ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖ గర్భధారణ సమయంలో లింగ నిర్థారణను తెలుపుటను నిషేధించిన పిసి & పిన్డిటి చట్టాన్ని నిలిపివేయలేదు

Posted On: 09 APR 2020 7:13PM by PIB Hyderabad

ప్రాసార మాధ్యమాల్లో ఒక వర్గం కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖ వారు గర్భంలోని శిశువు లింగ నిర్థారణ చేసే పద్దతుల నిషేధ చట్టం పిసి పిన్డిటి చట్టం 1994ను నిలిపివేసిందని చేస్తున్న ప్రచారాన్ని ఖండించింది. లింగ నిర్థారణ నిషేధ చట్టాన్ని నిలిపివేయలేదని స్పష్టం చేసింది.

కొవిడ్ -19 వలన జరుగుతున్న లాక్డౌన్ దృష్ట్యా పిసి & ఎన్డిటి నిబంధనలు 1996లోని కొన్ని అంశాలను నిలిపివేసినట్లు 04 ఏప్రిల్ 2020న కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖ ఒక ప్రకటన ఇచ్చింది. ఈ సమయంలో  5వ తేదీ నుండి  సమర్పించే పరీక్ష నివేదకల,  నమోదుల పునరుద్ధరణ మరియు రాష్ట్రాలు/కేంద్ర  పాలిత ప్రాంతాల త్రైమాసిక నివేదిక(క్యూపిఆర్)ల సమర్పణలకు సంబంధించి  నిబంధనలను సంబంధించింది.

అల్ట్రాసౌండ్ క్లినిక్, జెనెటిక్ కౌన్సెలింగ్ కేంద్రాలు, జెనెటిక్ లాబొరేటరీ, జెనెటిక్  ఇమేజింగ్ కేంద్రాలు చట్ట ప్రకారం తప్పనిసరిగా నిర్వహించవలసిన రోజు వారీ రికార్డులను నిర్వహించాలని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ రికార్డులను సమర్పించడానికి గడవు తేదీని మాత్రమే జూన్ 30,2020 వరకు పొడిగించడమైనది. కానీ  పిసి పిన్డిటి చట్టంలోని నింబంధనల ప్రకారం పరీక్షా కేంద్రాలకు ఎటువంటి మినహాయింపు లేదు. నిబంధనల ప్రకారం నిర్వహించవలసిన అన్ని రికార్డులను తప్పనిసరిగా నిర్వహించవలసిందేనని ఈ ప్రకటన తెలిపింది. కఠినమైన పిసి పిన్డిటి చట్టం మరియు నిబంధలు తప్పనిసరిగా అమలు జరుగతాయి.


(Release ID: 1612728) Visitor Counter : 247