ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 పై తాజా సమాచారం
Posted On:
10 APR 2020 7:42PM by PIB Hyderabad
దేశంలో కోవిడ్-19 నివారణ, నియంత్రణ మరియు నిర్వహణ కోసం భారత ప్రభుత్వం వివిధ రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలతో కలిసి అనేక చర్యలు చేపట్టింది. వీటిని క్రమం తప్పకుండా ఉన్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.
కోవిడ్ -19 నిర్వహణ కోసం తీసుకుంటున్న చర్యలు, సంసిద్ధతపై ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ కేంద్ర మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ఆరోగ్య శాఖ మంత్రులు, ప్రధాన కార్యదర్శులు / ఆరోగ్య శాఖ కార్యదర్శులతో ఈ రోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబేకూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ హర్ష వర్ధన్ మాట్లాడుతూ, దేశంలోని ప్రతి జిల్లాలోనూ సాధ్యమైనంత తొందరలో కోవిడ్-19 కోసం ఒక ఆసుపత్రిని ప్రత్యేకంగా కేటాయించవలసిన అవసరం ఉందనీ, అప్పుడు ప్రజలకు వాటి గురించి తెలియజేయవచ్చుననీ, సూచించారు. ఏ కేటగిరీకి చెందిన ఆరోగ్య కార్యకర్త / నిపుణులు ఏ కేటగిరీకి చెందిన పి.పి.ఈ లను ఉపయోగించాలనే విషయమై సవివరమైన మార్గదర్శకాలు మంత్రిత్వ శాఖకు చెందిన వెబ్ సైట్ (www.mohfw.gov.in) లో అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. వాటి హేతుబద్దమైన ఉపయోగాల గురించి రాష్ట్రాలు సంబంధిత వ్యక్తులకు అవగాహన కల్పించాలని ఆయన అన్నారు.
ఆసుపత్రుల్లోని వివిధ ప్రాంతాల్లో పి.పి.ఈ.ల ఉపయోగాన్ని వివరిస్తూ రూపొందించిన వీడియో ను ఈ దిగువ పొందుపరచిన లింకు ద్వారా వీక్షించవచ్చు.
https://www.youtube.com/watch?v=LzB5krucZoQ&feature=youtu.be
భారత ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలతో " భారత కోవిడ్-19 అత్యవసర ప్రతిస్పందన మరియు ఆరోగ్య వ్యవస్థ సన్నద్ధత ప్యాకేజి" ని ప్రకటించింది. కోవిడ్-19 రోగుల చికిత్సతో పాటు కోవిడ్-19 పై ప్రాధమిక దృష్టితో దేశంలోని వైద్య మౌలిక సదుపాయాలను పటిష్ఠపరచటానికి ఈ నిధులను వినియోగించవచ్చు. దీని వల్ల కోవిడ్-19 పరీక్షల సదుపాయాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ నిధులను వ్యక్తిగత రక్షణ పరికరాలు (పి.పి.ఈ.లు), ఐసోలేషన్ పడకలు, వెంటిలేటర్లు, ఇతర అత్యవసర వైద్య పరికరాల కొనుగోలుతో పాటు వైద్య సిబ్బందికీ, పారామెడికల్ సిబ్బందికీ తగిన శిక్షణా కార్యక్రమాల నిర్వహణ కు వినియోగించవచ్చు.
వ్యక్తిగత రక్షణ పరికరాల (పి.పి.ఈ.ల) తయారీకి 39 స్వదేశీ ఉత్పత్తి దారులను గుర్తించడం జరిగింది. అన్ని రాష్ట్రాలలోనూ ముందు వరసలో పనిచేసే వైద్య సిబ్బందికి సమృద్ధిగా పి.పి.ఈ.లు సరఫరా చేసే విధంగా భారత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంది.
రాష్ట్రాలకు 20.40 లక్షల ఎన్-95 రకం మాస్కులు సరఫరా చేయడం జరిగింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటినుండే సేకరణ చర్యలు ప్రారంభించడం జరిగింది. వీటితోపాటు, 49,000 వెంటిలేటర్ల కోసం ఆర్డర్ ఇవ్వడం జరిగింది. భవిష్యత్ అవసరాలకు కూడా తగిన సంఖ్య లో వెంటిలేటర్లు తీసుకోవడం జరుగుతుంది.
రక్త మార్పిడి, స్వచ్చంద రక్త దానం పై ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ మార్గదర్శకాలను దిగువ పొందుపరచిన వెబ్ సైట్ లో చూడవచ్చు.
https://www.mohfw.gov.in/pdf/NBTCGUIDANCEFORCOVID19.pdf
రక్తం మరియు రక్త కణాలు, ముఖ్యంగా, ప్రాణాలు కాపాడ్డం కోసం రక్త మార్పిడి అవసరమైన రోగుల కోసం అవసరమైనంత మేర అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
కోవిడ్-19 రోగులతో పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తలు, ఐ.సి.యు. కేసులు, హై రిస్క్ కాంటాక్ట్స్ లో ఉన్న వారితో సహా మొత్తం హైడ్రాక్సీ క్లోరోక్విన్ (హెచ్.సి.క్యూ.) టాబ్లెలెట్లు ఒక కోటి అవసరమౌతాయని అంచనా వేయగా, ప్రస్తుతం 3.28 కోట్ల టాబ్లెట్లు అందుబాటులో ఉన్నాయి. ఇది దేశంలో అంచనా వినియోగానికి మూడు రెట్లు కంటే ఎక్కువగా ఉంది. దీనికి అదనంగా మరో 2 నుండి 3 కోట్ల టాబ్లెట్లు స్టాక్ లో ఉన్నాయి.
ఏ.ఐ.ఐ.ఐ.ఎమ్.ఎస్. తన వెబ్ ఆధారిత సదస్సుల్లో భాగంగా గర్భధారణ మరియు ప్రసవ నిర్వహణ పై ఆన్ లైన్ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ శిక్షణా కార్యక్రమం ఈ దిగువ పేర్కొన్న వెబ్ సైట్ పై కూడా అందుబాటులో ఉంది.
https://www.youtube.com/watch?v=MJwgi1LCu8o&feature=youtu.be
ఇప్పటి వరకు, 146 ప్రభుత్వ లేబరేటరీలు, 67 ప్రైవేటు లేబరేటరీలతో పాటు 16,000 కలెక్షన్ సెంటర్లతో పరీక్షల సామర్ధ్యం గణనీయంగా పెరిగింది. 2020 ఏప్రిల్ 9వ తేదీన సుమారు 16,002 నమూనాలు పరీక్షించగా, అందులో 320 నమూనాలు పాజిటివ్ గా కనుగొన్నారు ( సుమారు 2 శాతం) . అయితే, ఈ సంఖ్య ఏ రోజు కా రోజు సేకరించిన నమూనాలను బట్టి మారుతూ ఉంటుంది.
ఇంతవరకు, 6,412 కేసులను ధృవీకరించారు. 199 మరణాలు నమోదయ్యాయి. 503 మంది చికిత్స అనంతరం కోలుకుని ఆసుపత్రుల నుండి విడుదల అయ్యారు.
కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలు, మార్గదర్శకాలు, సలహాలు, సూచనలపై ప్రామాణికమైన, తాజా సమాచారం కోసం ఈ వెబ్ సైట్ ను క్రమం తప్పకుండా సందర్శించండి :
: https://www.mohfw.gov.in/.
కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలకు పరిష్కారాలను దిగువ పేర్కొన్న ఈ మెయిల్ ను సంప్రదించడం ద్వారా తెలుసుకోవచ్చు :
technicalquery.covid19[at]gov[dot]in
ఇతర సందేహాలు, అనుమానాలకు పరిష్కారాలను దిగువ పేర్కొన్న ఈ మెయిల్ ను సంప్రదించడం ద్వారా తెలుసుకోవచ్చు :
ncov2019[at]gov[dot]in .
కోవిడ్-19 పై ఎటువంటి అనుమానాలు, సమస్యలు, సమాచారానికైనా, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఉచిత హెల్ప్ లైన్ నెంబర్ : +91-11-23978046 లేదా 1075 ను సంప్రదించవచ్చు.
వివిధ రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల కు చెందిన కోవిడ్-19 హెల్ప్ లైన్ నెంబర్ల జాబితా మరియు ఇతర సమాచారం కోసం ఈ వెబ్ సైట్ ని చూడండి :
https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .
*****
(Release ID: 1613138)
Visitor Counter : 217
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam