సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

సిబ్బంది, ప్రజా పిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ తరఫున

కోవిడ్-19 కు వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యలపై జరిగిన సమీక్షా సమావేశానికి
అధ్యక్షత వహించిన ఎం.ఓ.స్. (పి.పి.) డాక్టర్ జితేంద్ర సింగ్.

ప్రధానమంత్రి కెర్స్ నిధికి విరాళాలిచ్చిన శాఖలను అభినందించిన డాక్టర్ సింగ్.

Posted On: 07 APR 2020 3:52PM by PIB Hyderabad

ఈశాన్య ప్రాంత అభివృద్ధి (డి.ఓ.ఎన్.ఈ.ఆర్.); ఎమ్.ఓ.ఎస్.పి.ఎమ్.ఓ.; సిబ్బంది, ప్రజా పిర్యాదులు, పింఛన్లు, అణుఇంధనం మరియు అంతరిక్ష శాఖల కేంద్ర మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్) డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డి.ఓ.పి.టి.; డి.ఏ.ఆర్.పి.జి.; డి.ఓ.పి.పి.డబ్ల్యూ శాఖల పనితీరుపై సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు 

 

 

ముందుగా కేంద్ర మంత్రి, లాక్ డౌన్ సమయంలో డి.ఓ.పి.టి. తీసుకున్న చర్యలు / కార్యక్రమాలపైనా, లాక్ డౌన్ సడలించిన అనంతరం సాధారణ స్థితి తీసుకురావడానికి సంసిద్ధత పైనా సమీక్షించారు. గృహ కళ్యాణ్ కేంద్రాలు ఫేస్ మాస్కులు తయారుచేసే పనిలో ఉన్నాయిడి.ఓ.పి.టి. లోని ప్రతి విభాగం ఇంటి దగ్గర నుండి పని చేసి పూర్తి చేయడానికి వీలుగా ప్రాధాన్యతా క్రమంలో చేపట్టవలసిన పనులను గుర్తించారు. ఈ పనుల పురోగతిని ఏ.ఎస్. / జే.ఎస్. లు నిశితంగా పర్యవేక్షిస్తారు. కోవిడ్-19 విషయాలపై ప్రభుత్వ పరంగానూ, ప్రభుత్వేతర పరంగానూ కార్మికులకు శిక్షణ ఇచ్చే ఏకీకృత ప్రభుత్వ ఆన్-లైన్ శిక్షణ (ఐ.జి.ఓ.టి.) కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది

 

 

డి.ఏ.ఆర్.పి.జి. వ్యవహారంపై మంత్రి స్పందిస్తూ, కోవిడ్-19 ఫిర్యాదులపై https://darpg.gov.in ) అనే ఒక  జాతీయ పర్యవేక్షణ వ్యవస్థను 2020 ఏప్రిల్ 1వ తేదీన  ప్రారంభించినట్లు మంత్రి తెలియజేసారు. 2020 ఏప్రిల్ 6వ తేదీ వరకు ఈ పోర్టల్ కు 10,659 ప్రజా పిర్యాదులు అందాయని మంత్రి చెప్పారు.  ఈ పోర్టల్ కు దాఖలవుతున్న రోజువారీ ఫిర్యాదులు పెరుగుతున్నాయి. 2020 ఏప్రిల్ 1వ తేదీన 333 పిర్యాదులు దాఖలుకాగా, 2020 ఏప్రిల్ 6వ తేదీన 2,343 ఫిర్యాదులు దాఖలయ్యాయి.   కోవిడ్-19 కు చెందిన ప్రజా ఫిర్యాదుల కేసులను ప్రాధాన్యతా ప్రాతిపదికన మూడు రోజుల వ్యవధిలో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని డి.ఏ.ఆర్.పి.జి. అన్ని మంత్రిత్వ శాఖలకు  / విభాగాలకు మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు జారీచేసింది.  వలస కార్మికులకు, నిత్యావసర వస్తువులకు సంబంధించిన ప్రజా ఫిర్యాదులను అత్యంత ప్రాధాన్యంతో పరిష్కరించాలి.  వలస కార్మికులకు అవసరమైన ఆహారం సరఫరాకు సంబంధించిన సమస్య గురించి మీడియా ట్వీట్లు, టెలివిజన్ ఛానెళ్లలో చూసి డి.ఏ.ఆర్.పి.జి. తనకు తానుగా స్వచ్చందంగా స్పందించింది.  ప్రతీ రోజూ స్వీకరించే ఫిర్యాదులు, వాటి పరిష్కారాలు, పిర్యాదులు ఎక్కడ నుండి వచ్చాయి వంటి వివరాలను ఆ ఫిర్యాదుల కేటగిరీ వారీగా రోజువారీ నివేదికలను  డి.ఏ.ఆర్.పి.జి. రూపొందించి మంత్రుల సాధికార బృందానికి  సమర్పిస్తుంది. ప్రజా పిర్యాదులు, సలహాలపై 10 మంది అధికారులతో సాధికార బృందం,  నిత్యావసర వస్తువులపై 5 మంది అధికారులతో సాధికార బృందం, వలస కూలీల పై 7 గురు అధికారులతో సాధికార బృందం సంబంధిత ఫిర్యాదులను పరిష్కరిస్తాయి. 

 

 

పింఛన్ల శాఖ పనితీరు గురించి డాక్టర్ సింగ్ మాట్లాడుతూ, అధికారులందరూ వి.పి.ఎన్. కనెక్షన్ ద్వారా పనిచేయడంతో మొత్తం శాఖ నూరు శాతం ఈ-ఆఫీస్ పై పనిచేస్తోందని చెప్పారు. డిపార్టుమెంటు కు సంబంధించిన అంతర్ మంత్రిత్వ శాఖ ఫైళ్ల కదలికలు కూడా  ఈ-ఆఫీస్ ద్వారానే జరుగుతున్నాయని ఆయన తెలిపారు.  కోవిడ్-19 మహమ్మారికి సంబంధించి పెన్షనర్లు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వారికి సుమారు నాలుగు లక్షల ఎస్.ఎమ్.ఎస్. లు  పంపడం జరిగింది.  అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ, వృద్దాప్య వైద్య విద్యా శాఖ కు చెందిన సీనియర్ వైద్యునితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భారతదేశంలోని వివిధ నగరాలలోని వంద మంది పెన్షనర్లకు 2020 ఏప్రిల్ 9వ తేదీన ఈ శాఖ ఒక టెలీ-కన్సల్టేషన్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది.  అదేవిధంగా, 2020 ఏప్రిల్ 13వ తేదీన పెన్షనర్ల కోసం యోగ మరియు ఫిట్ నెస్ పై మరొక వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతదేశం లోని 24-25 నగరాల నుంచి పెన్షనర్లు పాల్గొనే అవకాశం ఉంది.  సీనియర్ సిటిజన్లలో రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది. అందువల్ల, వారిలో భౌతిక, మానసిక ఆరోగ్యం పెంపొందించడం కోసం లాక్ డౌన్ సడలించిన అనంతరం ఈ కార్యక్రమాలను తిరిగి ఏర్పటు చేయడం జరుగుతుంది.   ఈ రకంగా వీరికి సహాయ సహకారాలందించడం కోసం ప్రత్యేకంగా చేయూత నందిచడం జరుగుతుంది.

 

 

డి.ఓ.పి.టి.; డి.ఏ.ఆర్.పి.జి.; మరియు డి.ఓ.పి.పి.డబ్ల్యూ. కు చెందిన అధికారులందరూ, కోవిడ్-19 సహాయ కార్యక్రమాల కోసం, తమ ఒక రోజు జీతాన్ని ప్రధానమంత్రి కేర్స్ నిధికి విరాళంగా అందజేశారు.   సివిల్ సర్వీసెస్ అధికారుల సంస్థ (సి.ఎస్.ఓ.ఐ.) కూడా ప్రధానమంత్రి కేర్స్ నిధి కి 25 లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు. 

 

***********



(Release ID: 1612056) Visitor Counter : 214