రైల్వే మంత్రిత్వ శాఖ
రైళ్ళ పునరుద్ధరణ, ప్రయాణీకుల ప్రయాణాలపై ప్రసారమాధ్యమాల అసత్య నివేదికలు : ప్రసార మాధ్యమాలకు సలహా
Posted On:
10 APR 2020 1:42PM by PIB Hyderabad
గత రెండు రోజులుగా వివిధ ప్రసార మాధ్యమాలు ప్రయాణీకులను గందరళగోళానికి గురిచేసే విధంగా అసత్య వార్తలను ప్రచారం చేస్తున్నాయి. కొన్ని ప్రసార మాధ్యమాలు ప్రకటించిన తేదీన ఎన్ని రైళ్ళు ప్రారంభించనున్నాయో కూడా ఇస్తున్నారు.
ఈ విషయంలో వివిధ ప్రసార మాధ్యమాలకు తెలియజేయునది ఏమనగా రైళ్ళ పునరుద్ధరణ గురించి ఇంకా ఏ నిర్ణయం తీసుకొనబడలేదు, కావున ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో, ఈ విషయాలపై అనవసర,అసత్య వార్తలను ప్రజల్లోకి పంపడం వలన ప్రజల్లో గందరగోళం సృష్టించడమే అవుతుంది. కావున ఈ విషయంపై అనవసరమై, ఆధారంలేని అసత్య వార్తలను ప్రచురించడం కానీ లేదా ప్రసారం చేయడం కానీ చేయరాదని వివిధ ప్రసార మాధ్యమాలను కోరటమైనది. లాక్డౌన్ తదనంతరం రైలు ప్రయాణాల గరించి ప్రయాణీకులతోపాటు అందరు భాగస్వాములకు ప్రయోజనాన్ని కూర్చే విధంగా తగిన నిర్ణయాన్ని రైల్వేలు తీసుకుంటుందని. ఈ విషయమై ప్రభుత్వం ఏ నిర్ణయమైనా తీసుకున్నట్లైతే ప్రచార ప్రసార మాధ్యమాలకు తప్పకుండా తెలియజేయబడుతుంది.
(Release ID: 1613012)
Visitor Counter : 78
Read this release in:
Urdu
,
English
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam