కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
పి.ఎఫ్. సభ్యులు తమ పుట్టినరోజును సరిచేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ సవరించిన సూచనలు జారీ చేసిన ఈ.పి.ఎఫ్.ఓ.
Posted On:
05 APR 2020 3:47PM by PIB Hyderabad
కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఆన్ లైన్ సేవలను మరింతగా అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో, పి.ఎఫ్. సభ్యులు, ఈ.పి.ఎఫ్.ఓ. రికార్డుల్లో తమ పుట్టిన రోజును సరిదిద్దుకునేందుకు అవకాశం కల్పిస్తూ, ఈ.పి.ఎఫ్.ఓ. తన క్షేత్ర స్థాయి కార్యాలయాలకు సవరించిన సూచనలను జారీ చేసింది. తద్వారా, వారి యు.ఏ.ఎన్. వారి కే.వై.సి. పిర్యాదు అవుతుంది.
రెండు తేదీల మధ్య తేడా మూడు సంవత్సరాలకంటే తక్కువగా ఉన్నట్లయితే, పుట్టిన రోజును సరిదిద్దడం కోసం, ఆధార్ కార్దులో నమోదైన పుట్టిన రోజును ఇప్పుడు చెల్లుబాటయ్యే రుజువుగా అంగీకరించడం జరుగుతుంది. పి.ఎఫ్. చందాదారులు తమ సవరణ విజ్ఞప్తిని ఆన్ లైన్ లో దాఖలు చేయవచ్చు.
సభ్యుల పుట్టిన రోజును ఈ.పి.ఎఫ్.ఓ. తక్షణమే యు.ఐ.డి.ఏ.ఐ. తో ఆన్ లైన్ లో ధృవీకరించుకోవడానికి వీలు కలుగుతుంది. తద్వారా, సవరణ విజ్ఞప్తులను పరిశీలించి, ధృవీకరించడానికి పట్టే సమయం తగ్గుతుంది.
పి.ఎఫ్. సభ్యుల ఆన్ లైన్ విజ్ఞప్తులను సత్వరమే పరిష్కరించాలని ఈ.ఫై.ఎఫ్.ఓ. తన క్షేత్ర స్థాయి కార్యాలయాలను ఆదేశించింది. తద్వారా, కోవిడ్-19 మహమ్మారి విజృంభణ కారణంగా ఆర్ధిక సంక్షోభంలో ఉన్న పి.ఎఫ్. చందాదారులు, తమ పి.ఎఫ్. ఖాతాలో జమ అయిన మొత్తాల నుండి తిరిగి చెల్లించనవసరం లేని అడ్వాన్సు (నాన్-రిఫండబుల్ అడ్వాన్స్) కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోడానికి వీలు కలుగుతుంది.
*****
(Release ID: 1611379)
Visitor Counter : 220
Read this release in:
English
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam