PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం
• తాజా వివరాల మేరకు దేశంలో కోవిడ్‌-19 కేసులు 3,374 కాగా- 79 మరణాలు నమోదయ్యాయి.
• మందులు, వైద్యపరికరాలు తయారుచేసే ఔషధరంగ పరిశ్రమలు సజావుగా నడిచేలా చూడాలని కేంద్ర మంత్రిమండలి కార్యదర్శి అన్ని జిల్లాల కలెక్టర్లనూ ఆదేశించారు.
• కోవిడ్‌-19పై సమర్థ పోరుకు దృఢ సంకల్పం పూనిన ప్రధానమంత్రి-అమెరికా అధ్యక్షుడు.
• విద్యాబోధన కార్యక్రమాల కోసం విశ్వవిద్యాలయాలు ఆన్‌లైన్‌ డిజిటల్‌ మాధ్యమాలను వినియోగించుకోవాలని హెచ్‌ఆర్‌డి మంత్రి ఆదేశించారు.
• కేంద్ర ఆర్థికశాఖ, దాని పరిధిలోని సంస్థలు/బ్యాంకుల సిబ్బంది ‘పీఎం కేర్స్‌’ నిధికి రూ.430 కోట్లకు పైగా విరాళం ఇచ్చారు.

Posted On: 05 APR 2020 7:09PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

 

 

కోవిడ్‌-19పై ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నుంచి తాజా సమాచారం

దేశంలో కోవిడ్‌-19పై ఇప్పటిదాకా అందిన సమాచారం ప్రకారం- నిర్ధారిత కేసుల సంఖ్య 3,374 కాగా- 79 మరణాలు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడి కోలుకున్న/పూర్తిగా నయమైన 267 మంది ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లారు. కాగా, దేశవ్యాప్తంగా 274 జిల్లాలు కోవిడ్‌-19 వ్యాధిబారిన పడ్డాయి. మందులు, వైద్యపరికరాలు తయారుచేసే ఔషధరంగ సంస్థలు సజావుగా నడిచేలా చూడాలని కేంద్ర మంత్రిమండలి కార్యదర్శి ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లనూ ఆదేశించారు. https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611483

ప్రధానమంత్రి - అమెరికా అధ్యక్షుడి మధ్య టెలిఫోన్‌ సంభాషణ

ప్రపంచం కోవిడ్‌-19 సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నవేళ రెండు దేశాల మధ్యగల ప్రత్యేక బంధాన్ని ప్రస్తావిస్తూ- ఈ సవాలును సమష్టిగా అధిగమించడంలో అమెరికాతో కలసి నడుస్తామని ప్రధానమంత్రి సంఘీభావం ప్రకటించారు. ఈ మేరకు కోవిడ్‌-19పై సమర్థ పోరాటంలో భారత-అమెరికాల భాగస్వామ్యానికిగల సంపూర్ణ శక్తిని దృఢ సంకల్పంతో మోహరించేందుకు దేశాధినేతలిద్దరూ అంగీకరించారు. https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611242

ప్రధానమంత్రి – బ్రెజిల్‌ అధ్యక్షుడి మధ్య టెలిఫోన్‌ సంభాషణ

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ బ్రెజిల్‌ అధ్యక్షుడు మాననీయ జైర్‌ మెస్సయ్యా బొల్సొనారోతో ఫోన్‌లో సంభాషించారు. ప్రపంచ మహమ్మారి కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులపై ఈ సందర్భంగా వారిద్దరూ చర్చించారు.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611230

 

భారత – స్పెయిన్‌ ప్రధానమంత్రుల మధ్య టెలిఫోన్‌ సంభాషణ

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ స్పెయిన్‌ ప్రభుత్వ అధ్యక్షుడు (ప్రధానమంత్రితో సమానం) మాననీయ పెడ్రో శాంచెజ్‌ పెరెజ్‌-కాస్టిజెన్‌తో ఫోన్‌లో సంభాషించారు. కోవిడ్‌-19 మహమ్మారి ప్రపంచానికి సవాలు విసిరిన నేపథ్యంలో ప్రస్తుత స్థితిగతులపై వారు చర్చించారు.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611241

జీవనరేఖ ‘ఉడాన్‌’ విమానాలద్వారా దేశవ్యాప్తంగా 161 టన్నులమేర వస్తు రవాణా

జీవనరేఖ ‘ఉడాన్‌’ కింద మొత్తం 116 విమానాలు ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 161 టన్నుల మేర వస్తు రవాణా చేశాయి. మరోవైపు రెండు దేశాలకూ కీలక ఔషధ సరఫరాల కోసం పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ-ఎయిరిండియా సంస్థ భారత-చైనాల మధ్య గగన రవాణా వారధి ఏర్పాటు చేసుకున్నాయి. https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611383

కేంద్ర ఆర్థికశాఖసహా ప్రభుత్వరంగ బ్యాంకులు/సంస్థలు, ఆర్థిక సహాయ సంస్థల అధికారులు, సిబ్బందిద్వారా ‘పీఎం కేర్స్‌’ నిధికి రూ.430 కోట్లకుపైగా విరాళం.

ఈ విరాళంలో జీతాల నుంచి రూ.228.84 కోట్లు, కార్పొరేట్‌ సామాజిక బాధ్యతకింద రూ.201.79 కోట్ల వంతున ‘పీఎం కేర్స్‌’ నిధికి అందుతుంది.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611417

దేశంలో లైట్ల ఆర్పివేత నేపథ్యంలో పవర్‌గ్రిడ్‌ కార్యకలాపాలపై ప్రశ్నలు-జవాబులు

వివరాల కోసం https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611420 చూడండి.

కోవిడ్‌-19పై పోరాటం కోసం మానవ వనరుల అభివృద్ధి శాఖ పరిధిలోని సంస్థలు/స్వీయప్రతిపత్తిగల విభాగాలు/సంస్థల నుంచి ‘పీఎం కేర్స్‌’ నిధికి రూ.38.91 కోట్ల విరాళం

కోవిడ్‌-19పై పోరులో భాగంగా మానవ వనరుల అభివృద్ధిశాఖ పరిధిలోని 28 సంస్థలు/ స్వీయప్రతిపత్తి విభాగాలు/సంస్థల ద్వారా ‘పీఎం కేర్స్‌’ నిధికి రూ.38.91 కోట్ల మేర విరాళం అందింది. https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611415

వైద్యేతర సిబ్బంది కోసం శిక్షణ పత్రం రూపొందించిన నావికాదళ దక్షిణ విభాగం

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611220

కేంద్రీయ విశ్వవిద్యాలయాల ఉప కులపతులతో హెచ్‌ఆర్‌డి మంత్రి సమావేశం

స్వయం (SWAYAM), స్వయంప్రభ (SWAYAM PRABHA) మాధ్యమాలను నిర్దిష్ట ఫలితాల సాధనోపకరణాలుగా వాడుకునేలా బోధకులను, విద్యార్థులను ప్రోత్సహించాలని హెచ్ఆర్‌డి మంత్రి ఉప కులపతులందర్నీ ఆదేశించారు. అంతేకాకుండా ఇతర డిజిటల్‌ మాధ్యమాలద్వారా విద్యాబోధన కొనసాగించాలని సూచించారు. ఆన్‌లైన్ విద్య - ఆన్‌లైన్ ప‌రీక్ష‌లపై సూచ‌న‌లిచ్చేందుకు ‘ఇగ్నో’ ఉప కుల‌ప‌తి  ప్రొఫెసర్ నాగేశ్వరరావు అధ్యక్షతన క‌మిటీ ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611240

ఝజ్జర్‌లోని ఎయిమ్స్‌ ఆస్పత్రిని సందర్శించిన డాక్టర్ హర్షవర్ధన్‌; కోవిడ్‌-19పై పోరు సంసిద్ధతపై పరిశీలన

ఝజ్జర్‌లోని ‘ఎయిమ్స్‌’ కోవిడ్‌-19 పీడితులకు చికిత్సనందించే ప్రత్యేక ఆస్పత్రిగా పనిచేస్తుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి ప్రకటించారు. ఇక్కడి 300 ఏకాంత చికిత్స పడకలుంటాయని, తద్వారా రోగులకు అత్యాధునిక వైద్యసహాయం లభిస్తుందని పేర్కొన్నారు.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611459

ఈశాన్య భారత ప్రాంతానికి రవాణి విమానాలతో నిత్యావసరాలు, వైద్య పరికరాలు, ఇతర సామగ్రి నిరంతర సరఫరా: డాక్టర్‌ జితేంద్ర సింగ్‌

ఈశాన్య భారత ప్రాంతాలకు ప్రాధాన్యం ప్రాతిపదిన రవాణా విమానాలద్వారా నిత్యావసరాల నిరంతర సరఫరా చేయాలని దేశంలో దిగ్బంధం విధించిన వెంటనే ప్రభుత్వం నిర్ణయించినట్లు డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ తెలిపారు. అలాగే కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌, ఇతర ద్వీప ప్రాదేశికాలుసహా సుదూర ప్రాంతాలకూ సరఫరాలు సాగుతున్నాయని చెప్పారు.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611409

‘పీఎం కేర్స్‌’ సహాయ నిధికి సీఎస్‌ఓఐ రూ.25 లక్షల విరాళం

వివరాలకు https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611181 చూడండి.

కోవిడ్‌-19 సంబంధిత స్పందనాత్మక కార్యాచరణ కోసం ప్రైవేటురంగం, స్వచ్ఛంద-అంతర్జాతీయ సంస్థలతో సమన్వయం కోసం ‘సాధికార బృందం-6’ ఏర్పాటు

ఈ మేరకు ఈజీ6 మార్చి 30-ఏప్రిల్‌ 3 తేదీల మధ్య పారిశ్రామిక సంఘాలు, ఐవోలు, సీఎస్‌వోలతో ఆరు సమావేశాలు నిర్వహించింది. రాబోయే వారాల్లో స్పందనాత్మక చర్యలకు వారివంతు తోడ్పాటు, ప్రణాళికలు, వారికి ఎదురవుతున్న సమస్యలు, ప్రభుత్వం నుంచి వారు ఆశిస్తున్న చేయూత తదితరాలపై లోతుగా చర్చించింది.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611334

 

కోవిడ్‌-19పై పోరులో రక్షణశాఖ పరిధిలోని ప్రభుత్వరంగ సంస్థలు, ఓఎఫ్‌బి ప్రవేశం

కోవిడ్‌-19పై జాతీయ యుద్ధంలో భాగంగా రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని ప్రభుత్వరంగ సంస్థలు, ఆయుధ ఫ్యాక్టరీ బోర్డు (OFB)ల రంగ ప్రవేశం

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611335

కోవిడ్‌-19 దిగ్బంధం నేపథ్యంలో ఆహార తయారీ పరిశ్రమల ప్రతినిధులతో ఆహార తయారీ పరిశ్రమల శాఖ మంత్రి రెండోసారి దృశ్య-శ్రవణ మాధ్యమ సమావేశం

ఈ పరిశ్రమలు ఎదుర్కొంటున్న సూక్ష్మ సమస్యలపై ప్రత్యేక ఫిర్యాదుల విభాగం ఏర్పాటు; ఆహారం, ఔషధాల లభ్యత దిశగా సరఫరా శృంఖలం, రవాణా సదుపాయాల నిర్వహణకు వీలు కల్పిస్తూ 50 శాతందాకా సమస్యల పరిష్కారం.. మిగిలినవాటిపై త్వరలో నిర్ణయం.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611343

కోవిడ్‌-19పై పోరాటంలో ఎంస్‌ఎంఈ సాంకేతిక విజ్ఞాన కేంద్రాలనుంచి భారీ చేయూత

కోవిడ్‌-19పై పోరులో సూక్ష్మ-చిన్న-మధ్యతరహా పరిశ్రమల (MSME) మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తున్న 18 సాంకేతిక విజ్ఞాన కేంద్రాలు, స్వయంప్రతిపత్తిగల సంస్థలు కూడా తమవంతు తోడ్పాటునందిస్తున్నాయి. https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611332

కోవిడ్‌-19 దిగ్బంధం నేపథ్యంలో సామాన్యులకు చక్కెర, ఉప్పు, వంటనూనెల కొరత లేకుండా పూర్తిస్థాయిలో సరఫరాలు అందిస్తున్న భారత రైల్వేశాఖ

దేశంలోని వివిధ ప్రాంతాలకు 2020 మార్చి 23నుంచి ఏప్రిల్‌ 4వరకూ 1,342 వ్యాగన్ల చక్కెర, 958 వ్యాగన్ల ఉప్పు, 378 వ్యాగన్ల/ట్యాంకర్ల వంటనూనెలను రైల్వేశాఖ రవాణా చేసింది.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611342

భవిష్యనిధి చందాదారులు  రికార్డులలో తమ పుట్టిన తేదీ సవరణకు వీలు కల్పిస్తూ ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) తాను జారీచేసిన ఆదేశాలను నవీకరించింది. https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611379

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

ఈశాన్య ప్రాంతం

1. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని పాసీఘాట్‌లో కోవిడ్-19 పీడితుల కోసం ప్రత్యేకంగా 50 పడకల ఆస్పత్రి.

2. గువహటిలో కోవిడ్‌ నిర్ధారిత రోగితో స్పర్శా సంబంధంగల 105 మందినుంచి నమూనాల సేకరణ.

3. మణిపూర్‌లో కోవిడ్‌-19 అత్యవసర చికిత్సకు ఉద్దేశించిన అన్ని ప్రధాన ఆస్పత్రులలో సాధారణ వైద్య ప్రక్రియల నిలిపివేత.

4. ఈ రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాలపాటు లైట్ల ఆర్పివేత నేపథ్యంలో పరిస్థితులను చక్కదిద్దడానికి తగిన ఏర్పాట్లు చేశామని భరోసా ఇచ్చిన మేఘాలయ విద్యుత్‌ కార్పొరేషన్‌.

5. మిజోరంలో కోవిడ్‌-19పై పోరాటంలో భాగంగా ఇప్పటివరకూ రూ.4.28 కోట్లు వెచ్చించినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ-పునరావాస విభాగం ప్రకటన.

6. నాగాలాండ్‌లో కోవిడ్‌-19 చికిత్సకు ప్రస్తుతం కోహిమా, మకాక్‌చుంగ్‌, దిమాపూర్‌లలో మాత్రమే ఆస్పత్రులుండగా, త్వరలో అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వ ప్రకటన.

7. సిక్కింలోని సరిహద్దు పట్టణం రంగ్‌పోవద్ద ప్రజలు నిబంధనలను పాటించకపోవడంతో వారాంతపు సంతను ఇవాళ కొన్ని గంటలపాటు మూసివేశారు.

8. త్రిపుర ప్రజలు తమ బాల్కనీలో లేదా ప్రవేశద్వారాల వద్ద ఈ రాత్రి 9 గంటలకు దీపం లేదా టార్చిని వెలిగించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

దక్షిణ భారతం

కేరళ

   కోవిడ్‌ను సమర్థంగా నియంత్రించినందుకుగాను రాష్ట్రంలోని పథనంతిట్ట జిల్లా యంత్రాంగం, ఆరోగ్య శాఖను కేంద్ర మంత్రిమండలి కార్యదర్శి అభినందించారు.

   కేరళ-కర్ణాటక సరిహద్దును మూసివేసిన నేపథ్యంలో ఇవాళ కాసరగోడ్‌లో ఒక రోగి మరణించారు.

   కాసరగోడ్‌ వైద్య కళాశాలలో కోవిడ్‌-19 ఆస్పత్రిని ఏర్పాటు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం

తమిళనాడు

   రాష్ట్రంలో మరో రెండు మరణాలు సంభవించడంతో 5కు చేరిన మృతుల సంఖ్య.

   చెన్నై నగరవాసులకు పరీక్షలు నిర్వహించనున్న 6000 మంది ఆరోగ్య కార్యకర్తలు.

కర్ణాటక

   రాష్ట్రంలో 146కు పెరిగిన కోవిడ్‌ కేసుల సంఖ్య. ఇవాళ బెంగళూరులో మరో రెండు కొత్త కేసులు నమోదు. ఇప్పటిదాకా మరణించినవారి సంఖ్య 4 కాగా, ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లినవారు 11 మంది.

ఆంధ్రప్రదేశ్‌

   రాష్ట్రంలో ఇవాళ 34 కొత్త కేసులు నమోదు కాగా, వీటిలో ఒక్క కర్నూలు జిల్లాలోనే 23 కేసులున్నాయి. దీంతో మొత్తం నిర్ధారిత కేసుల సంఖ్య 226కు చేరింది.(Release ID: 1611488) Visitor Counter : 41


Read this release in: Malayalam , English , Urdu , Hindi , Marathi , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Kannada