ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 అప్ డేట్
Posted On:
13 APR 2020 6:37PM by PIB Hyderabad
దేశంలో కోవిడ్-19 వ్యాప్తిని ఎదుర్కొనే ఉమ్మడి కృషిలో భాగంగా, భారత ప్రభుత్వం , రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో కలసి కోవిడ్ -19 నిరోధం, నియంత్రణ, నిర్వహణకు పలు చర్యలు తీసుకుంటున్నది. ఇందుకు సంబంధించిన చర్యలను నిరంతరం ఉన్నతస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.
సిఎస్ఐఆర్ (కైన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ , ఇండస్ట్రియల్ రిసెర్చ్) డిజి, సిఎస్ఐఆర్ ,దేశంలోని 38 ల్యాబ్ డైరక్టర్ల సమక్షంలో కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ కోవిడ్ -19 కి సంబంధించిన పరిశోధనల కృషిని సమీక్షించారు.
సిఎస్ఐఆర్ లేబరెటరీలు, ప్రముఖ ప్రైవేటు రంగ సంస్థలు, ఎం.ఎస్.ఎం.ఇలు, డిపార్టమెంట్‌లు, మంత్రిత్వశాఖలు భాగస్వామ్యంతో ఐదు అంశాలను గుర్తించాయి.
--డిజిటల్,మాలిక్యులర్ సర్వైలెన్స్
--రాపిడ్,ఎకనమికల్ డయాగ్నస్టిక్స్
--నూతన ఔషధాలు, అనుబంధ ఉత్పత్తి ప్రక్రియల పునర్వినియోగం,
--హాస్పటిల్ అసిస్టివ్ డివైసెస్,పిపిఇలు
--సప్లయ్ చెయిన్, లాజిస్టిక్ సపోర్ట్ సిస్టమ్
కోవిడ్ -19 పై జిల్లా పాలనాయంత్రాంగం స్థాయిలో సకాలంలో స్పందించడానికి ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అన్ని స్థాయిలలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోంది. కేసుల గుర్తింపు, కేస్ మేనేజ్‌మెంట్ , కంటైనేషన్ ప్లాన్‌ల అమలు వంటివి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా జరుగుతున్నాయి. కోవిడ్ -19 పాజిటివ్ గా ధృవీకరించబడిన కేసుల జిఐఎస్ మ్యాపింగ్, క్రియాశీల ప్రాంతాల గుర్తింపు, హీట్ మ్యాపింగ్ వాడకం , ముందస్తు అంచనా సమాచార విశ్లేషణ వంటి వాటిని వైరస్ నియంత్రణ ప్రణాళికల అమలును పర్యవేక్షించడానికి ఉపయోగిస్తున్నారు. ఇటువంటి సాంకేతిక పరికరాలను బెంగళూరు వార్ రూమ్ చాలా సమర్థవంతంగా అందుబాటులోకి తెచ్చింది.
ఇంటిగ్రేటెడ్ కమాండ్ , కంట్రోల్ సెంటర్లు , ఇందుకోసమే ప్రత్యేకంఆ పనిచేస్తున్న రాపిడ్ రెస్పాన్స్ టీం (ఆర్‌ఆర్‌టి) తో సమన్వయం చేసుకుని క్షేత్రస్థాయిలో , అంబులెన్సులు, క్వారంటైన్ నిర్వహణ సేవలను అందించడంలో సహాయపడతాయి. కొన్ని జిల్లాలు స్థానిక వైద్య దుకాణాలను అనుసంధానించే విధంగా రిమోట్ డిజిటల్ మెడికల్ కన్సల్టేషన్‌ను కూడా ప్రారంభించాయి.
ఈ కార్యాచరణ ప్రణాళిక అమలుతొ 15 రాష్ట్రాలు, 25 జిల్లాల్లో మెరుగైన ఫలితాలు రావడం ప్రారంభించాయి. ఈ జిల్లాలలో గత 14 రోజుల నుండి ఎటువంటి కేసులు నమోదు కాలేదు. అలాగే భవిష్యత్తులో కొత్త కేసులు రాకుండా చూసేందుకు నిరంతరం అప్రమత్తతో వ్యవహరిస్తున్నారు. దీనిని సాధించిన జిల్లాలు, గోండియా (మహారాష్ట్ర), రాజ్ నందగావ్, దుర్గ్, బిలాస్‌పూర్ (ఛత్తీస్‌ఘడ్), దవాంగిరి, కొడగు, తుముకూరు, ఉడిపి (కర్ణాటక), దక్షిణ గోవా (గోవా), వయనాడ్, కొట్టాయం (కేరళ), వెస్ట్ ఇంఫాల్ (మణిపూర్) , రాజౌరి (జమ్మూ అండ్ కె), ఐజ్వాల్ వెస్ట్ (మిజోరం), మహే (పుదుచ్చేరి), ఎస్బిఎస్ నగర్ (పంజాబ్), పాట్నా, నలంద , ముంగేర్ (బీహార్), ప్రతాప్ ఘడ్ (రాజస్థాన్), పానిపట్, రోహ్తక్, సిర్సా (హర్యానా), పౌరి గర్హ్వాల్ (ఉత్తరాఖండ్) కొత్తగూడెం (తెలంగాణ).
కోవిడ్ -19 లాక్‌డౌన్ ప్రభావం నుంచి పేద ప్రజలను రక్షించేందుకు, ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ పాకేజ్‌కింద 30 కోట్ల మందికి పైగాపేద ప్రజలు 2020 ఏప్రిల్ 10 నాటికి ,28,256 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందుకున్నారు.దీనికి సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.
-- 19.86 కోట్ల ప్రధానమంత్రి జన్ ధన్ యోజన మహిళా ఖాతాదారుల 930 కోట్ల రూపాయల సహాయం అందుకున్నారు.
---ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎం- కిసాన్) కింద 6.93 కోట్ల మంది రైతులు 13,855 కోట్ల రూపాయలు అందుకున్నారు.
--2.82 కోట్ల మంది వితంతువులు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు రూ 1405 కోట్ల రూపాయలు అదుకున్నారు.
-- 2.16 కోట్ల మంది భవననిర్మాణ, మౌలిక సదుపాయాల రంగ కార్మికులకు మద్దతుగా రూ 3066 కోట్ల రూపాయలు పంపిణీచేశారు.
కరోనావైరస్ వ్యాప్తిని ఎదుర్కొనే ప్రమాదాన్ని అంచనా వేయడానికి పౌరులకు వీలు కల్పించే మొబైల్ అప్లికేషన్ , ఆరోగ్య సేతు 11 భాషల్లో రూపొందించబడింది .దీనిని 3.5 కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ యాప్‌ను వాడే వ్యక్తి చుట్టుపక్కల కోవిడ్ రిస్క్‌ను అంచనా వేయడానికి ఇది ఉపకరిస్తుంది. ఆధునిక టెక్నాలజీ సాయంతో కాంటాక్ట్ ట్రేసింగ్, బ్లూటూత్ టెక్నాలజీ, అల్గోరిథంలు , కృత్రిమ మేధస్సు వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా రిస్క్ అసెస్‌మెంట్, కాంటాక్ట్ ట్రేసింగ్ దీని ఫీచర్లలో ముఖ్యమైనవి.
దేశవ్యాప్తంగా 27 రాష్ట్రాలలో, రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్ల (ఎస్‌ఆర్‌ఎల్‌ఎం) కింద 78,373 స్వయం సహాయక సంఘాల సభ్యులు 1.96 కోట్ల మాస్క్లు తయారు చేశారు. నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్‌సిసి) కాడెట్లు , పౌర పాలనా యంత్రాంగానికి ‘ ఎన్‌సిసి యోగ్దాన్’ కింద సహాయం చేస్తున్నారు. కోవిడ్ -19 పై పోరాటంలో 50,000 మందికి పైగా స్వచ్ఛందంగా ముందుకువచ్చి పనిచేస్తున్నారు..
నిన్నటి నుండి దేశంలో 796 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు పెరిగాయి. , దేశం మొత్తం మీద కోవిడ్ -19 కేసులు 9152కు చేరుకున్నాయి.. కరోనా నుంచి కొలుకున్న 857 మంది ఆస్పత్రి నుంచి/ డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు దేశంలో మొత్తం 308 మంది మరణించారు..
కోవిడ్ -19 కి సంబంధించి తాజా , అధీకృత సమాచారం , దీనికి సంబంధించిన సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, ఇతర సూచనలకోసం క్రమం తప్పకుండా గమనించండి : https://www.mohfw.gov.in/.
కోవిడ్ -19 కి సంబంధించి సాంకేతిక అంశాలపై తమ ప్రశ్నలను technicalquery.covid19[at]gov[dot]in ఈమెయిల్‌కు పంపవచ్చు. ఇతర ప్రశ్నలను ncov2019[at]gov[dot]in .కు పంపవచ్చు.
కోవిడ్ -19పై ఏవైనా ప్రశ్నలకు సమాధానాల కోసం కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్‌లైన్ నెంబర్ : +91-11-23978046 లేదా 1075 (టోల్ ఫ్రీ) కు ఫోన్ చేయవచ్చు. కోవిడ్ -19 పై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల హెల్ప్‌లైన్ ల జాబితా కోసం కింది లింక్‌ను గమనించవచ్చు.
https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .
(Release ID: 1614142)
Visitor Counter : 180
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam