శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 రోగుల చికిత్స కోసం గాలిలో ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరచడానికి పరికరాన్ని అభివృద్ధి చేసిన డిఎస్టీ ఆర్థిక సాయం పొందిన సంస్థ
"అద్భుతమైన ప్రయోజనాలు గల ఆవిష్కారణ ఇది" డిఎస్టి కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ
Posted On:
09 APR 2020 10:43AM by PIB Hyderabad
పూణేలోని సిఎస్ఐఆర్-నేషనల్ కెమికల్ లాబొరేటరీ నుండి లైసెన్స్ పొందిన సొంత సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా స్పిన్-ఆఫ్ సంస్థ అయిన జెన్రిచ్ మెంబ్రేన్స్, చికిత్స కోసం అభివృద్ధి చేసిన మెమ్బ్రేన్ ఆక్సిజనేటర్ పరికరాలను (ఎంఓఈ) సామర్థ్యం పెంచడానికి శాస్త్ర సాంకేతిక విభాగం (డిఎస్టీ) నిధులు సమకూరుస్తోంది. కోవిడ్-19 రోగుల కోసం వినూత్న, స్వదేశీ ఫైబర్ పొర సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా, ఎంఓఈ పరికరం 35% వరకు ఒత్తిడితో గాలిలో ఆక్సిజన్‌ను పెంపొందింప చేస్తుంది (4-7 బార్, చమురు రహిత కంప్రెషర్‌ను ఉపయోగించి).
ఈ పరికరాలలో పల్చటి పొరతో కూడిన మెమ్బ్రేన్ కార్ట్రిడ్జ్, చమురు అవసరం లేని కంప్రెసర్, అవుట్‌పుట్ ఫ్లోమీటర్, హ్యూమిడిఫైయర్ బాటిల్, గొట్టాలు, అమరికలు ఉంటాయి. కంప్రెసర్ నుండి సంపీడన, ఫిల్టర్ చేసిన గాలిని మెమ్బ్రేన్ కార్ట్రిడ్జ్ లోకి పంపిస్తారు. ఇది నత్రజనిపై ఆక్సిజన్‌ను సంగ్రహించి ఆక్సిజన్-సుసంపన్నమైన గాలిని పరిసరాల పీడనం వద్ద ఉత్పత్తి చేస్తుంది. ఆక్సిజన్, నత్రజనిని వేరు చేయగల మెమ్బ్రేన్ కార్ట్రిడ్జ్ లు, బ్యాక్టీరియా, కణజాల పదార్థాల మార్గాన్ని పరిమితం చేస్తుంది. ఇలా ఉత్పత్తి అయిన గాలికి వైద్య గుణాలుంటాయి.
ఈ పరికరం సురక్షితం, దీని ఆపరేషన్ కోసం శిక్షణ పొందిన వ్యక్తులు అవసరం లేదు, కనీస నిర్వహణ మాత్రం దీనికి అవసరం. సులభంగా తోడ్కొని పోగలిగి ఎప్పుడైనా ఎక్కడైనా ప్లగ్-అండ్-ప్లే సౌకర్యంతో వినియోగించవచ్చు. శీఘ్ర గతిన ప్రారంభం అయి ఆక్సిజన్-సమృద్ధిగా గల గాలిని అందిస్తుంది.
"మెడికల్ గ్రేడ్ గలిగి ఆక్సిజన్-సుసంపన్నమైన గాలి కోవిడ్-19 వంటి పరిస్థితులతో రోగి సంరక్షణకు అవసరమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనుభవం చుస్తే 14% ఇన్ఫెక్షన్లకు కొన్ని శ్వాసకోశ పద్ధతులు అవసరం అవుతాయి. అయితే 4% మందికి మాత్రమే ఐసియు ఆధారిత వెంటిలేటర్లు అవసరం. మిగిలినవి వారికి, దీర్ఘకాలిక శ్వాస సమస్యలతో కూడిన అనేక ఇతర పరిస్థితులలో, ఈ ఆవిష్కరణ అద్భుతమైన ప్రయోజనాలు కలిగిస్తుంది" అని డిఎస్టి కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ అన్నారు.
కోవిడ్-19 కి సంబంధించిన సంక్లిష్ట లక్షణాలలో ఒకటి ఉపిరిసల్పడంలో విపరీతమైన సమస్య. అటువంటి అత్యవసర పరిస్థితుల మధ్య ఐసీయూ నుండి బయటకు వచ్చిన రోగికి చికిత్స నిమిత్తం ఈ పరికరాన్ని వినియోగించవచ్చు. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సిఓపిడి), ఉబ్బసం, ఇంటర్‌స్టీషియల్ ఊపిరితిత్తుల వ్యాధి (ఐఎల్‌డి), నెలలు గడవకుండానే పుట్టిన పిల్లలు, పాము కాటు, వంటి దీర్ఘకాలిక శ్వాస సమస్యలతో బాధపడుతున్న రోగులకు కూడా ఈ పరికరం సహాయపడుతుంది.
తగు పరీక్షలు జరిగి ఉత్పత్తికి రాబోతోంది అంకుర సంస్థ జెన్రిచ్ రూపొందించిన ఈ పరికరం. మూడు నెలల్లో భారీగా మెమ్బ్రేన్ ఆక్సిజనేటర్ పరికరాలను సిద్ధం చేయగలిగేలా కృషి జరుగుతోంది.
(ఇంకా వివరాల కోసం సంప్రదించండి : డాక్టర్ రాజేంద్ర కే. ఖారుల్ rk.kharul@genrichmembranes.com మొబైల్ : 8308822216)
(Release ID: 1612559)
Visitor Counter : 140
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada