రక్షణ మంత్రిత్వ శాఖ
ఐఎన్ఎస్ తిర్ లో విదేశీ పర్యటన ముగించుకు వచ్చిన ఎన్‌సిసి కేడెట్‌లు
నాడు పోస్టు చేయడమైనది:
05 APR 2020 6:41PM by PIB Hyderabad
భారత నౌకాదళంలో దక్షిణ నావికాదళ కమాండ్ (ఎస్ఎన్ సి) కి చెందిన కాడెట్ల శిక్షణ నౌక ఐఎన్ఎస్ తిర్ , దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 14 నౌకాదళ విభాగం ఎన్‌సిసి కేడెట్లతో ఫస్ట్ ట్రైనింగ్ స్క్వాడ్రన్ (1 టిఎస్)కింద విదేశాలలో పర్యటించి కోచికి తిరిగి చేరుకుంది.
ఎన్‌సిసి కేడెట్లు 2020ఫిబ్రవరి 29న ఐఎన్ ఎస్ తిర్ లో బయలుదేరి వెళ్లారు. వీరికి సముద్రంలో జీవితం ఏ విధంగా ఉంటుందన్న విషయమై ఒక నిర్దష్ట పద్ధతిలో శిక్షణ నిచ్చి భారత నౌకా దళ పాత్రపై వారికి అవగాహన కల్పించారు. కేడెట్లు ఉత్సాహంగగా నౌకలో అన్ని కార్యకలాపాలలో పాల్గొన్నారు. ఈ నౌక కమ్యూనిటీ ఔట్ రీచ్ కార్యక్రమంలో భాగంగా మారిషస్,పోర్ట్ లూయీస్‌లోని ఒక వృద్ధాశ్రమాన్ని ఎన్‌సిసి కేడెట్లు సందర్శించారు . ఈ సందర్భంగా కేడెట్లు ల చూపిన ఆదరణకు వృద్ధాశ్రమంలోని వారి నుంచి వీరు అభినందనలు అందుకున్నారు. కోవిడ్ -19 కారణంగా ఇతరులను కలుసుకుని సంభాషించడాన్నిపరిమితం చేయడం జరిగింది. భారత నౌకాదళ అధికారులు, విదేశీ సముద్ర యానం చేసే వారు, మాల్దీవులు, సీచెల్స్, బంగ్లాదేశ్, శ్రీలంక , మయన్మార్ లనుంచి వచ్చి ఈ నౌకలోనే ఉన్న శిక్షణార్థులతో వీరు మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకున్నారు.
కోవిడ్ 19 మహమ్మారి కారణంగా 1 టిఎస్ నౌకల విదేశీ పర్యటనలను కుదించారు. ఈ నౌకలు సముద్రంలోనే క్వారంటైన్ కాలాన్ని పూర్తి చేసుకుని 2020 ఏప్రిల్ 4న తిరిగి హార్బర్‌కు చేరుకున్నాయి. నౌకలలో సామాజిక దూరం పాటించడం ఆచరణ సాధ్యం కాదు కనుక నౌక మొత్తాన్ని, అందులోని వారిని అందరినీ క్వారంటైన్‌లో ఉంచారు. నౌక సిబ్బంది, ఎన్‌సిసి కేడెట్లు ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా హార్బర్‌లో 14 రోజుల అదనపు క్వారంటైన్‌లో ఉన్నారు.
(రిలీజ్ ఐడి: 1611438)
సందర్శకుల సూచీ సంఖ్య : : 142