ప్రధాన మంత్రి కార్యాలయం
గుడ్ ఫ్రైడే రోజున జీసస్ ను గుర్తుచేసుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
10 APR 2020 10:59AM by PIB Hyderabad
సత్యం, సేవ మరియు న్యాయం పట్ల యేసు క్రీస్తు నిబద్ధతను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గుడ్ ఫ్రైడే రోజున గుర్తు చేసుకున్నారు.
" ప్రభువైన క్రీస్తు తన జీవితాన్ని ఇతరుల సేవ కోసం త్యాగం చేశారు. ఆయన ధైర్యం మరియు ధర్మంతో పాటు న్యాయ భావన తరతరాలకు ఆదర్శంగా నిలుస్తాయి. ఈ రోజు గుడ్ ఫ్రైడే రోజున మనం క్రీస్తు ప్రభువునూ, అలాగే సత్యం, సేవ మరియు న్యాయం పట్ల ఆయన నిబద్ధతనూ మనం గుర్తు చేసుకుందాం", అని ప్రధానమంత్రి తమ సందేశంలో పేర్కొన్నారు.
*****
(रिलीज़ आईडी: 1612883)
आगंतुक पटल : 99
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam