మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

కేంద్ర మానవాభివృద్ధి శాఖ మంత్రి సలహాపై జెఇఇ(మెయిన్) 2020 దరఖాస్తుల్లో పరీక్షా కేంద్రాలను సరిదిద్దుకునేందుకు అవకాశం కల్పించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ

Posted On: 09 APR 2020 3:56PM by PIB Hyderabad

ప్రస్తుతం కొవిడ్-19 కారణంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా జెఇఇ(మెయిన్)2020 పరీక్షార్థుల శ్రమను దృష్టిలో ఉంచుకుని కేంద్ర మానవాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారి సలహామేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రాలను మార్చుకోవడానికి అనుమతిని  పొడిగించింది.  ఈ మేరకు 01.04.2020న  నేషనల్ టెస్టంగ్ ఏజెన్సీ ప్రచురించిన ప్రకటనలో జెఇఇ(మెయిన్) 2020 ఆన్లైన్ దరఖాస్తుల్లో పరీక్షాకేంద్రాల మార్పు కొరకు తేదీని ప్రకటించింది,   నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ రోజున ఆ తేదీని పొడిగించింది.

పరీక్షాకేంద్రాల సామర్థ్యాన్ని బట్టి  ఇపుడు విద్యార్థి కోరుకున్న పట్టణాన్ని  పరీక్షా కేంద్రంగా మార్పు చేసుకోవడానికి ఎన్టిఏ తన వంతు కృషిని చేస్తుంది. పరిపాలన సౌలభ్య కారణాల దృష్ట్యా పరీక్షార్థి ఎంపిక చేసుకున్న కేంద్రం కాక వేరే ఇతర పరీక్షా కేంద్రాన్ని కూడా కేటాయించే అవకాశం కలదు, ఎన్టిఏ నిర్ణయమే అంతిమ నిర్ణయం.

జెఇఇ(మెయిన్) 2020 ఆన్లైన్ దరఖాస్తులో పరీక్షా కేంద్రాల మార్పుతో సహా ఇతర సవరణలు చేసుకునే సౌకర్యం ఇపుడు https://jeemain.nta.nic  వెబ్సైట్లో కలదు,ఈ సౌకర్యం 14/04/2020* వరకు మాత్రమే. కావున అభ్యర్థులు వెబ్సైట్ను సందర్శించి అవసరమైన చోట వారి వారి వివరాలను మార్పు చేసుకొనవలసింది.

 ‘*’ ఆన్లైన్ దరఖాస్తుల్లో అభ్యర్థుల యొక్క మార్పులు చేర్పులు 05.00పిఎం వరకు మాత్రమే అంగీకరించబడతాయి మరియు దరఖాస్తు ఫీజు సమర్పణ రాత్రి 11.50పిఎం వరకు మాత్రమే అంగీకరింపబడుతుంది.

దరఖాస్తుకు అదనపు ఫీజు(అవసరమైనచో)ను క్రెడిట్/డెబిట్ కార్డు/నెట్ బ్యాంకింగ్/యుపిఐ మరియు పేటీఎం ద్వారా చెల్లించవచ్చు.

దరఖాస్తులో చేసిన మార్పుల ఆధారంగా అదనపు ఫీజు గురించిన వివరాలు ఫీజు చెల్లింపు అనంతరం తెలియజేయబడుతుంది. అభ్యర్థులు దరఖాస్తులో మార్పులు చేయు సమయంలో జాగ్రత్తగా మార్పులు చేయవలసింది. తదుపరి అవకాశం కల్పించబడదు.

  అభ్యర్థులు మరియు వారి తల్లిదండ్రులు తాజా సమాచారం కోసం  jeemain.nta.nic.in  మరియు www.nta.ac.in వెబ్సైట్లను తరచూ సందర్శించండి. వివిధ వివరాల వివరణ కోసం అభ్యర్థులు 8287471852,8178359845,9650173668,9599676953,8882356803    నెంబర్లకు ఫోన్ చేయవచ్చు.



(Release ID: 1612577) Visitor Counter : 160