రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

పోర్ట్ బ్లెయిర్ లో కోవిడ్-19 నివారణ చర్యల్లో సహాయపడుతున్న భారత నావికాదళం.

Posted On: 12 APR 2020 11:20AM by PIB Hyderabad

కోవిడ్-19 సంక్షోభ సమయంలో చేపడుతున్న సహాయ చర్యల్లో భాగంగా నావెల్ ఎయిర్ స్టేషన్ (ఎన్.ఏ.ఎస్.) ఉత్క్రోష్ మరియు మెటీరియల్ ఆర్గనైజేషన్ (పోర్ట్ బ్లెయిర్సంయుక్తంగా పోర్ట్ బ్లెయిర్ లో ఆహార సరఫరా చేపట్టింది

ఎయిర్ స్టేషన్ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులలో పనిచేస్తున్న 155 మంది కూలీలకోసం ఎన్.ఏ.ఎస్. ఉత్క్రోష్ ఆహార సరఫరా శిబిరాన్ని ఏర్పాటు చేసింది.  ఈ కూలీలు ప్రస్తుతం ఎయిర్ స్టేషన్ పరిసరప్రాంతాల్లోనే ఉన్నారు. 

 మెటీరియల్ ఆర్గనైజేషన్ (పోర్ట్ బ్లెయిర్) కు చెందిన ఒక బృందం వనవాసి కళ్యాణ్ ఆశ్రమాన్ని సందర్శించి, అక్కడ సిబ్బందికీ, పిల్లలకీ భోజనంతో పాటు ఇతర  ఆహార పదార్ధాలు పంపిణీ చేశారు.   వనవాసి కళ్యాణ్ ఆశ్రమం అనే ఈ లాభాపేక్ష లేని సంస్థ ఆదివాసీ పిల్లలకు వసతి, ఆహారం కల్పిస్తుంది.  ఈ సంస్థకు పోర్ట్ బ్లెయిర్ లో 38 పిల్లలకు వసతి కల్పిస్తున్న ఒక యూనిట్ ఉందిపోర్ట్ బ్లెర్ లో వైద్య సౌకర్యం కోసం వచ్చే ఆదివాసీ కుటుంబాల వారికి ఈ సంస్థ వసతి సౌకర్యం కూడా కల్పిస్తుంది.  ఈ బృందం ఆక్కడి సిబ్బందికీపిల్లలకీ కోవిడ్-19 పై అవగాహన కల్పించడంతో పాటు, లాక్ డౌన్ సమయంలో ఈ మహమ్మారి వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కూడా వారికి తెలియజేస్తోంది. 

 

 

 

*****



(Release ID: 1613573) Visitor Counter : 133