పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

ఆపరేషన్ లైఫ్ లైన్ ఉడాన్ లో భాగంగా విమానాల ద్వారా వైద్య సరఫరాల ఒక్క రోజులో 108 టన్నుల అత్యవసర సరఫరాలు రవాణా చేయడం జరిగింది

Posted On: 12 APR 2020 7:10PM by PIB Hyderabad

కోవిడ్-19 మహమ్మారిపై భారత్ జరుపుతున్న పోరాటానికి మద్దతుగా దేశంలోని మారుమూల ప్రాంతాలకు వైద్య చికిత్సా సాధనాలు, మందులు చేరవ్యాడానికి కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో లైఫ్ లైన్ ఉడాన్ ద్వారా 214కు పైగా విమానాలను నడిపారు.  వాటిలో 128 విమానాలను ఎయిర్ ఇండియా మరియు అలయన్స్ ఎయిర్ కార్గో కలిసి నడిపాయి. ఇప్పటి వారు వారు 373.23 టన్నుల సరుకులను చేరవేశాయి. లైఫ్ లైన్ ఉడాన్ విమానాలు ఇప్పటి వరకు 1,99,784 కిలోమీటర్లు తిరిగాయని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖలో జాయింట్ సెక్రెటరీ శ్రీమతి ఉషా పాడీ తెలిపారు.  కేవలం ఒక్క రోజులో శనివారం 11 ఏప్రిల్, 2020న 108 టన్నుల సరుకులను రవాణా చేశారు. విమానాల ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలకు, విదేశాలకు మందులు, వైద్య చికిత్సా పరికరాలు, ఇతర సాధనాలు సమర్ధవంతమైన రీతిలో, చౌకలో రవాణా చేయడం ద్వారా కోవిడ్ -19 మహమ్మారికి వ్యతిరేకంగా భారత్ జరుపుతున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని పౌర విమానయన మంత్రిత్వ శాఖ మరియు విమానయాన పరిశ్రమ కృతనిశ్చయంతో ఉన్నాయి.   

ఈశాన్య భారత ప్రాంతం, దీవులు మరియు కొండ ప్రాంతాల్లో ఉండే రాష్ట్రాలకు సరఫరా విషయంలో ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.  ఎయిర్ ఇండియా మరియు భారత వైమానిక దళం ప్రాధమికంగా జమ్మూ & కాశ్మీర్, లద్దఖ్, ఈశాన్య ప్రాంతం మరియు ఇతర దీవుల ప్రాంతాలకు సమన్వయంతో రవాణా చేస్తున్నాయి.  రవాణా చేస్తున్న సరుకులలో ఎక్కువగా అధిక సంఖ్యలో తేలికగా ఉండే మాస్కులు, గ్లవ్స్ మరియు విమానంలో ఎక్కువ స్థలం ఆక్రమించే వినియోగ వస్తువుల వంటివి ఉన్నాయి.  సరుకులను పంపడానికి ఎక్కువ చోటు అవసరమవుతున్నందువల్ల ప్రయాణీకులు కూర్చునే స్థలంలో, పైన ఉండే క్యాబిన్లలో సరుకులను పంపడానికి తగిన జాగ్రత్తలతో పాటు ప్రత్యేక అనుమతి కూడా తీసుకున్నారు. 

ప్రజల సౌకర్యార్ధం లైఫ్ లైన్ ఉడాన్ విమానాల తాజా సమాచారం ప్రతిరోజూ ప్రత్యెక పోర్టల్ https://esahaj.gov.inlifeline_udan/public_info. లో ఉంచడం జరుగుతోంది. ఈ పోర్టల్ ను నేషనల్ ఇన్ఫోమాటిక్స్ సెంటర్ మరియు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ సంయుక్తంగా రికార్డు సమయం మూడు రోజుల్లో తయారు చేశాయి.  దీని ద్వారా భాగస్వామ్య పక్షాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమన్వయంతో వ్యవహరించవచ్చు. 

దేశీయ రవాణా సంస్థలు స్పైస్ జెట్ ,  బ్లూ డార్ట్ మరియు ఇండిగో వాణిజ్య సరళిలో విమానాల ద్వారా సరుకులను రవాణా చేస్తున్నాయి.  స్పైస్ జెట్ 286 విమానాలను నడుపగా అందులో 87 అంతర్జాతీయ రవాణా జరిపాయి. బ్లూ డార్ట్ 94 విమానాలు,  ఇండిగో 25 విమానాలు నడిపాయి. ఇండిగో రవాణా చేసిన సరుకులలో సరుకులలో ప్రభుత్వం కోసం ఉచితంగా తీసుకెళ్ళిన  వైద్య సరఫరాలు కూడా ఉన్నాయి. 

అంతర్జాతీయ రంగం

 ఔషధాలు, వైద్య పరికరాలు మరియు కోవిడ్-19 సహాయక సామగ్రి ఏప్రిల్ 4వ తేదీ నుంచి ఏర్పాటు చేసిన ఎయిర్ బ్రిడ్జి ద్వారా విదేశాల నుంచి మొత్తం 85 టన్నుల సరుకులను తీసుకు రావడం జరిగింది. 

అదేవిధంగా ఎయిర్ ఇండియా విమానాల ద్వారా కొలంబోకు 7, 8 తేదీలలో వరుసగా 9, 4 టన్నుల సరుకులను రవాణా చేయడం జరిగింది.  ఇక ముందు కూడా దక్షిణాసియాలోని ఇతర దేశాలకు కూడా సరుకులు రవాణా చేయాలనే సంకల్పంతో ఎయిర్ ఇండియా ఉంది.  

కాగా సరుకులు తీసుకెళ్ళే విమానాల కోసం అనేక ప్రత్యేక అనుమతులను కూడా ఈ సందర్భంగా మంజూరు చేస్తున్నారు.  


(Release ID: 1613774) Visitor Counter : 159