ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 పై తాజా వివరాలు
Posted On:
08 APR 2020 6:27PM by PIB Hyderabad
దేశంలో కోవిడ్-19 నివారణ, నియంత్రణ మరియు నిర్వహణ కోసం భారత ప్రభుత్వం వివిధ రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలతో కలిసి అనేక చర్యలు చేపట్టింది. వీటిని క్రమం తప్పకుండా ఉన్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.
రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలన్నీ ఒకే రకమైన సమర్ధవంతమైన లాక్ డౌన్ చర్యలు అమలుచేయాలనే విషయంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. కోవిడ్-19 వ్యాప్తిని విజయవంతంగా అరికట్టడానికి సామాజిక దూరం పాటించడం ఒక్కటే అత్యుత్తమమైన మార్గం.
వైరస్ వ్యాప్తిని విచ్చిన్నం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ అనేక చర్యలు తీసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కేసుల సంఖ్యను బట్టి మరిన్ని చర్యలు తీసుకోవడం జరుగుతోంది. దేశవ్యాప్తంగా సమృద్ధిగా కోవిడ్-19 సంరక్షణ కేంద్రాలను ఏర్పాటుచేయాలని అన్ని రాష్ట్రాలను కోరడం జరిగింది.
అనేక జిల్లాలు ఈ విషయంలో విశేషమైన కృషి చేసి ఉత్తమమైన సేవలు అందిస్తున్నాయి. అందులో కొన్ని వివరాలు :
· పూణే జిల్లాలో పూణే మరియు కాంధ్వా కు చెందిన మధ్య ప్రాంతాన్ని పూర్తిగా మూసివేసి, 35 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉన్న ప్రతి ఇంటికీ వెళ్లి సర్వే చేయడం జరిగింది. ప్రయాణాలు చేసిన వారితో పాటు, మధుమేహం, బి.పి. వంటి రోగాలు ఉన్న వ్యక్తులను పరీక్షిస్తున్నారు.
· పథనంతిట్ట జిల్లాలో నూడా నిఘా కట్టుదిట్టం చేశారు. ప్రయాణాలు చేసినవారి వివరాలు సేకరించి, వారిని గుర్తించి వారిని క్వారంటైన్ లో ఉంచుతున్నారు. వారికి అవసరమైన వస్తువులను సమకూర్చి, మానసిక ప్రోత్సాహాన్నిస్తున్నారు.
కోవిడ్-19 మహమ్మారిని సమర్ధవంతంగా ఎదుర్కోడానికి వీలుగా ముందు వరుసలో పనిచేసే సిబ్బంది సామర్ధ్యం పెంపొందించాలనే ఉద్దేశ్యంతో భారత ప్రభుత్వం "ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ఆన్ లైన్ ట్రైనింగ్" (ఐ-జి.ఓ.టి.) పేరుతో దీక్ష వేదిక పై నుండి కోవిడ్-19 యాజమాన్య శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించింది. శిక్షణ తీసుకునే వారిలో వైద్యులు, నర్సులు, పారామెడిక్స్, సాంకేతిక నిపుణులు, ఏ.ఎన్.ఎమ్.లు , రాస్గ్త్ర ప్రభుత్వ అధికారులు, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్.సి.సి.), నేషనల్ సర్వీస్ స్కీం (ఎన్.ఎస్.ఎస్.), భారత రెడ్ క్రాస్ సంస్థ (ఐ.ఆర్.సి.ఎస్.) తో పాటు ఇతర స్వచ్చంద కార్యకర్తలు ఉంటారు.
ఈ పోర్టల్ వెబ్ సైట్ : https://igot.gov.in/igot/ ద్వారా వివరాలు పొందవచ్చు.
కోవిడ్-19 నిర్వహణ గురించి వివిధ విభాగాలకు చెందిన ఆరోగ్య రక్షణ నిపుణులకు సామర్ధ్య నిర్మాణ పెంపు కోసం, న్యూ ఢిల్లీ లోని ఏ.ఐ.ఐ.ఎం.ఎస్., అనేక వెబ్ ఆధారిత కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కోవిడ్-19 సోకినట్లు అనుమానించబడిన లేదా ధృవీకరించబడిన గర్భిణీలకు ప్రసవ సమయంలోనూ, ప్రసవం అనంతరం అవసరమైన ఆరోగ్య రక్షణ పై ఫిజిషియన్లకు ఈ వారంలో ఏ.ఐ.ఐ.ఎం.ఎస్., ఆన్ లైన్ లో శిక్షణ ఇవ్వనుంది.
ఈ శిక్షణకు సంబందించిన షెడ్యూల్ వివరాలు ఎమ్.ఓ.హెచ్.ఎఫ్.డబ్ల్యూ. వెబ్ సైట్ : - www.mohfw.gov.in నుండి పొందవచ్చు.
ఇంతవరకు, 5,194 కేసులను ధృవీకరించారు. 149 మరణాలు నమోదయ్యాయి. 402 మంది చికిత్స అనంతరం కోలుకుని ఆసుపత్రుల నుండి విడుదల అయ్యారు.
కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలు, మార్గదర్శకాలు, సలహాలు, సూచనలపై ప్రామాణికమైన, తాజా సమాచారం కోసం ఈ వెబ్ సైట్ ను క్రమం తప్పకుండా సందర్శించండి :
: https://www.mohfw.gov.in/.
కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలకు పరిష్కారాలను దిగువ పేర్కొన్న ఈ మెయిల్ ను సంప్రదించడం ద్వారా తెలుసుకోవచ్చు :
technicalquery.covid19[at]gov[dot]in
ఇతర సందేహాలు, అనుమానాలకు పరిష్కారాలను దిగువ పేర్కొన్న ఈ మెయిల్ ను సంప్రదించడం ద్వారా తెలుసుకోవచ్చు :
ncov2019[at]gov[dot]in .
కోవిడ్-19 పై ఎటువంటి అనుమానాలు, సమస్యలు, సమాచారానికైనా, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఉచిత హెల్ప్ లైన్ నెంబర్ : +91-11-23978046 లేదా 1075 ను సంప్రదించవచ్చు.
వివిధ రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల కు చెందిన కోవిడ్-19 హెల్ప్ లైన్ నెంబర్ల జాబితా మరియు ఇతర సమాచారం కోసం ఈ వెబ్ సైట్ ని చూడండి :
https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .
*****
(Release ID: 1612362)
Visitor Counter : 228
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam