గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

దేశంలో కోవిడ్-19 వ్యాప్తి నిరోధానికి సామాజిక యోధులుగా పోరాడుతున్న ఎన్.ఆర్.ఎల్.ఎం.స్వయం సహాయ బృందాల మహిళలు.

సుమారు రెండు కోట్ల మాస్కులు తయారుచేసిన 27 (రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్ లకు (ఎస్.ఆర్.ఎల్.ఎం.లకు) చెందిన సుమారు 78,000 ఎస్.హెచ్.జి. సభ్యులు.


వివిధ రాష్ట్రాల్లో 5,000 కు పైగా పి.పి.ఈ. కిట్లను తయారుచేసిన ఎస్.హెచ్.జి. లు;

లక్ష లీటర్లకు పైగా హ్యాండ్ సానిటైజర్ ను తయారుచేసిన 9 రాష్ట్రాల్లోని సుమారు 9 వందల ఎస్.హెచ్.జి. సంస్థలు;

చేతి పరిశుభ్రత కోసం లిక్విడ్ సోప్స్ కూడా తయారుచేసిన కొన్ని ఎస్.హెచ్.జి.లు.

Posted On: 12 APR 2020 3:40PM by PIB Hyderabad

కోవిడ్-19 విజృంభణ వల్ల ప్రపంచవ్యాప్తంగా కనీ వినీ ఎరుగని రీతిలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని కల్పించింది.  దీని వల్ల, భారతదేశంలో వైద్య, పోలీసు, పారిశుధ్య సిబ్బందికి మాస్కులు, వ్యక్తిగత రక్షణ పరికరాలు (పి.పి.ఈ.), పేస్ షీల్డుల వంటి వైద్య సదుపాయాల అవసరం పెరిగిపోయింది.  ప్రభుత్వం చాలా ప్రాంతాల్లో ప్రజలకు మాస్కుల వాడకాన్ని తప్పనిసరి చేసింది. 

దేశవ్యాప్తంగా గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ కింద ఏర్పాటైన దీన్ దయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (డి.ఏ.వై.-ఎన్.ఆర్.ఎల్.ఎం.) లకు చెందిన సుమారు 63 లక్షల స్వయం సహాయ బృందాలలో 690 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. కోవిడ్-19 మహమ్మారిపై జరుగుతున్న పోరాటంలో అన్ని విధాలా సహాయపడుతున్న ఎస్.హెచ్.జి. సభ్యులు సామాజిక యోధుల్లా తమ వంతు కృషి చేస్తున్నారు.  కోవిడ్-19 కు వ్యతిరేకంగా రక్షణలో మాస్కుల అవసరం ఎక్కువగా ఉండడంతో, ఎస్.హెచ్.జి.లు వెంటనే వాటి తయారీకి నడుం బిగించాయి. ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (ఎం.ఓ.హెచ్.ఎఫ్.డబ్ల్యూ.), వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖలు జారీ చేసిన మార్గదర్శకాలకు కట్టుబడి, రాష్ట్రాల ఆరోగ్య శాఖల సూచనలకు అనుగుణంగా 2-3 పొరల నేసిన మరియు నేయని సర్జికల్ మాస్కులు, నూలు మాస్కులు మొదలైన వివిధ రకాల మాస్కులను ఎస్.హెచ్.జి.లు తయారుచేస్తున్నాయి.  ఈ మాస్కులను ఆరోగ్య శాఖలు, స్థానిక స్వపరిపాలన సంస్థలు, స్థానిక పరిపాలనా యంత్రాంగాలు, ముందు వరుసలో పనిచేసే కార్మికులు, పోలీసు అధికారులకు సరఫరా చేయడంతో పాటు బహిరంగ మార్కెట్ లో కూడా విక్రయిస్తున్నారు.   చాలా రాష్ట్రాలలో గ్రామీణ ప్రజలకు కూడా వీటిని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.  ఎస్.హెచ్.జి. సభ్యులు ఇప్పుడు అప్రాన్లుగౌన్లు, పేస్ షీల్డులు మొదలైన వ్యక్తిగత రక్షణ పరికరాలు (పి.పి.ఈ.) లను కూడా తయారుచేయడం ప్రారంభించారు 

ఎస్.హెచ్.జి. నెట్ వర్క్ మరియు మీడియా కవరేజ్ ద్వారా తయారుచేసిన మాస్కులు, పి.పి.ఈ., పేస్ షీల్డులు మొదలైన వాటి వివరాలు

ఏ).   మాస్కులు :  

27 రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్లు (ఎస్.ఆర్.ఎల్.ఎం.లు) అందజేసిన వివరాల ప్రకారం 2020 ఏప్రిల్ 8వ తేదీ వరకు ఎస్.హెచ్.జి. సభ్యులు 1.96 కోట్ల మాస్కులు తయారుచేశారు. ఈ మాస్కుల తయారీ ప్రక్రియలో ప్రస్తుతం సుమారు 78,373 మంది ఎస్.హెచ్.జి. సభ్యులు పనిచేస్తున్నారు.  ఝార్ఖండ్ ఎస్.హెచ్.జి. సభ్యులు ముందుగా స్పందించి 2020 మార్చి నుండి ఇప్పటివరకూ 78 వేలకు పైగా మాస్కులు తయారుచేశారు. ఈ మాస్కులను వివిధ జిల్లా కలెక్టర్ల కార్యాలయాల వద్ద మరియు సబ్సిడీ మందుల దుకాణాల వద్ద ఒక్కొక్కటీ 10 రూపాయల చొప్పున అతి తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. 

 

Jharkhand SHG women producing masks (Source: Twitter)

మాస్కులు తయారుచేస్తున్న ఝార్ఖండ్ ఎస్.హెచ్.జి. మహిళలు 

 

·    దేశంలోని తూర్పు ప్రాంతం నుండి ఛత్తీస్ గఢ్ కు చెందిన 2,1516 మంది గ్రామీణ మహిళలతో కూడిన 853 ఎస్.హెచ్.జి.లు రాష్ట్రానికి మాస్కులు సరఫరా చేశాయి.  ఒడిశా లోని స్వయం సహాయ బృందాలు సాధారణ ప్రజలకు పంపిణీ చేయడం కోసం ఒక మిలియన్ కంటే ఎక్కువగా మాస్కులను తయారుచేశాయి.  తీవ్రంగా ప్రబలుతున్న కోవిడ్-19 ఉధృతిని నివారించడానికి 10,000 ఫేస్ మాస్కులను సరఫరా చేయాలని అరుణాచల్ ప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎస్.హెచ్.జి.లను కోరింది.  

 

· ఆంధ్రప్రదేశ్ లో జిల్లాకు చెందిన 13 సబ్-బ్లాకులకు చెందిన 2,254 బృందాలు క్లాత్ ఫేస్ మాస్కుల తయారీకి ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించాయి   అదేవిధంగా, కర్ణాటకలోని గ్రామీణ స్వయం సహాయ బృందాలురాష్ట్రంలో వ్యాధి వ్యాప్తి నియంత్రణలో తమ చిత్తశుద్ధిని వ్యక్తం చేస్తూ, కేవలం 12 రోజుల్లో 1.56 లక్షల ఫేస్ మాస్కులు తయారుచేశాయి. 

 

·       ఉత్తర గోవా జిల్లాలో ఎస్.హెచ్.జి.ల ద్వారా గ్రామీణాభివృద్ధి సంస్థ రాష్ట్రవ్యాప్తంగా రెండు వేల మాస్కులు సరఫరా చేసింది. మాస్కులకు పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని, హిమాచల్ ప్రదేశ్ లోని ఎస్.హెచ్.జి.లకు చెందిన రెండు వేల మంది సభ్యులు పూర్తిగా  రక్షణ మాస్కుల తయారీ మరియు సరఫరాలో నిమగ్నమై ఉన్నారు. 

బి).   వ్యక్తిగత రక్షణ పరికరాలు: 

ఎస్.హెచ్.జి. సభ్యులు అప్రాన్లుగౌన్లు, ఫేస్ షీల్డులు వంటి పి.పి.ఈ.లను కూడా తయారుచేస్తున్నారు.  మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, కర్ణాటక తో సహా వివిధ రాష్ట్రాలలోని ఎస్.హెచ్.జి.లు ఇంతవరకు సుమారు ఐదు వేల పి.పి.ఈ. కిట్లు తాయారుచేశాయి.  కపుర్తలా లోని సివిల్ సర్జన్ కు ఐదు వందల అప్రాన్లు సరఫరా చేసినట్లు పంజాబ్ ఎస్.ఆర్.ఎల్.ఎం.తెలియజేసింది.  జిల్లా వైద్య ఆరోగ్య అధికారికి రెండు వందల ఫేస్ మాస్కులు సరఫరా చేసినట్లు మేఘాలయ తెలిపింది.  125 ఫేస్ మాస్కులు తయారుచేసినట్లు కర్ణాటక పేర్కొంది.  మేఘాలయ, ఝార్ఖండ్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ లకు చెందిన ఎస్.ఆర్.ఎల్.ఎం.లు తమ ఎస్.హెచ్.జి. సభ్యులు ఫేస్ మాస్కులుగౌన్లు తయారుచేసినట్లు తెలిపాయి

 

సి).  అందుబాటు ధరల్లో సానిటైజర్లు సరఫరా చేయడం ద్వారా మహిళలు తమ సంఘ సభ్యులకు చేతులు శుభ్రం చేసుకోవలసిన ఆవశ్యకతపై అవగాహనను పెంపొందిస్తున్నారు.  

 

గ్రామీణ ప్రాంతాల్లో లభ్యతను పెంపొందించడం కోసం డి.ఏ.వై.-ఎన్.ఆర్.ఎల్.ఎం. మద్దతుతో సూక్ష్మ సంస్థలు హ్యాండ్ సానిటైజర్లు, హ్యాండ్ వాష్ ఉత్పత్తుల తయారీని చేపట్టాయి.  తొమ్మిది రాష్ట్రాల్లోని తొమ్మిది వందల ఎస్.హెచ్.జి. సంస్థలు 1.15 లక్షల లీటర్ల సానిటైజర్లను ఉత్పత్తి చేశాయి.  ఇందులో తమిళనాడు, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు మూడూఒక్కొక్కటీ 25 వేల లీటర్ల కంటే ఎక్కువగా ఉత్పత్తి చేశాయి.  పెరుగుతున్న డిమాండును చేరుకోడానికి ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ ఝార్ఖండ్, కేరళ, మణిపూర్, మధ్యప్రదేశ్, నాగాలాండ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్మిజోరాం రాష్ట్రాలలో నెలకొన్న సుమారు తొమ్మిది వందల ఎస్.హెచ్.జి. సంస్థలు సానిటైజర్లను తయారుచేస్తున్నాయి.  

 

ఝార్ఖండ్ లో,  ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.ఓ.) ప్రతిపాదించిన మార్గదర్శకాలను అనుసరిస్తూ, నిర్ణీత పరిమాణంలో కలిపిన నాలుగు పదార్ధాల మిశ్రమాన్ని ఈ సానిటైజర్లు తయారుచేయడానికి ఉపయోగిస్తున్నారు. ఆల్కహాల్ (72 శాతం), డిస్టిల్డ్ వాటర్ (13 శాతం), గ్లిజరిన్ (13 శాతం), బాసిల్ (2 శాతం) ఉపయోగించి, ఈ సానిటైజర్ ను  తయారుచేస్తున్నారు.  వాటి ఔషధ ప్రభావాల కోసం మరియు వైరస్ ను నాశనం చేసే సమర్ధతను పెంపొందించేందు కోసం, ఈ హ్యాండ్ సానిటైజర్ కు లెమన్ గ్రాస్ లేదా బాసిల్ ను కలుపుతారు.  వంద మిల్లీ లీటర్ల సానిటైజర్ సీసా ధర అతి తక్కువగా 30 రూపాయలుగా నిర్ణయించారు. సాధారణ ప్రజలకు, ఆసుపత్రులకు, పోలీస్ స్టేషన్లకు వీటిని అందుబాటులో ఉంచుతున్నారు. 

కొన్ని ఎస్.హెచ్.జి.లు చేతి శుభ్రత కోసం లిక్విడ్ సోప్స్ కూడా విక్రయిస్తున్నాయి.  ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రమొజోరం, నాగాలాండ్, తమిళనాడు రాష్ట్రాలలో ఉన్న ఎస్.హెచ్.జి.లు 50 వేల లీటర్ల మేర చేతులు శుభ్రం చేసుకోడానికి ఉపయోగించే ఉత్పత్తులను తయారుచేస్తున్నాయి. 

 తమ తమ ప్రాంతాల్లో సురక్షితమైన పరిశుభ్రతను పాటించడానికి అవసరమైన పద్దతులను ప్రోత్సహించడంలో సామాజికంగా ప్రతిస్పందించడం ద్వారా తమ జీవనోపాధిని పరిరక్షించుకుంటూ ఈ మహిళలు, కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించడంలో అత్యంత అంకిత భావం, శ్రద్ద ప్రదర్శిస్తున్నారు. 

****


(Release ID: 1613718) Visitor Counter : 258