మంత్రిమండలి

కోవిడ్‌-19 నేపథ్యంలో రెండేళ్లపాటు (2020-21, 2021-22) ఎంపీలాడ్స్‌ అమలు నిలిపివేతకు కేంద్ర మంత్రిమండలి నిర్ణయం

Posted On: 06 APR 2020 5:23PM by PIB Hyderabad

కోవిడ్‌-19 వ్యాప్తి నిరోధక చర్యలను కొనసాగించడంలో భాగంగా పార్లమెంటు సభ్యులు స్థానిక ప్రాదేశిక అభివృద్ధి పథకాన్ని (MPLADS) రెండేళ్లపాటు నిలిపివేయాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ సమావేశమైన మంత్రిమండలి నిర్ణయించింది. ఈ మేరకు దేశంలో కోవిడ్‌-19 ప్రతికూల ప్రభావం, సవాళ్ల పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టే చర్యల కోసం 2020-21 నుంచి 2021-22 కాలానికి సంబంధించి ఈ పథకం నిధులను వినియోగిస్తారు.

*****(Release ID: 1611696) Visitor Counter : 162