కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ప్రకారం చందాదారుల ఈ.పి.ఎఫ్. మరియు ఈ.పి.ఎస్. ఖాతాలలో జమ చేయడానికి ఆన్ లైన్ యంత్రాంగాన్ని ఏర్పాటుచేసిన ఈ.పి.ఎఫ్.ఓ.

సుమారు 79 లక్షల మంది చందాదారులు మరియు సుమారు 3.8 లక్షల సంస్థలకు ప్రయోజనం


మూడు నెలల్లో 4,800 కోట్ల రూపాయల సబ్సిడీ చెల్లించనున్నట్లు అంచనా.

Posted On: 11 APR 2020 2:31PM by PIB Hyderabad

కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడుతున్న పేద ప్రజలకు సహాయం చేయడం కోసం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 2020 మార్చి 3వ తేదీన కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ ప్రకారం తమ చందాదారుల ఈ.పి.ఎఫ్. మరియు ఈ.పి.ఎస్. ఖాతాలలో జమ చేయడానికి కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వశాఖ కింద ఏర్పాటైన చట్టబద్ధ సంస్థ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈ.పి.ఎఫ్.ఓ.) ఒక ఎలక్ట్రానిక్ వ్యవస్థను ఏర్పాటుచేసింది

 దీని ప్రకారం, అర్హత కలిగిన సంస్థలు ఎలక్ట్రానిక్ చలాన్-కం-రిటర్న్ (ఈ.సి.ఆర్.) పూర్తిచేసి ప్రభుత్వం ప్రకటించిన సహాయాన్ని పొందవచ్చు.  ఈ.సీ.ఆర్. లో పేర్కొన్న విధంగా ఈ.పి.ఎఫ్. మరియు ఈ.పి.ఎస్. ఖాతాల కింద (జీతాలలో 24 శాతం) బాకీ ఉన్న మొత్తాన్ని మూడు నెలల పాటు కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. నెల జీతం 15,000 రూపాయల కంటే తక్కువగా ఉన్న ఈ.పి.ఎఫ్. చందాదారుల యు.ఏ.ఎన్.ల ఖాతాలలో ఈ మొత్తాలను జమ చేస్తారు. వీరు వంద మంది వరకు ఉద్యోగులు ఉన్న ఈ.పి.ఎఫ్. పరిధిలోని సంస్థలు / ఫ్యాక్టరీలలో ఇప్పటికే పని చేస్తూ ఉండాలి. ఆ సంస్థ / ఫ్యాక్టరీలో 15,000 రూపాయల కంటే జీతం పొందుతున్న ఉద్యోగులు 90 శాతం కంటే ఎక్కువ ఉండాలి.  ఈ ప్యాకేజీ ద్వారా సుమారు 79 లక్షల మంది చందాదారులు మరియు సుమారు 3.8 లక్షల సంస్థలకు ప్రయోజనం చేకూరుతుందని అంచనా. మూడు నెలల కాలంలో  4,800 కోట్ల రూపాయల సబ్సిడీ చెల్లించనున్నట్లు అంచనా వేశారు 

కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడుతున్న పేద ప్రజలకు సహాయం చేయడం కోసం 2020 మార్చి 26వ తేదీన కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.  తక్కువ జీతాలతో పనిచేస్తున్న ఈ.పి.ఎఫ్. సభ్యుల ఉద్యోగాలకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూడాలనీ, అదేవిధంగా ఈ.పి.ఎఫ్. పరిధిలోని సంస్థలకు సహాయం అందించాలనీ ఉద్దేశ్యంతో - ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ను ప్రకటించారు 

 ఈ ప్యాకేజీ ని సమర్ధంగా అమలుచేయడానికి వీలుగా కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వశాఖ ఈ పధకం ఉద్దేశ్యం, అర్హత, చెల్లుబాటు వ్యవధి, ఈ ప్రయోజనాన్ని పొందే విధానం, పద్ధతి మొదలైన అంశాలను వివరిస్తూ ప్రకటన విడుదల చేసింది.   

ఎలక్ట్రానిక్ చలాన్-కం-రిటర్న్ (ఈ.సి.ఆర్.) లో పూర్తిచేసిన వివరాల ప్రకారం తమ సంస్థల్లో పనిచేసే అర్హులైన ఉద్యోగులకు ఈ ప్రయోజనం లభిస్తుంది. 

ఈ పధకం కింద అర్హత కలిగిన సంస్థలు తమ ఉద్యోగులందరికీ నెల జీతాలు చెల్లించిన అనంతరం ఎలక్ట్రానిక్ చలాన్-కం-రిటర్న్ (ఈ.ఎస్.ఆర్.) దాఖలు చేయడంతో పాటు అవసరమైన ధ్రువపత్రం జత చేస్తూ, ప్రయోజనం పొందడానికి దరఖాస్తు చేసుకోవాలి

 ఈ.సి.ఆర్. అప్ లోడ్ చేసిన తర్వాత సంస్థ మరియు ఉద్యోగుల అర్హతను ధృవీకరిస్తారు.  చలాన్ లో ఉద్యోగులుసంస్థలు చెల్లించవలసిన మొత్తం చందా వివరాలు, అర్హత కలిగిన ఉద్యోగులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చెల్లించవలసిన మొత్తం వివరాలు, సంస్థ చెల్లించవలసిన మిగిలిన మొత్తం వంటి అంశాలను స్పష్టంగా పేర్కొనాలి.   

 ఇతర ఉద్యోగులకు సంస్థ చెల్లించవలసిన చందా పూర్తిగా చెల్లించిన అనంతరం, చలాన్ లో పేర్కొన్న ఈ.పి.ఎఫ్. మరియు ఈ.పి.ఎస్. చందాలను కేంద్ర ప్రభుత్వం ఆ సంస్థకు చెందిన అర్హులైన ఉద్యోగుల యు.ఏ.ఎన్. ఖాతాలలో నేరుగా జమ చేస్తుంది. 

 ఈ పధకానికి చెందిన వివిధ అంశాలపై తరచుగా తలెత్తే ప్రశ్నలతో పాటు వివరణలతో పాటు ఇతర వివరాలను ఈ.పి.ఎఫ్.ఓ. వెబ్ సైట్ లో టి.ఏ.బి. "కోవిడ్-19" లో చూడవచ్చు. 

*****


(Release ID: 1613361) Visitor Counter : 293