శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

దేశంలో కరోనా వైరస్ విజృంభణను అరికట్టడానికి సి.ఎస్.ఐ.ఆర్. మరియు సంబంధిత 38 ప్రయోగశాలలు చేపట్టిన చర్యలను సమీక్షించిన డాక్టర్ హర్ష వర్ధన్.

అన్ని సి.ఎస్.ఐ.ఆర్. ల్యాబ్ డైరెక్టర్లు, మరియు సి.ఎస్.ఐ.ఆర్. డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ సి. మండే తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం.

ప్రస్తుత మహమ్మారి విసిరిన సవాళ్లను ఎదుర్కోడానికి ఎస్.&.టి. ఆధారిత పరిష్కారాలతో ముందుకు రావాలనీ ఇందుకోసం దేశవ్యాప్తంగా సి.ఎస్.ఐ.ఆర్. శాస్త్రవేత్తలు మరియు ఇతర మంత్రిత్వశాఖలు కలిసి పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉందని నొక్కి చెప్పిన డాక్టర్ హర్ష వర్ధన్.

కోవిడ్-19 ని ఎదుర్కోవడంలో సి.ఎస్.ఐ.ఆర్. మరియు సంబంధిత లాబ్స్ చేసిన కృషిని డాక్టర్ హర్ష వర్ధన్ అభినందించారు.

Posted On: 12 APR 2020 7:17PM by PIB Hyderabad

దేశంలో కరోనా వైరస్ విజృంభణను అరికట్టడానికి సి.ఎస్.ఐ.ఆర్. మరియు సంబంధిత 38 ప్రయోగశాలలు చేపట్టిన చర్యలను ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం మరియు ఎస్. & టి. మరియు ఈ.ఎస్. శాఖల కేంద్ర మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ఈ రోజు సమీక్షించారు.  ఈ సందర్భంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని సి.ఎస్.ఐ.ఆర్. ప్రయోగశాలల డైరెక్టర్లతో పాటు సి.ఎస్.ఐ.ఆర్. డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ సి. మండే పాల్గొన్నారు

కోవిడ్-19 కు సంబంధించిన కార్యకలాపాలను నిర్వహించడానికి వీలుగా ఇటీవల చేపట్టిన చర్యల్లో భాగంగా రూపొందించిన ఐదు అంశాల గురించి,  ముఖ్యమైన వ్యూహాత్మక బృందం (సి.ఎస్.జి.) ఏర్పాటు గురించి డాక్టర్ శేఖర్ సి. మండే, మంత్రికి వివరించారు.    ప్రస్తుత సంక్షోభ సమయంలో, సి.ఎస్.ఐ.ఆర్. దేశంలోని భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఎమ్.ఎస్.ఎమ్.ఈ.లతో సన్నిహిత భాగస్వామ్యంతో కలిసి పనిచేస్తున్నట్లు కూడా  డాక్టర్ మండే తెలియజేశారు.  

రోగుల నమూనాలను పరీక్షించే ప్రక్రియలో  సి.ఎస్.ఐ.ఆర్. కు చెందిన అనేక ప్రయోగశాలలు చేస్తున్న కృషిని మంత్రి ప్రశంసించారు. మరి కొన్ని ప్రయోగశాలలకు కూడా  అనుమతి లభించడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.  కరోనా వైరస్ ను గుర్తించడంలో సి.ఎస్.ఐ.ఆర్. కు చెందిన 14 ప్రయోగశాలలు సేవలందిస్తున్నాయని మంత్రి చెప్పారు.  కరోనా వైరస్ సోకినా రోగులకు ప్లాస్మా ఆధారిత చికిత్స అందిస్తున్న సి.ఎస్.ఐ.ఆర్.-ఐ.ఐ.సి.బి. కృషినీ - వేగంగా, అతి తక్కువ ధరకు లభ్యమయ్యే కాగితం ఆధారంగా వ్యాధి నిర్ధారణ పరీక్ష చేసే విధానాన్ని అభివృద్ధి పరచిన సి.సి.ఐ.ఆర్.-ఐ.జి.ఐ.బి. కృషినీ మంత్రి అభినందించారు.  సి.ఎస్.ఐ.ఆర్. -సి.సి.ఎం.బి. డైరెక్టర్ రాకేష్ మిశ్రా మాట్లాడుతూ, వచ్చే 3-4 వారాలలో సి.ఎస్.ఐ.ఆర్. నుండి సుమారు ఐదు వందల కరోనా వైరస్ పరిణామాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.  సి.ఎస్.ఐ.ఆర్.-ఐ.జి.ఐ.బి. డైరెక్టర్ డాక్టర్ అనురాగ్ అగర్వాల్ మాట్లాడుతూ - దేశంలో కరోనా వ్యాప్తిపై నిఘా లో సహాయం చేసే డిజిటల్ వేదిక అభివృధి లో టి.సి.ఎస్. మరియు ఇంటెల్ తో సి.ఎస్.ఐ.ఆర్. కలిసి పనిచేస్తుందని తెలియజేసారు. 

ఆధునిక ఔషధ చికిత్సలకు నివారణ మరియు రోగ నిరోధక లక్షణాల నిర్వహణ వంటి విషయాలలో ఆయుష్ మంత్రిత్వశాఖతో కలిసి పనిచేస్తున్నందుకు మంత్రి సి.ఎస్.ఐ.ఆర్. ను అభినందించారు. 

ఆసుపత్రుల్లో సహాయపడే వివిధ పరికరాలు, పి.పి.ఈ.ల కింద సి.ఎస్.ఐ.ఆర్. చేపట్టిన చర్యలను సి.ఎస్.ఐ.ఆర్.-ఎన్.ఏ.ఎల్. డైరెక్టర్ మంత్రికి వివరించారు.  వెంటిలేటర్లు, ఆక్సిజన్ అందించే పరికరాలపై బి.హెచ్.ఈ.ఎల్. మరియు బి.ఈ.ఎల్. సంస్థలతో సి.ఎస్.ఐ.ఆర్. ప్రయోగశాలలు పనిచేస్తున్నాయని ఆయన చెప్పారు అదేవిధంగా త్రీ-డీ ప్రింటెడ్  ఫేస్  షీల్డులు, ఫేస్ మాస్కులు, గౌన్లు, ఇతర రక్షణ పరికరాలను సి.ఎస్.ఐ.ఆర్. అభివృద్ధి చేస్తోందని ఆయన తెలిపారు.  

ముందు వరసలో పనిచేస్తున్న కార్మికులుపోలీసులు, ఇతర పౌరులకు అవసరమైన రక్షణ పరికరాలు, వస్తువులను పెద్ద మొత్తంలో పంపిణీ చేస్తున్నందుకు డాక్టర్ హర్ష వర్ధన్ సి.ఎస్.ఐ.ఆర్. కు చెందిన ప్రయోగశాల లన్నింటినీ ప్రశంసించారు.  ప్రస్తుత మహమ్మారి విసిరిన సవాళ్లను ఎదుర్కోడానికి ఎస్.&.టి. ఆధారిత పరిష్కారాలతో ముందుకు రావాలనీ ఇందుకోసం దేశవ్యాప్తంగా సి.ఎస్.ఐ.ఆర్. శాస్త్రవేత్తలు మరియు ఇతర మంత్రిత్వశాఖలు కలిసి పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన నొక్కి చెప్పారు.  శాస్త్రీయ, వైజ్ఞానిక సమాజం నుండి భారతదేశానికి పెద్ద ఎత్తున అంచనాలు ఉన్నాయనీ, ఈ అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా ఈ సమాజం ముందుకు వచ్చి ఆ అవసరాలను తీరుస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. 

*****


(Release ID: 1613764) Visitor Counter : 227