కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

కార్మికుల వేతన సంబంధిత ఫిర్యాదులను పరిష్కారానికి 20 కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు

Posted On: 14 APR 2020 11:58AM by PIB Hyderabad

కోవిడ్-19 వైర‌స్ వ్యాప్తి నేపథ్యంలో కార్మికుల‌కు ఎదుర‌వుతున్న ప‌లు సమస్యల ప‌రిష్కారానికి గాను కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ చీఫ్ లేబర్ కమిషనర్ (సీఎల్‌సీ) (సీ) నేతృత్వంలో దేశ వ్యాప్తంగా 20 కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. కార్మికుల ప్ర‌యోజ‌నాల నిమిత్తం దేశ వ్యాప్తంగా ఈ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు.సెంట్రల్ స్పియర్‌లో పని చేసే కార్మికుల వేతన సంబంధిత ఫిర్యాదులను పరిష్కరించడం. దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో వలస కార్మికుల సమస్యలను త‌గ్గించ‌డమ‌నే లక్ష్యాల‌తో వీటిని ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూమ్‌లు లేబర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ లేబర్ కమిషనర్లు, ప్రాంతీయ కార్మిక కమిషనర్లు, ఆయా ప్రాంతాల డిప్యూటీ చీఫ్ లేబ‌ర్‌ కమిషనర్ల‌ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించ‌బ‌డుతాయి. ఈ కాల్ సెంటర్లను కార్మికులు వివిధ స‌మ‌స్య‌ల నిమిత్తం ఫోన్ చేయ‌డం లేదా వాట్సాప్ మరియు ఈ-మెయిల్స్ ద్వారా కూడా సంప్ర‌దించ‌వ‌చ్చు. ఈ మొత్తం 20 కాల్ సెంట‌ర్ల ప‌ని పనితీరును ప్రతి రోజూ కేంద్ర కార్యాల‌యం నుంచి చీఫ్ లేబర్ కమిషనర్ (సీ) పర్యవేక్షిస్తున్నారు. కోవిడ్ నేప‌థ్యంలో ఏర్ప‌డిన‌ అనూహ్య ప‌రిస్థితులలో బాధిత కార్మికులకు సాధ్యమైనంత గ‌రిష్ఠ‌ సాయం అందించేందుకు, అవసరమైన వారికి సకాలంలో త‌గిన సాయం చేసే ఉద్దేశంతో ఈ కాల్ సెంట‌ర్ల‌ను నిర్వ‌హిస్తున్న అధికారులు మానవత్వ విధానంతో సేవ‌ల‌ను అందించాల‌ని కేంద్రం సూచించింది. హైద‌రాబాద్‌, అహ్మ‌దాబాద్‌, అజ్మీర్‌, బెంగ‌ళూరు, ఛండీగ‌ఢ్‌, అస‌న్‌సోల్‌, భువ‌నేశ్వ‌ర్‌, కొచ్చి, చెన్నై, డెహ‌రాడూన్‌, ద‌న్‌బాద్‌, గౌహ‌తి, జ‌బ‌ల్‌పూర్‌, కాన్పూర్‌, ముంబ‌యి, కొచ్చిన్‌, ముంబ‌యి, నాగ్‌పూర్, పాట్నా, రాయ్‌పూర్ల‌లో ఈ కాల్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల‌కు సంబంధించి హైదరాబాద్ కేంద్రంగా కాల్ సెంట‌ర్‌ను ఏర్పాటు చేశారు. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, యాన‌మ్‌, పుదిచ్చెరి ప్రాంతాల‌లో ఉన్న కార్మికులు లాక్‌డౌన్ స‌మ‌యంలో ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌ల‌ను గురించి మెయిల్ ఐడీః rlchyd[at]nic[dot]in (ఫోన్ నంః 9496204401), dyclchyd-ap[at]nic[dot]in (ఫోన్ నంః 8328504888), alchydpl[at]gmail[dot]com (ఫోన్ నంః 8552008109)ల‌కు తెలియ‌జేస్తే అధికారులు త‌గిన ప‌రిష్కారం చూప‌నున్నారు.

 

అనుబంధాన్ని చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి


(Release ID: 1614322) Visitor Counter : 562