మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

‘యుక్తి’ వెబ్‌ పోర్టల్‌కు హెచ్‌ఆర్‌డి మంత్రి శ్రీ రమేష్‌ పోఖ్రియాల్‌ శ్రీకారం

‘విజ్ఞానం-సాంకేతికత-ఆవిష్కరణలతో కోవిడ్‌పై యువభారత్‌ పోరాటం’;

Posted On: 12 APR 2020 2:27PM by PIB Hyderabad

కోవిడ్‌-19పై హెచ్‌ఆర్‌డి శాఖ చేసిన కృషి.. తీసుకున్న చర్యలపై

పర్యవేక్షణ-నమోదు ‘యుక్తి’ లక్ష్యాలు: శ్రీ రమేష్‌ పోఖ్రియాల్‌ నిషాంక్‌

    కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి శ్రీ రమేష్‌ పోఖ్రియాల్‌ “నిషాంక్‌” ఇవాళ ‘యుక్తి’ (యంగ్‌ ఇండియా కంబాటింగ్‌ కోవిడ్‌ విత్‌ నాలెడ్జ్‌, టెక్నాలజీ అండ్‌ ఇన్నొవేషన్‌) పేరిట వెబ్‌ పోర్టల్‌ను న్యూఢిల్లీలో ప్రారంభించారు. కోవిడ్‌ నేపథ్యంలో హెచ్‌ఆర్‌డి శాఖ కృషి, చేపట్టిన చర్యల పర్యవేక్షణ, నమోదు లక్ష్యాలుగా ఈ విశిష్ట పోర్టల్‌-డాష్‌బోర్డును ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ- మన విద్యావైజ్ఞానిక సమాజం కోవిడ్‌-19 ముప్పును సమర్థంగా ఎదుర్కొనాలన్నది తమ లక్ష్యమని చెప్పారు. ఆ మేరకు శారీరకంగా-మానసికంగా ఆరోగ్యంతో ఉంటూ విద్యార్థుల కోసం నిరంతర అత్యున్నత నాణ్యతగల అభ్యాస పర్యావరణాన్ని కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత పరీక్షా సమయంలో ఆ లక్ష్య సాధనకు ఒక ఆయుధంలా ఈ పోర్టల్‌ను హెచ్‌ఆర్‌డి శాఖ ప్రారంభించిందని వివరించారు. రాబోయే ఆరు నెలల్లో మెరుగైన ప్రణాళికా రచనకు, రకరకాల కార్యకలాపాలపై తమ పర్యవేక్షణకు అవసరమైన ఉపకరణాలను ఈ పోర్టల్‌ అందించగలదని ఆశాభావం వ్యక్తంచేశారు. ఆ మేరకు పరిశోధనలను అంతిమ భాగస్వాములైన దేశపౌరుల ముంగిటకు చేర్చే గొప్ప సాధనంగా ‘యుక్తి’ తన పేరును సార్థకం చేసుకోగలదని విశ్వాసం వెలిబుచ్చారు.

*****


(Release ID: 1613587)