ఆర్థిక మంత్రిత్వ శాఖ

పటిష్ఠమైన డిజిటల్ చెల్లింపుల మౌలిక వ్యవస్థతో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజి కింద కచ్చితమైన నగదు బదిలీ

Posted On: 12 APR 2020 7:05PM by PIB Hyderabad

జన్ ధన్ ఖాతాలుఇతర ఖాతాలను ఖాతాదారుల మొబైల్ నంబర్లుఆధార్ (జన్ ధన్ - ఆధార్ - మొబైల్)-జామ్  తో అనుసంధానం చేయడానికి డిజిటల్ వ్యవస్థ సిద్ధమైంది. ఈ మౌలిక సంధాన వ్యవస్థ ప్రత్యక్ష బ్యాంకు బదిలీ (డీబీటీ)కిపెన్షన్ పథకానికి వెన్నుదన్నుగా ఉంటుంది. బ్యాంకు ఖాతా లేని వారికి అకౌంట్లు తెరిపించడానికి 2014 ఆగష్టు లో ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడివై) ప్రారంభించారు. 2020 మార్చ్ 20వ తేదీ నాటికి మొత్తం 126 కోట్ల సిఏఎస్ఏ అకౌంట్లకు గాను పీఎంజేడివై కింద 38 కోట్ల ఖాతాలు ప్రారంభమయ్యాయి. 

·         పరస్పరమార్పిడివేగవంతంకచ్చితత్వంతో కూడిన లావాదేవీలు: 

o    ఈ బ్యాంకు అకౌంట్లను నగదుడిజిటల్ లావాదేవీలకు ఉపయోగించవచ్చు అన్ని బ్యాంకు శాఖల్లోనిబిజినెస్ కరెస్పాండంట్ (బీసీ) పాయింట్ల వద్దవ్యాపార కేంద్రాల వద్దఇంటర్నెట్ ద్వారా లావాదేవీలు జరుపుకోవచ్చు. 

o    డిజిటల్ చెల్లింపులకు అనుసరించే పద్ధతులు : బ్రాంచ్ లుబీసీ కేంద్రాల వద్ద ఆధార్ ద్వారా నగదు తీసుకోవచ్చు. భీమ్ ఆధార్రూపే డెబిట్ కార్డుయూపీఐబీబీపీఎస్ ద్వారా కూడా నగదు లావాదేవీలు జరిపే అవకాశం ఉంది. 

పైన పేర్కొన్న డిజిటల్ అవకాశాలన్నిటిని వినియోగించుకుని 30 కోట్ల మంది మొత్తం రూ.28,256 కోట్ల రూపాయల ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజి ఆర్ధిక సహాయం పొందారు. కోవిడ్-19 లాక్ డౌన్ కారణంగా పేదలకు అండగా ఉండేందుకు ఈ ప్యాకేజిని ఆర్ధిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ మర్చి 26వ తేదీన ప్రకటించారు.

ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజి కింద ఏప్రిల్ 10వ తేదీ వరకు విడుదల చేసిన నిధులు:

పథకం 

లబ్ధిదారుల సంఖ్య

అంచనా 

పీఎంజేడీవై మహిళా ఖాతాదారులకు సహాయంగా 

19.86 కోట్లు  (97%)

రూ. 9930 కోట్లు 

పీఎం-కిసాన్ కింద రైతులకు చెల్లింపు 

6.93 కోట్లు (మొత్తం కోట్ల మందికి గాను)

రూ. 13,855 కోట్లు

ఎన్ఎస్ఏపి లబ్ధిదారుల సహాయార్థం (ఒంటరి మహిళలువయోవృద్ధులుదివ్యాంగులు)

2.82 కోట్లు

రూ. 1405 కోట్లు

భవనఇతర నిర్మాణ రంగ కార్మికులకు 

2.16 కోట్లు

రూ. 3066 కోట్లు

మొత్తం 

31.77 కోట్లు 

రూ. 28,256 కోట్లు

 

 

 

 

 

 

 

 

 

 
 
 


(Release ID: 1613744) Visitor Counter : 232