావాల్సిన అన్ని ఇంటర్వ్యూలు, పరీక్షలు, రిక్రూట్మెంట్ బోర్డులకు సంబంధించిన తేదీలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని యూపీఎస్సీ నిర్ణయించింది. అలాగే 2020 మే 3 తేదీన రెండోవిడత దిగ్బంధం ముగిశాక సివిల్ సర్వీసెస్-2019 వ్యక్తిత్వ పరీక్షల తేదీలపై నిర్ణయం తీసుకోనుంది. కాగా, ప్రపంచ మహమ్మారి సంక్షోభం నేపథ్యంలో ఏడాదిపాటు తమ మూల వేతనం నుంచి 30 శాతం మేర స్వచ్ఛందంగా తగ్గించుకోవాలని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, సభ్యులు నిర్ణయించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614729

పీఎం కేర్స్‌’ నిధికి మూలవేతనంలో 30 శాతాన్ని ఏడాదిపాటు విరాళంగా ఇవ్వనున్న నీతి ఆయోగ్ వైస్-చైర్మన్, సభ్యులు, ‘ఈఏసీ-పీఎం చైర్మన్

కోవిడ్-19పై పోరాటం, జాతీయ సంక్షోభం పరిష్కారంలో ప్రభుత్వ కృషికి తోడ్పాటునివ్వాలని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు, సభ్యులతోపాటు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) చైర్మన్ తమ జీతంలో 30 శాతాన్ని ఏడాదిపాటు పీఎం కేర్స్‌’ నిధికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614750

ఆరోగ్య సంరక్షణ నిపుణుల కోసం 30వేల కవరాల్స్.. ఏప్రిల్లో భారత రైల్వేశాఖ లక్ష్యం

కోవిడ్-19 రోగులకు సేవలందిస్తున్న ఆరోగ్య సంరక్షణ నిపుణులు, కార్యకర్తల కోసం వ్యక్తిగత రక్షణ సామగ్రి (పీపీఈ) కవరాల్స్ తయారీని భారత రైల్వేశాఖ చేపట్టింది. మేరకు రైల్వే ఉత్పాదక సంస్థలు, వర్క్షాపులు, క్షేత్రస్థాయి యూనిట్లు ఇప్పటికే పని ప్రారంభించాయి. ఇందులో భాగంగా ఏప్రిల్ నెలాఖరులోగా 30 వేల కవరాల్స్ తయారీని నిర్దేశించుకోగా- మే నెలలో లక్ష కవరాల్స్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది. వీటి నమూనాలను ఇప్పటికే గ్వాలియర్లోని డీఆర్డీవో లేబొరేటరీ పరీక్షించి అత్యున్నత ప్రమాణాలతో ఉన్నట్లు ధ్రువీకరించింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614681

పార్శిల్ రైళ్లతో రైల్వేలకు రాబడి ప్రారంభం: దిగ్బంధం మొదలైనప్పటినుంచి 20,400 టన్నుల సరకులు లోడింగ్ద్వారా రూ.7.54 కోట్ల ఆదాయం

కోవిడ్-19 దిగ్బంధం నేపథ్యంలో అత్యవసరమైన వైద్య సరఫరాలు, పరికరాలు, ఆహారధాన్యాలు వగైరాలను స్వల్ప పరిమాణంలో రవాణా చేయడానికి ప్రాముఖ్యం ఏర్పడింది. కీలక అవసరాలను తీర్చేందుకు భారత రైల్వేశాఖ నడుం బిగించింది. ఇందుకోసం రైల్వే పార్శిల్ వ్యాన్లను రాష్ట్ర ప్రభుత్వాలుసహా -కామర్స్ సంస్థలకు, ఇతర ఖాతాదారులకు అందుబాటులో ఉంచింది. అలాగే ఎంపిక చేసిన మార్గాల్లో ప్రత్యేక పార్శిల్ రైళ్లను నడుపుతూ నిత్యావసరాల నిరంతరాయ సరఫరాకు వీలు కల్పించింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614759

జమ్ముకశ్మీర్, లద్దాఖ్లలోని మారుమూల ప్రాంతాలకు ప్రత్యేక తపాలా సౌకర్యం

జమ్ముకశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రజల ప్రాథమిక అవసరాలు తీరే దిశగా ఆర్థిక కార్యకలాపాలకు వీలు కల్పిస్తూ తపాలా కార్యాలయాలను తెరిచ ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థను కూడా తపాలా కార్యాలయాల పరిధిలోకి తెచ్చింది. దీనివల్ల ఏదైనా బ్యాంకులో ఖాతాగల వారెవరైనా ప్రతి నెలలోనూ తపాలా కార్యాలయం నుంచి రూ.10,000దాకా తీసుకునే అవకాశం ఉంటుంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614748

దేఖో అప్నాదేశ్‌’ వెబినార్ సిరీస్ కింద రేపు కోల్కతా ఘనచరిత్ర-వారసత్వాలను తెలుసుకునే అవకాశం

ప్రస్తుత దిగ్బంధ సమయంలో కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ నిర్వహిస్తున్న దేఖో అప్నాదేశ్‌’ వెబినార్ సిరీస్కు విశేష ప్రజాదరణ లభిస్తోంది. ఢిల్లీపై కార్యక్రమం విజయవంతమైన నేపథ్యంలో  రేపు (ఏప్రిల్ 16) ఉదయం 11:00 నుంచి మధ్యాహ్నం 12:00 గంటలవరకు కలకత్తా-విభిన్న సంస్కృతుల సమ్మేళనం కార్యక్రమాన్ని చూడవచ్చు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614748

ప్రజలకు భద్రత, కోవిడ్-19పై అవగాహన కల్పన కోసం అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్న స్మార్ట్ సిటీస్

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614612

కోవిడ్-19పై పోరాటంలో భాగంగా కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యకలాపాలు చేపట్టిన పవర్గ్రిడ్

దేశమంతా దిగ్బంధంలో మునిగిన సమయంలో ఇంధన మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ పవర్గ్రిడ్ 24 గంటలూ విద్యుత్ సరఫరా చేయడమే కాకుండా ప్రపంచ మహమ్మారి ప్రభావిత పేదలను ఆదుకునేందుకు మానవతావాద సహాయ చర్యలు కూడా చేపట్టింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614522

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • కేరళ: కొళ్లం పురపాలిక పరిధిలో రాష్ట్రంలో ఏకైక, దేశంలో రెండో కోవిడ్ రోగి-గర్భిణి ఒకరు వ్యాధినుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లింది. కాగా- న్యూయార్క్, దుబాయ్లలో ఇద్దరు మలయాళీలు కోవిడ్కు బలయ్యారు. దీంతో విదేశాల్లో మరణించిన కేరళవాసుల సంఖ్య 30కి చేరింది. కాగా, రాష్ట్రంలోని త్రిస్సూర్పురం సంబరాలు చరిత్రలో తొలిసారిగా రద్దయ్యాయి.
  • తమిళనాడు: చెన్నై నగరపాలక సంస్థ మే 3 తేదీనాటికి 40,000 నమూనాల పరీక్ష పూర్తిచేయనుంది. కాగా, నగరంలో సుమారు 10,000 క్వారంటైన్ సదుపాయాలను ఏర్పాటు చేశారు. నిన్నటిదాకా నమోదైన కొత్త కేసులు 1,204 కాగా- 81 మంది డిశ్చార్జి అయ్యారు. మొత్తం 1,955 నమూనాలను పరీక్షించారు. ప్రస్తుతం నమోదైన కేసులలో చెన్నై 211, కోయంబత్తూరు 126 కేసులతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
  • కర్ణాటక: సత్వర పరీక్ష కిట్లకు సంబంధించి చైనా విధానంలో మార్పుతోపాటు కేంద్రీకృత కొనుగోళ్లు చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంవల్ల కర్ణాటకకు రావాల్సిన లక్ష కిట్ల కోసం మరికొంత కాలం వేచిచూసే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 260 కాగా, నమోదైన మరణాలు 10; కోలుకున్నవారి సంఖ్య 71. బెంగళూరు 69, మైసూరు 48, బెళగావి 18 కేసులతో రాష్ట్రంలో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.
  • తెలంగాణ: రాష్ట్రంలో ఏప్రిల్ 20 తర్వాత కోవిడ్ ప్రభావం లేని ప్రాంతాల్లో దశలవారీగా దిగ్బంధం నిబంధనలను సడలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, హైదరాబాద్లోని డీఆర్డీఎల్ సంస్థ నమూనాల సేకరణ కోసం కోవిడ్ శాంపిల్ కలెక్షన్ కియోస్క్‌’ను రూపొందించింది. రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన మొత్తం కేసుల సంఖ్య 644కు చేరింది.
  • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో 19 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 502కు చేరింది. ఇప్పటిదాకా నమోదైన మరణాలు 11 కాగా, కోలుకున్నవారి సంఖ్య 16గా ఉంది. అత్యధికంగా గుంటూరు 118, కర్నూలు 97, నెల్లూరు 56, కృష్ణా 45, ప్రకాశం 42, కడప 33, పశ్చిమ గోదావరి 31వంతున కేసులు నమోదయ్యాయి. కాగా, రేపటినుంచి సామాజిక దూరం నిబంధనను పాటిస్తూ  ప్రభుత్వం పేదలకు ఉచిత రేషన్ పంపిణీ చేయనుంది.  
  • అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో ఏకైక అనుమానిత కోవిడ్ రోగికి మూడోసారి పరీక్షలో వ్యాధి లేదని తేలింది.
  • అసోం: రాష్ట్రంలో మే 3 తేదీదాకా మద్యం దుకాణాలు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
  • మణిపూర్: రాష్ట్రానికి చెందిన ఒక పైలట్ మామగారికి మేఘాలయలో కోవిడ్-19 సోకినట్లు నిర్ధారణ అయిన నేపథ్యంలో కుటుంబలోని 11 మందికీ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
  • మేఘాలయ: రాష్ట్రంలో నమోదైన తొలి కోవిడ్-19 రోగితో తొలి సంబంధాలున్న వారికి చెందిన 50 నమూనాలను ఇవాళ గువహటి వైద్య కళాశాల ఆస్పత్రిలో పరీక్షించగా ఎవరికీ వ్యాధిలేదని తేలింది.
  • మిజోరం: రాష్ట్రానికి భారత వైద్య పరిశోధన మండలి నుంచి 1,800 నవ్య కరోనా టెస్టింగ్ కిట్లు అందాయి.
  • నాగాలాండ్: రాష్ట్ర రాజధాని కోహిమాలో జాతీయ విపత్తు నిర్వహణ దళం ఔషధ ధూపనం నిర్వహించింది.
  • త్రిపుర: కరోనా మహమ్మారి సంక్షోభం నేపథ్యంలో రాష్ట్ర పౌరులందరూ ఆరోగ్య సేతు యాప్ను మొబైల్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు

 

 

# కోవిడ్-19 లో వాస్తవ తనిఖీ

https://pbs.twimg.com/profile_banners/231033118/1584354869/1500x500

*****



(Release ID: 1614887) Visitor Counter : 262