రైల్వే మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 మహమ్మారి నుంచి ఇండియాను రక్షించడంలో ముందున్న రైల్వేలు

మహమ్మారిని అంతం చేసే ప్రయత్నంలో భారతీయ రైల్వేలు దాదాపు 6 లక్షల పునర్వినియోగ యోగ్యమైన మాస్కులు మరియు 40వేల లీటర్ల కన్నా ఎక్కువ హాండ్ శానిటైజర్ ను తయారు చేసింది

అన్ని రైల్వే జోన్లు, ఉత్పత్తి విభాగాలు మరియు ప్రభుత్వ రంగ సంస్థలు ఇందులో కలసి ఉన్నాయి; ఈ విషయంలో కొన్ని రైల్వే జోన్లు పశ్చిమ రైల్వే, ఉత్తర మధ్య రైల్వే, వాయవ్య రైల్వే, మధ్య రైల్వే,తూర్పు మధ్య రైల్వే, పశ్చిమ మధ్య రైల్వే ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి

విధులకు హాజరయ్యే సిబ్బంది అందరికీ ముఖాలకు అడ్డుగా ధరించే మాస్కులను, హాండ్ శానిటైజర్ లను ఇవ్వడం జరుగుతోంది. వీటిని కాంట్రాక్టు కార్మికులకు కూడా ఇస్తున్నారు.

Posted On: 09 APR 2020 1:33PM by PIB Hyderabad

కోవిడ్ -19 వ్యాప్తిని అడ్డుకునే చర్యల కొనసాగింపులో భాగంగా  భారతీయ రైల్వేలు భారత ప్రభుత్వం ఉపక్రమించిన ఆరోగ్య సంరక్షణ చర్యలకు మద్దతుగా భారతీయ రైల్వీలు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది.  ఈ చర్యలలో భాగంగా భారతీయ రైల్వేలు పునర్వినియోగ యోగ్యమైన మాస్కులు మరియు శానిటైజర్లను అన్ని రైల్వే జోన్లు, ఉత్పత్తి యూనిట్లలో, ప్రభుత్వ రంగ సంస్థలలో తయారు చేయడం జరుగుతోంది.
భారతీయ రైల్వేలు 2020 ఏప్రిల్ 7వ తేదీ వరకు  మొత్తం 582317 తిరిగి వినియోగించగల మాస్కులను మరియు 41882 లీటర్ల శానిటైజర్లను  అన్ని రైల్వే జోన్లు, ఉత్పత్తి యూనిట్లలో, పి ఎస్ యులలో తయారు చేశారు.  కొన్ని రైల్వే జోన్లు ఈ విషయంలో అగ్రభాగాన నిలిచాయి. సంఖ్యాపరంగా చూసినట్లయితే  పశ్చిమ రైల్వేలో 81008 మాస్కులు , 2569 లీటర్ల హాండ్ శానిటైజర్ తయారు చేశారు.  ఉత్తర మధ్య రైల్వే (ఎన్ సి ఆర్)లో 77995 మాస్కులు , 3622 లీటర్ల హాండ్ శానిటైజర్, వాయవ్య  రైల్వేలో 51961  మాస్కులు , 3027 లీటర్ల హాండ్ శానిటైజర్,  మధ్య రైల్వేలో 38904 మాస్కులు, 3015 లీటర్ల హాండ్ శానిటైజర్,  తూర్పు మధ్య రైల్వేలో 33473 మాస్కులు , 4100 లీటర్ల హాండ్ శానిటైజర్లు, పశ్చిమ మధ్య రైల్వేలో 36342 మాస్కులు 3756 లీటర్ల హాండ్ శానిటైజర్ తయారు చేశారు.  

నిత్యావసరాలు మరియు సరుకుల రవాణా 24X7 పద్ధతిలో నిరంతరం సాగుతున్నందున కార్యనిర్వహణ, పర్యవేక్షణ సిబ్బంది రేయింబవళ్ళు పనిచేస్తున్నారు. ఈ సిబ్బంది భద్రతతో పాటు వారి నైతిక బలాన్ని పెంపొందించడానికి అన్ని పనిస్థలాలలో ఈ కింది చర్యలు తీసుకోవడం జరిగింది:  

 (i) విధులకు హాజరయ్యే సిబ్బంది అందరికీ ముఖానికి తొడుక్కునే మాస్కులు, హాండ్ శానిటైజర్లను అందుబాటులో ఉంచుతున్నారు.  కాంట్రాక్ట్ కార్మికులకు కూడా వాటిని ఇస్తున్నారు. రైల్వే వర్క్ షాపులు, కోచింగ్ డిపోలు మరియు ఆసుపత్రులు సమయానికి తగ్గట్టు ఎదిగి బయటి నుంచి వచ్చే సరఫరాలకు తోడుగా స్థానికంగా  శానిటైజర్లను, మాస్కులను ఉత్పత్తి చేస్తున్నాయి. 

 (ii)  సిబ్బంది అందరూ మంచి పరిశుభ్రత పాటించేలా చూసేందుకు పునర్వినియోగ మాస్కుల వాడకాన్ని ప్రోత్సహించడం జరుగుతోంది. ప్రతి ఉద్యోగికి రెండేసి పునర్వినియోగ మాస్కులను ఇస్తున్నారు.  అంతేకాక మాస్కులను ప్రతిరోజూ సబ్బుతో ఉతకాలని కూడా వారికి సలహా ఇస్తున్నారు. ఈ విషయంలో కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ జారీచేసిన సవివరమైన సలహాను సిబ్బంది అందరికి పంపడం  జరిగింది. 

 (iii) అన్ని పనిస్థలాలలో సబ్బు, నీరు, కడుక్కునే వసతి ఏర్పాటు చేయడం జరుగుతోంది. స్థానిక కల్పనలతో చేతులు కడిగేందుకు మిషన్లను ఏర్పాటు చేయడం జరిగింది. 

(iv) భౌతిక దూరం పాటించేలా చూస్తున్నారు.  ఈ విషయమై ట్రాక్ మెన్ మరియు డ్రైవర్లవంటి సిబ్బంది అందరిలో క్రమం తప్పకుండా  జాగృతి కలుగజేస్తూ అమలు జరిగేలా చూస్తున్నారు. 

****



(Release ID: 1612688) Visitor Counter : 214