ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 అప్‌డేట్స్‌

Posted On: 11 APR 2020 6:22PM by PIB Hyderabad

దేశంలో కోవిడ్ -19 నివారణ, నియంత్రణ  నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు , కేంద్ర‌పాలిత ప్రాంతాల‌తో పాటు  కేంద్ర‌ ప్రభుత్వం ప‌లు చర్యలు తీసుకుంది. వీటిని నిరంత‌రం ఉన్న‌త స్థాయిలో సమీక్షిస్తున్నారు, పర్యవేక్షిస్తున్నారు.
గౌర‌వ ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈరోజు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్య‌మంత్రుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా మాట్లాడి, ప‌రిస్థితిని స‌మీక్షించారు.అలాగే కోవిడ్ -19 పై పోరాటంలో త‌మ స‌మ‌ష్ఠి సంక‌ల్పాన్ని తెలియ‌జేశారు.
కేంద్ర ప్రభుత్వం సాగిస్తున్న నిరంతర ప్రయత్నాల‌లో భాగంగా, గ్రేడెడ్ రెస్పాన్స్ విధానాన్ని అనుసరించి, దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో పిపిఇలు, ఎన్- 95 మాస్క్‌లు, టెస్టింగ్ కిట్లు, మందులు , వెంటిలేటర్ల వంటి కీల‌క‌ వస్తువుల సరఫరాకు కొర‌త‌లేకుండా చూస్తోంది.  కోవిడ్  రోగుల సంరక్షణ కోసం కేంద్ర , రాష్ట్ర స్థాయిల‌లో  కోవిడ్ -19 ప్ర‌త్యేక‌ ఆస్పత్రుల ఏర్పాటుకు ప్ర‌భుత్వం హామీ ఇస్తోంది.
ప్ర‌స్తుతానికి కేంద్ర , రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు సంబంధించిన కోవిడ్ స‌దుపాయాలు , బెడ్ల‌సంఖ్య‌:
కోవిడ్ ప్ర‌త్యే స‌దుపాయాలు : 586
ఐసొలేష‌న్ బెడ్లు : 1.04,613
ఐసియు బెడ్లు : 11,836
 కోవిడ్ -19 వైర‌స్ పై పోరాటంలో ముందుండి ప‌నిచేసే  ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల సామ‌ర్ధ్యం పెంపు , , అలాగే కోవిడ్ -19 పేషెంట్ల సంర‌క్ష‌ణ కోసం న్యూఢిల్లీలోని  ఎయిమ్స్, వెబ్‌నార్లను నిర్వహిస్తోంది. ఈ వెబ్‌నార్ల షెడ్యూల్  ఎప్ప‌టిక‌ప్పుడు  https://www.mohfw.gov.in.లో అప్‌డేట్ చేస్తున్నారు.
అలాగే,  ఆయ‌ష్ మంత్రిత్వ‌శాఖ శ్వాస‌కోశ సంబంధ‌ ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసింది.
 అలాగే ఆయుష్ ప‌రిష్కారాల‌ను దేశ‌వ్యాప్తంగా వైర‌స్ నిరోధానికి  చేప‌ట్టే జిల్లా కంటింజెన్సీ ప్ర‌ణాళిక‌ల‌లో చేర్చాల్సిందిగా ప్ర‌తిపాదించారు. ఈ మార్గ‌ద‌ర్శ‌కాలు కూడా MoHFW వెబ్‌సైట్ లొ ఉన్నాయి.
ప‌లు జిల్లాలు కోవిడ్ -19 ను ఎదుర్కొనేందుకు సంబంధించి ప‌లు వినూత్న న‌మూనాల‌ను చేప‌డుతున్నాయి.
తొలి వైర్ క్లస్టర్ ను  కనుగొన్న‌ ఆగ్రాలో, కోవిడ్ -19 వ్యాప్తి నిరోధ‌ నిర్వహణ లో భాగంగా క్లస్టర్ నియంత్రణ వ్యూహంపై దృష్టి పెట్టారు. రాష్ట్ర, జిల్లా పరిపాలనాయంత్రాంగం , కోవిడ్‌పై పోరాటంలో ముందున్న వ‌ర్క‌ర్లు,   స్మార్ట్ సిటీకిగ‌ల‌ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ఐసిసిసి) ను కోవిడ్‌పై పోరాటానికి వార్  రూంలుగా  ఉపయోగించడం ద్వారా వారి ప్రయత్నాలను సమన్వయంతో కొన‌సాగించారు.క్లస్టర్  నియంత్ర‌ణ‌, వైర‌స్ వ్యాప్తి నిరోధక ప్రణాళికల క్రింద, జిల్లా యంత్రాంగం వ్యాధి విస్త‌ర‌ణ  కేంద్రాలను గుర్తించింది,  ధృవీకరించబడిన కేసుల ప్రభావాన్ని మాప్‌లో  పేర్కొంది. జిల్లా పాల‌నాయంత్రాంగం రూపొందించిన సూక్ష్మ ప్రణాళిక ప్రకారం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను  ఏర్పాటు చేసింది..
 సర్వే , నియంత్రణ ప్రణాళిక ద్వారా హాట్‌స్పాట్‌ల‌ను గుర్తించారు..  వైర‌స్ వ్యాప్తి కేంద్రం నుండి 3 కిలోమీటర్ల విస్తీర్ణాన్ని గుర్తించగా, 5 కిలోమీటర్ల బఫర్ జోన్‌ను వ్యాధి నియంత్ర‌ణ జోన్‌గా గుర్తించారు. ఈ కంటైన్ మెంట్ జోన్లలో, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లను 1248 బృందాలను రంగంలొకి దించారు. ప్రతి బృందంలో 2  ఇద్ద‌రు ఉన్నారు, వీటిలో  ఎ ఎన్ ఎం లు / ఆశా / ఎడ‌బ్ల్యుడ‌బ్ల్యులు, ఇంటింటి ప‌రిశీల‌న‌ల‌ ద్వారా 9.3 లక్షల మందిని ప‌రిశీలించ‌డం జ‌రిగింది.. దీనికి తోడు  తొలి కాంటాక్ట్ ను గుర్తించ‌డం, తొలి కాంటాక్ట్‌ను త్వ‌ర‌గా గుర్తించ‌డాన్ని  మ్యాపింగ్ చేశారు.. దీనికితోడు ఐసొలేష‌న్‌, ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌, చికిత్స‌ల‌కు సంబంధించిన స‌దుపాయాల‌ను ప్ర‌భుత్వ , ప్రైవేటు భాగ‌స్వామ్యంతో నెల‌కొల్ప‌డం జ‌రిగింది. దీనితోపాటు ఆహారం ,ఇత‌ర స‌ర‌ఫ‌రాల‌ను అవ‌స‌ర‌మైన వారికి అందించ‌డంపై దృష్టిపెట్డడం జ‌రిగింది. అత్యావ‌శ్య‌క స‌ర‌కుల స‌ర‌ఫ‌రా జ‌రిగేట్టు చూశారు.
పౌరులకు  ఇంటివ‌ద్ద‌కే స‌రుకుల పంపిణీకి ఏర్పాట్లు చేశారు.  లాక్డౌన్ సమయంలో అవసరమైన వస్తువులు , సేవలను తరలించడానికి ఈ-పాస్ సౌకర్యం సులభతరం చేసింది. ఈ చ‌ర్య‌లు చేప‌డూతూనే  పౌరుల‌లో అవ‌గాహ‌న పెంచే కార్య‌క్ర‌మాలు చేపట్ట‌డం, వారితో చ‌ర్చించ‌డం వంటి వాటిపై  జిల్లా యంత్రాంగం నిరంతరం దృష్టి సారించింది. ప్రజలను చేర‌డానికి, కేంద్ర హెల్ప్‌లైన్‌లు ఏర్పాట‌య్యాయి.  ప్ర‌జ‌ల ప్రతిస్పందనలను సమన్వయం చేయడానికి బహుళ కార్య‌క‌లాపాలు చేపట్టే బృందాల‌ను ఏర్పాటు చేశారు..
ఆగ్రా అనుసరించిన క్లస్టర్ నియంత్ర‌ణ వ్యూహాన్ని  ఉత్త‌మ విధానంగా ఇతర రాష్ట్రాలతో  షేర్ చేసుకుంటున్నారు.
నిన్నటి నుండి దేశంలో కోవిడ్ -19 నిర్ధారిత కేసులలో   1035 కేసుల పెరుగుదల క‌నిపించింది.  యాక్టివ్ కేసులలో 855 పెరుగుదల నమోదైంది. ఈ రోజు వ‌ర‌కు  సంభవించిన మొత్తం మరణాలు 239. కోవిడ్ నుంచి  కోలుకున్న  642 మంది  ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతానికి మొత్తం 7447 కేసులు నమోదయ్యాయి.
కోవిడ్ -19 కు సంబంధించి అధీకృత , తాజా స‌మాచారం , ఇందుకు సంబంధించిన సాంకేతిక అంశాలు, మార్గ‌ద‌ర్శకాలు, సూచ‌న‌ల‌కోసం ద‌య‌చేసి క్రమం త‌ప్ప‌కుండా చూడండి :https://www.mohfw.gov.in/.
కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతిక సందేహాల‌ను  technicalquery.covid19[at]gov[dot]in  కు ఈ మెయిల్ చేయ‌వ‌చ్చు. ఇత‌ర ప్ర‌శ్న‌ల‌ను  ncov2019[at]gov[dot]in కు పంపవ‌చ్చు.
కోవిడ్ -19 కు సంబంధించి ఏవైనా ప్ర‌శ్న‌లు ఉంటే కేంద్ర‌ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ హెల్ప్‌లైన్ నెంబ‌ర్  
 +91-11-23978046 కు లేదా 1075 (టోల్ ప్రీ నెంబ‌ర్‌) కు ఫోన్ చేయాల‌న్నారు.  కోవిడ్ -19 పై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతా ల హెల్ప్ లైన్ నంబ‌ర్ల జాబితా  https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf లింక్ లో అందుబాటులో ఉంది.


 

*****


(Release ID: 1613431) Visitor Counter : 152