పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
దేశ వ్యాప్తంగా వైద్య సామగ్రి రవాణా కోసం లైఫ్ లైన్ ఉడాన్ స్కీమ్ కింద 2 లక్షల కిలోమీటర్ల వైమానిక దూరాన్ని పూర్తి చేసిన విమానయాన సంస్థలు
Posted On:
13 APR 2020 4:44PM by PIB Hyderabad
కోవిడ్ -19కు వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న యుద్ధానికి మద్ధతుగా దేశంలోని మారుమూల ప్రాంతాలకు అవసరమైన వైద్య సామగ్రిని, ఇతర సామగ్రిని రవాణా చేయడానికి 218కి పైగా లైఫ్ లైన్ ఉడాన్ విమానాలను సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ నడుపుతున్నట్లు సివిల్ ఏవియేషన్ సహాయ మంత్రి (ఇంచార్జ్) శ్రీ హర్దీప్ సింగ్ పురి, ఈరోజు ఓ ట్వీట్ లో పేర్కొన్నారు. ఇప్పటి వరకూ రవాణా చేయబడిన సరుకు సుమారు 377.50 టన్నులు అని, ఇప్పటి వరకూ లైఫ్ లైన్ ఉడాన్ ద్వారా విమానాలు 2,05,709 వైమానికి కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం తిరిగాయని ట్వీట్ లో పేర్కొన్నారు. వీటిలో 132 విమానాలను ఎయిర్ ఇండియా మరియు అలయన్స్ ఎయిర్ నడుపుతున్నాయి. 2020 ఏప్రిల్ 12 వరకూ 4.27 టన్నుల కార్గో లోడ్ తిరిగినట్లు తెలిపారు. భారతదేశం మరియు విదేశాల్లో వాయు మార్గంలో వైద్య సామగ్రిని అత్యంత సమర్థవంతంగా మరియు తక్కువ ఖర్చుతో రవాణా చేయడం ద్వారా కోవిడ్ -19 కు వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న యుద్ధానికి మద్ధతు ఇచ్చేందుకు విమానయాన శాఖ కట్టుబడి ఉంది.
ఈశాన్య ప్రాంతంతో పాటు, ద్వీప భూభాగాలు, కొండ ప్రాంతం అధికంగా ఉన్న రాష్ట్రాల మీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. సరుకులో ఎక్కువ భాగం తేలిక పాటి బరువు ఉండే మాస్క్ లు, చేతి తొడుగులు మరియు ఇతర వినియోగ వస్తువులే. ఇవి విమానంలో అధిక భాగాన్ని ఆక్రమిస్తాయి. ఇందు కోసం ప్రయాణికుల సీటింగ్ ఏరియా మరియు ఓవర్ హెడ్ క్యాబిన్లలో నింపి, తగిన జాగ్రత్తలతో రవాణా చేసేందుకు ప్రత్యేక అనుమతి తీసుకోవడం జరిగింది.
లైఫ్ లైన్ ఉడాన్ విమానాలకు సంబంధించిన సమాచారం కోసం https://esahaj.gov.inlifeline_udan/public_info. లింక్ ద్వారా చూడవచ్చు. ప్రతి రోజు ఈ పోర్టల్ లో వివిధ విభాగాల మధ్య సమన్వయం కోసం నవీనీకరించబడుతుంది.
దేశీయ కార్గో ఆపరేటర్లు అయిన స్పైస్ జెట్, బ్లూ డార్ట్ మరియు ఇండిగో వాణిజ్య ప్రాతిపదికన కార్గో విమానాలను నడుపుతున్నాయి. 2020 మార్చి 24 నుంచి ఏప్రిల్ 12 వరకూ స్పైస్ జెట్ 4,26,533 కిలో మీటర్ల దూరాన్ని మరియు 2,478 టన్నుల సరుకు రవాణా చేసింది. వీటిలో 95 అంతర్జాతీయ కార్గో విమానాలు. 2020 మార్చి 25 నుంచి ఏప్రిల్ 12 వరకూ బ్లూ డార్ట్ 94 దేశీయ కార్గో విమానాలను 92,075 కిలో మీటర్ల దూరం ప్రయాణించి 1497 టన్నుల సరుకును రవాణా చేసింది. 2020 ఏప్రిల్ 3 నుంచి 12 వరకూ 21 కార్గో విమానాలను 21,906 కిలో మీటర్ల దూరం మరియు 21.77 టన్నుల సామగ్రి తీసుకెళ్ళింది. ఇందులో ప్రభుత్వం కోసం ఉచితంగా తీసుకెళ్ళే వైద్య సామగ్రి కూడా ఇందులో ఉంది.
స్పైస్‌జెట్ ద్వారా దేశీయ సరుకు రవాణా
తేదీ
|
విమానాల సంఖ్య
|
రవాణా
|
కిలో మీటర్లు
|
12-04-2020
|
6
|
68.21
|
6,943
|
స్పైస్ జెట్ అంతర్జాతీయ కార్గో
తేదీ
|
విమానాల సంఖ్య
|
రవాణా
|
కిలో మీటర్లు
|
12-04-2020
|
8
|
75.23
|
18,300
|
అంతర్జాతీయ రంగం: 2020 ఏప్రిల్ 4 నుంచి ఔషధాలు, వైద్య పరికరాలు మరియు కోవిడ్ -19 ఉపశమన పదార్థాల రవాణా కోసం ఒక వాయు వంతెనను ఏర్పాటు చేశారు. దక్షిణాసియాలో ఎయిర్ ఇండియా 2020 ఏప్రిల్ 7న, అదే విధంగా 2020 ఏప్రిల్ 10న కొలంబోకు రవాణా చేసింది. సుమారు 9 టన్నుల సరుకు రవాణా చేసింది. అవసరాలకు అనుగుణంగా క్లిష్టమైన వైద్య సామగ్రిని రవాణా చేసేందుకు ఎయిర్ ఇండియా ఇతర దేశాలకు ప్రత్యేక షెడ్యూల్ కార్గో విమానాలను నడుపుతోంది.
ఈ క్రింది తేదీల వారీగా మెడికల్ కార్గో నడిచింది.
క్ర.సం
|
తేదీ
|
ప్రదేశం
|
పరిమాణం
(టన్నుల్లో)
|
1
|
04.4.2020
|
షాంఘై
|
21
|
2
|
07.4.2020
|
హాంగ్ కాంగ్
|
6
|
3
|
09.4.2020
|
షాంఘై
|
22
|
4
|
10.4.2020
|
షాంఘై
|
18
|
5
|
11.4.2020
|
షాంఘై
|
18
|
6
|
12.4.2020
|
షాంఘై
|
24
|
|
|
|
|
|
|
మొత్తం
|
109
|
అన్ని దశల్లో కార్గో నిర్వహణ కోసం తగిన భద్రతా చర్యలు చేపట్టడం జరుగుతుంది.

కేరళకు సంబంధించి వైద్య సరుకును రవాణా నిర్వహించే సిబ్బంది వీడియోను ఇక్కడ చూడవచ్చు.
(Release ID: 1614101)
Visitor Counter : 206
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada