రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
దేశంలో ఎరువులు అవసరానికి తగినంత ఉన్నాయి: కేంద్ర ఎరువుల శాఖ మంత్రి శ్రీ సదానంద గౌడ
Posted On:
09 APR 2020 5:14PM by PIB Hyderabad
రానున్న ఖరీఫ్ సీజన్ కోసం కేంద్ర రసాయన మరియు ఎరువులు శాఖ పరిధిలోని ఎరువుల విభాగం కృషి చేస్తోందని, సీజనాటికల్లా దేశంలో తగినంత ఎరువుల నిల్వలు ఉంటాయని ఆ శాఖ మంత్రి వర్యులు శ్రీ డివి సదానంద గౌడ ఒక ట్వీట్లో తెలిపారు.
రైతులకు సరియైన సమయంలో ఎరువులను అందించడానికి ఎరువుల ఉత్పత్తి, రవాణా మరియు అందుబాటులో ఉంచడం గురించి సూక్ష్మంగా పరిశీలిస్తున్నట్లు, అలాగే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో మరియు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖతో ఈ విషయంలో తగిన సమాచార సంబంధాలను కలిగి ఉన్నట్లు ఆయన తెలిపారు.
కర్ణాటక గురించి చేసిన ప్రత్యేక ట్వీట్లో ఇప్పటి వరకు కర్ణాటకలో విత్తనాలు, ఎరువులు మరియు పురుగు మందుల కొరత లేదని, రాష్ట్రంలో నెలకు 2.57 లక్షల టన్నుల ఎరువుల అవసరం ఉండగా ప్రస్తుతం 7.3 లక్షల టన్నుల నిల్వ ఉన్నట్లు శ్రీ సదానంద గౌడ తెలిపారు.
నంగల్, భటిండా, పానిపట్ మరియు విజయ్పూర్లలోని ఎరువుల తయారీ కర్మాగారాలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నట్లు ఎరువుల శాఖ పరిధిలో ఉన్న జాతీయ ఎరువుల లిమిటెడ్-ఎన్ఎఫ్ఎల్, పిఎస్యు తెలిపింది. రైతుల అవసరాల కోసం యూరియాను ఎప్పటికప్పుడు మార్కెట్లోనికి పంపిస్తున్నట్లు తెలిపింది.
***********
(Release ID: 1612888)
Visitor Counter : 196
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada