ఆర్థిక మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 మ‌హ‌మ్మారి ప‌రిస్థితుల‌లో ప‌న్నుచెల్లింపు దారుల‌కు స‌హాయం చేసేందుకు వారంరోజుల‌లో 4,250 కోట్ల రూపాయ‌ల మేర 10.2 ల‌క్ష‌లమందికి తిరిగి చెల్లింపులు చేసిన సిబిడిటి

Posted On: 15 APR 2020 5:42PM by PIB Hyderabad

కోవిడ్ -19  మహమ్మారి పరిస్థితుల్లో పన్ను చెల్లింపుదారులకు సహాయప‌డేందుకు, పెండింగ్ లో ఉన్న‌ 5 ల‌క్ష‌ల రూపాయ‌ల  ఆదాయ‌పన్ను తిరిగి చెల్లింపుల‌కు సంబంధించి 2020 ఏప్రిల్ 8 న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ (సిబిడిటి)  ఇప్పటికే 10.2 లక్షల రిఫండ్ క్లెయిమ్‌ల‌ను తిరిగి చెల్లించింది.  14 ఏప్రిల్ 2020 నాటికి తిరిగి చెల్లంచిన మొత్తం 4,250 కోట్లు.  2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇప్ప‌టికే, రిఫండ్ చేసిన  2.50 కోట్ల  క్లెయిమ్‌లకు.2020 మార్చి 31 వరకు  చెల్లించిన  రూ .1.84 లక్షల కోట్లకు అద‌నం.

ఐ-టి విభాగం నుంచి పంపిన‌  రిమైండర్ ఈ మెయిళ్ళు, వాస్తవానికి పన్ను చెల్లింపుదారుల ప్రయోజనం కోసం ఉద్దేశించిన‌వి. రిఫండ్ మొత్తం చెల్లించ‌డానికి   ముందు వారికి రావ‌ల‌సిన మొత్తం, వారి బ్యాంక్ ఖాతా త‌దిత‌ర ఏవైనా లోపాల‌ను గుర్తిస్తే  రిఫండ్‌కు ముందే వాటికి సంబంధించిన స‌మాచారాన్ని  ధృవీకరించుకోవ‌డానికి ఇవి ఉద్దేశించిన‌వి.

అటువంటి ఈ -మెయిళ్ల‌కు  త్వరితగతిన స్పందించాల‌ని,  దానివ‌ల్ల  ప‌న్ను చెల్లింపుదారుల‌కు త్వ‌రగా రిఫండ్ల‌ను జారీ చేయడానికి వీలు క‌లుగుతుంద‌ని తెలిపింది. ఐ-టి విభాగం పంపిన మెయిళ్ల‌కు స‌త్వ‌రం స్పందించడంలో భాగంగా  పన్ను చెల్లింపుదారులు తమ  ఈ-మెయిల్‌ను తనిఖీ చేసుకుని, వారి ఇ-ఫైలింగ్ ఖాతాకు లాగిన్  కావాల్సిందిగా  సిబిడిటి కోరింది.
లోపాలున్న‌ ఐటిఆర్‌లు, సర్దుబాట్లు , ప‌న్ను చెల్లింపు దారుల‌ క్లెయిమ్‌ల‌కు సంబంధించి  ధృవీకరణ అవ‌స‌ర‌మైన‌ చోట వారి నుంచి వివ‌రాలు కోర‌డం, సాధార‌ణ సమాచార ప్ర‌క్రియ‌లో  అంత‌ర్భాగ‌మ‌ని స్ప‌ష్టం చేసింది.  ఇలాంటి  రిఫండ్‌ల విష‌యంలో, పన్ను చెల్లింపుదారుల‌నుంచి స‌త్వ‌ర ప్రతిస్పందన ఐటి డిపార్ట్‌మెంట్ నుంచి  రిఫండ్‌ల‌ను వేగంగా ప్రాసెస్ చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది.

 


(Release ID: 1614811) Visitor Counter : 207