కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

వేతన చెల్లింపు మాసం మార్చి,2020 వేతనాలు చెల్లించిన సంస్థలు ఈ సి ఆర్ దాఖలు చేయవలసిన చివరి తేదీ 15.04.2020 నుంచి 15.05.2020 వరకు పొడిగింపు

దీనివల్ల లాక్ డౌన్ సమయంలో వేతనాలు చెల్లించిన 6 లక్షల సంస్థలకు ప్రోత్సాహకంగా ఉంటుంది

Posted On: 15 APR 2020 5:48PM by PIB Hyderabad

విశ్వ మహమ్మారి కోవిడ్ - 19ను కట్టడి చేయడానికి మార్చి 24, 2020 అర్దరాత్రి నుంచి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది.  దరిమిలా వేతన చెల్లింపు మాసం 2020 మార్చి నెలకు తమ ఉద్యోగులకు వేతనాలు చెల్లించిన సంస్థల యజమానులు తమ ఎలెక్ట్రానిక్ చలాన్ కం రిటర్న్ (ఈ సి ఆర్) దాఖలు చేయడానికి చివరి తేదీని 15.05.2020 వరకు పొడిగించడమైనది. మామూలుగా  వేతన చెల్లింపు మాసం 2020 మార్చికి చివరి తేదీ 15-04-2020. 

అయితే ఈపిఎఫ్ & ఎం పి చట్టం, 1952 పరిధిలోకి వచ్చే సంస్థలు మార్చి, 2020 నెలకు తమ చందాలు/ సభ్యత్వాలు, పరిపాలనా సంబంధ చార్జీల చెల్లింపులు చేయడానికి 30 రోజుల వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

కోవిడ్ -19 మహమ్మారి కాలంలో తమ ఉద్యోగులకు మార్చి, 2020 వేతనాలు చెల్లించిన సంస్థల యజమానులకు రాయితీగా కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ పై నిర్ణయం తీసుకుంది. ఎవరూ ఉపాధిని, ఆర్జనను కోల్పోరాదని, కరోనా మహమ్మారిపై పోరాటం చేయాలనే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ప్రధాన ఉద్దేశం మేరకు ఈ ప్రోత్సాహకం ఇస్తున్నారు.   

ఈ రాయితీ వల్ల దేశవ్యాప్తంగా దాదాపు 6 లక్షల సంస్థలకు ప్రయోజనం కలుగుతుంది.  ఈ సంస్థలలో పనిచేస్తున్న దాదాపు 5 కోట్ల మంది ఉద్యోగులకు యజమానులు వేతనాల చెల్లింపులు జరిపిన తరువాత  ప్రతినెలా తప్పనిసరిగా గడువుతేదీ లోపల ఈసిఆర్ దాఖలు చేయాలనే నియమం ఉంది. ఇప్పుడు సంస్థల యజమానులు మార్చి, 2020 వేతనాల చెల్లింపు తేదీని ఈసిఆర్ లో పేర్కొనవలసి ఉంటుంది. వారికీ ఒక నెల రాయితీ  లభించినందువల్ల 15.05.2020 లోపల దాఖలు చేయవచ్చు. దీనివల్ల మార్చి, 2020 వేతనాలు చెల్లించే యనమానులకు చివరి తేదీలో ఒక నెల వెసులుబాటు  రావడమే కాక మార్చి, 2020 నెల ఈపిఎఫ్ బకాయిలను గడువుతేదీ 15.05.2020 లోపల చెల్లించి నట్లయితే ఎలాంటి వడ్డీ, అపరాధ రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు లభిస్తుంది.  


(Release ID: 1614814) Visitor Counter : 289