రైల్వే మంత్రిత్వ శాఖ

సమాజ సేవా బాధ్యత కింద మార్చ్ 28వ తేదీ నుండి ఇప్పటి వరకు 8.5 లక్షల భోజనాలను పేదలకు పంపిణీ చేసిన రైల్వేలు :

5 లక్షలకు పైగా భోజనాలను తయారుచేసిన ఐ.ఆర్.సి.టి.సి. వంటశాలలు;
సుమారు 2 లక్షల భోజనాలను తా స్వంత వనరులనుండి తయారుచేసిన ఆర్.పి.ఎఫ్. ;
1.5 లక్షల భోజనాలను సరఫరా చేసిన స్వచ్చంద సంస్థలు.


వీటిలో ఆర్.పి. ఎఫ్. ఒక్కటే సుమారు 6 లక్షల భోజనాలను పంపిణీ చేయగా, ఇతర రైల్వే మరియు ప్రభుత్వ శాఖలు, స్వచ్చంద సంస్థలు కూడా పంపిణీ ప్రక్రియలో పాల్గొన్నాయి.

Posted On: 09 APR 2020 3:07PM by PIB Hyderabad

కోవిడ్-19 వల్ల ఏర్పడిన లాక్ డౌన్ సమయంలో భారతీయ రైల్వేలు సమాజ సేవా బాధ్యత కింద పేద ప్రజలకు భోజనాలు పంపిణీ చేయడం ప్రారంభించింది. ఐ.ఆర్.సి.టి.సి. వంటశాలలు, ఆర్.పి.ఎఫ్. వనరులు, ప్రభుత్వేతర సంస్థల విరాళాలతో మధ్యాహ్నం భోజనాన్ని పేపర్ ప్లేట్లలోనూ, రాత్రి పూత ఆహార పొట్లాల రూపంలోనూ భోజనాలను అందజేస్తోంది.    పేదలు, బిక్షగాళ్లు, పిల్లలు, కూలీలు, వలస కార్మికులు, చిక్కుకు పోయిన వారితో పాటు, ఆహారం కోసం ఎదురుచూసేవారు, రైల్వే స్టేషన్లకు దగ్గరలో ఉన్నవారురైల్వే స్టేషన్లకు కాస్త దూరంలో ఉన్నవారికి సైతం ఆయారాన్ని పంపిణీ చేస్తున్నారు.  

రైల్వేలు, వాణిజ్యం మరియు పరిశ్రమల శాఖల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ సూచన మేరకు రైల్వేలు తమ పరిధిని విస్తరించి, జిల్లా యంత్రంగంస్వచ్చంద సంస్థలతో సంప్రదించిరైల్వే స్టేషన్లకు చాలా దూరంగా ఉన్న ప్రదేశాల్లో ఉన్న పేద ప్రజలకు కూడా ఆహారంతో పాటు ఇతర సహకారాలను అందింస్తున్నాయి.  

ఆర్.పి.ఎఫ్., జి.ఆర్.పి., వివిధ జోన్లకు చెందిన వాణిజ్య విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థలు ఈ ఆహార పంపిణీ కార్యక్రమంలో సహకరిస్తున్నాయి.  పేద ప్రజలకు ఆహారాన్ని పంపిణీ చేసే సమయంలో పరిశుభ్రతనుసామాజిక దూరాన్ని పాటిస్తున్నారు  రైల్వేలు తమ పరిధిని విస్తరించి, ఐ.ఆర్.సి.టి.సి. సేవలను పెంపొందించడానికి సంబంధిత జోన్లు, డివిజన్లకు చెందిన జి.ఎమ్.లు / డి.ఆర్.ఎమ్. లు ఐ.ఆర్.సి.టి.సి. అధికారులను నిరంతరం సంప్రదిస్తున్నారు.  జిల్లా యంత్రాంగాలు, స్వచ్చంద సంస్థల సహకారంతో రైల్వే స్టేషన్లకు చుట్టుపక్కల ప్రదేశాలతో పాటు, రైల్వే స్టేషన్లకు చాలా దూరంలో ఉన్న పేద ప్రజలకు కూడా ఆహారం పంపిణీ చేయడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.      

భారతీయ రైల్వేలు 2020 మార్చి 28వ తేదీ నుండి ఇప్పటి వరకు 8.5 లక్షల భోజనాలను పేద ప్రజలకు, అన్నార్తులకూ పంపిణీ చేశాయి. ఈ కార్యక్రమం ఉత్తర, పశ్చిమ, తూర్పు, దక్షిణ, దక్షిణ మధ్య రైల్వే జోన్ల పరిధిలో విస్తరించి ఉన్న న్యూఢిల్లీ, బెంగుళూరు, హుబ్లీ, ముంబాయి సెంట్రల్, అహ్మదాబాద్, భుసవాల్, హౌరా, పాట్నా, గయా, రాంచి, కతిహార్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ నగర్, బాలాసోర్, విజయవాడ, ఖుద్రా, కాట్పాడి, తిరుచిరాపల్లి, ధన్ బాద్, గువాహటి, సమస్తిపూర్, ప్రయాగరాజ్, ఇటార్సీ, విశాఖపట్నం, చెంగల్పట్టు, పూణే, హాజీపూర్, రాయపూర్, టాటానాగర్ లలోని ఐ.ఆర్.సి.టి.సి. వంటశాలల క్రియాశీల సహకారంతోనూ, ఆర్.పి.ఎఫ్. తో పాటు ఇతర ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వేతర సంస్థల సహకారంతో కొనసాగుతోంది.  

 ఐ.ఆర్.సి.టి.సి. 6 లక్షల కంటే ఎక్కువగా భోజనాలను, ఆర్.పి.ఎఫ్. సుమారు 2 లక్షల భోజనాలను తమ స్వంత వనరులనుండి సమకూర్చాయి.  రైల్వే సంస్థలతో కలిసి పనిచేస్తున్న ప్రభుత్వేతర సంస్థలు సుమారు 1.5 లక్షల భోజనాలను విరాళంగా అందజేశాయి.  ఐ.ఆర్.సి.టి.సి. మరియు స్వచ్చంధ సంస్థలు తమ స్వంత వంటశాలల నుండి తయారుచేసిన భోజనాలను పేద ప్రజలకు పంపిణీ చేయడంలో రైల్వే రక్షణ దళం ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయి.  ప్రారంభంలో 2020 మార్చి 28వ తేదీన 74 ప్రదేశాలలో 5,419 మంది నిరుపేదలకు భోజనాలు పంపిణీ చేశారు.  2020 ఏప్రిల్ 8వ తేదీ వరకు 313 ప్రాంతాల్లో సుమారు 6 లక్షల మంది పేద ప్రజలకు ఆర్.పి.ఎఫ్. ద్వారా ఆహారం పంపిణీ చేయడం జరిగింది భారతీయ రైల్వేలు ఈ రోజు కూడా దగ్గర దగ్గరగా లక్ష మందికి భోజనాలు పంపిణీ చేస్తున్నాయి

 ప్రధానమంత్రి కెర్స్ నిధికి ఐ.ఆర్.సి.టి.సి. 20 కోట్ల రూపాయలు జమ చేసింది. 2019-20 సంవత్సరానికి చెందిన సి.ఎస్.ఆర్. నిధి నుండి 1.5 కోట్ల రూపాయలు, 2020-21 సంవత్సరానికి చెందిన సి.ఎస్.ఆర్. నిధి నుండి 6.5 కోట్ల రూపాయలు, మిగిలిన 12 కోట్ల రూపాయలు విరాళం కింద సమకూర్చింది.  

 కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టే ఉద్దేశ్యంతో విధించిన లాక్ డౌన్ సమయంలో పేదలకు ఆహారం పంపిణీ చేయడానికి భారతీయ రైల్వేలు పూర్తిగా సంసిద్ధంగా ఉన్నాయి.  ఇందుకు అవసరమైన ఆహార ధాన్యాలతో పాటు ఇతర ముడి సరుకుల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి

 ****



(Release ID: 1612602) Visitor Counter : 175