ప్రధాన మంత్రి కార్యాలయం

ఫోన్‌లో మాట్లాడుకున్న ప్ర‌ధాన‌మంత్రి శ్రీ‌న‌రేంద్ర మోదీ, సోష‌లిస్ట్ రిప‌బ్లిక్ ఆఫ్ వియ‌త్నాం ప్ర‌ధాన‌మంత్రి

Posted On: 13 APR 2020 3:20PM by PIB Hyderabad

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ , సోష‌లిస్ట్ రిప‌బ్లిక్ ఆఫ్ వియ‌త్నాం ప్ర‌ధాన‌మంత్రి శ్రీ నుయెన్ క్సుయాన్ ఫుక్ లు ఈరోజు టెలిఫోన్ లో మాట్లాడుకున్నారు.
ఇరువురు నాయ‌కులూ, కోవిడ్ -19 మ‌హ‌మ్మారి వ‌ల్ల నెల‌కొన్న ప‌రిస్థితి, ఈ స‌వాలును ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై చ‌ర్చించారు.
 అవసరమైన వైద్య పరికరాల సరఫరాను సులభతరం చేయడం సహా ,కోవిడ్ -19 పై పోరాటంలో ద్వైపాక్షిక సహకారానికి గ‌ల శ‌క్తిని వారు  అంగీకరించారు. ఎదుటి దేశానికి సంబంధించి త‌మ దేశంలో ఉన్న  పౌరులకు అవసరమైన సహాయాన్ని అందించడానికి కూడా ఉభ‌య‌దేశాలూ  కట్టుబడి ఉన్నాయి..
భారతదేశం, వియత్నాం మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం  ప్రాధాన్య‌త‌ను ఇరువురు నాయకులూ నొక్కిచెప్పారు . వివిధ రంగాలలో ఇటీవల సాధించిన‌ పురోగతిపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాంతీయ  అంతర్జాతీయ పరిణామాలను కూడా వారు ఈ సందర్భంగా సమీక్షించారు.

కోవిడ్ మహమ్మారి పై పోరాటానికి తీసుకుంటున్న  చర్యలతో పాటు ,ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన ఇతర అంశాలపై సమన్వయం కోసం రాబోయే రోజుల్లో తమ బృందాలు సన్నిహిత సంబంధాలు క‌లిగి ఉంటాయని ఇరువురు నాయకులు అంగీకరించారు.
 
ప్రస్తుత సంక్షోభ సమయంలో వియత్నాం ప్రజల ఆరోగ్యం,  వారి శ్రేయస్సును కోరుతూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  తన శుభాకాంక్షలు తెలిపారు.


(Release ID: 1613955) Visitor Counter : 227