సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

కోవిడ్ వ్య‌తిరేక పోరుకు తోడ్పాటునందిస్తున్న ఎంఎస్ఎంఈ టెక్నాలజీ కేంద్రాలు

- క‌రోనాపై పోరుకు కావాల్సిన సామగ్రిని త‌యారు చేస్తున్న 18 కేంద్రాలు
- వెంటిలేట‌ర్లు, మాస్క్‌లు, మెడిక‌ల్ గౌన్ల‌తో పాటు ఇత‌ర విడిభాగాల త‌యారీ

Posted On: 05 APR 2020 2:15PM by PIB Hyderabad

దేశం ప్రస్తుతం వివిధ‌ స్థాయిలలో న‌వ్య‌ కరోనా వైరస్‌తో (కోవిడ్‌-19) పోరాడుతున్న స‌మ‌యంలో త‌గిన తోడ్పాటును అందించేందుకు గాను సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) శాఖ త‌నవంతు కృషి చేస్తోంది. ఎంఎస్ఎంఈకి దేశ వ్యాప్తంగా ఉన్న త‌న పద్దెనిమిది అప‌రేష‌న‌ల్ టెక్నాల‌జీ కేంద్రాలు, ఇత‌ర స్వయం ప్రతిపత్తి సంస్థలు కూడా ఈ పోరులో త‌నవంతు పాత్ర‌ పోషిస్తున్నాయి. చెన్నైలోని సెంట్రల్ ఫుట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (సీఎఫ్‌టీఐ) సీలింగ్ మాస్క్‌లు మరియు మెడికల్ గౌన్ల త‌యారీ నిమిత్తం అవ‌స‌ర‌మైన యంత్ర సామ‌గ్రిని సేకరించి ఏర్పాటు చేసింది. శ‌నివారం (4వ తేదీ) నుంచి ఇక్క‌డ ఉత్ప‌త్తి ప్రారంభ‌మైంది. దీనిని మ‌రింత పెంచేందుకు గాను త్వ‌ర‌లోనే మ‌రో రెండు యంత్రాల‌ను స‌మీకరించే ప‌నుల‌ను సీఎఫ్‌టీఐ ప్రారంభించింది. మ‌రోవైపు హైదరాబాద్ కేంద్రంగా ప‌ని చేస్తున్న‌
ఎంస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ ప్రోటోటైప్ ఎలక్ట్రో మెకానికల్ వెంటిలేట‌ర్‌ను రూప‌క‌ల్ప‌న చేస్తోంది. సెన్సార్ల ఆధారంగా ఈ ఎలక్ట్రో మెకానికల్ వెంటిలేటర్. మొదటి నమూనా ఎలక్ట్రో మెకానికల్ వెంటిలేట‌ర్ త్వ‌ర‌లోనే సిద్ధంగా ఉంది. ఔరంగాబాద్‌లోని ఎస్ఎంఈ టీసీ కేంద్రం 3D ప్రోటోటైప్ ఫేస్ మాస్క్నుఅభివృద్ధి చేసింది. దీని ప్ర‌మాణిక‌త నిర్ధార‌ణ‌కు గాను ఈ కేంద్రం స్థానిక ఆసుపత్రి వారితో సంప్రదింపులు జ‌రుపుతోంది. కోల్‌క‌తాలోని సెంట్రల్ టూల్ రూమ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ (సిటిటిసి) స్థానిక‌ సాగర్ దత్తా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సౌజ‌న్యంతో సరళమైన, తక్కువ ఖర్చుతో కూడిన మేటి వెంటిలేటర్ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. దీనిని పరీక్షించడానికి ఆసుప‌త్రి వ‌ర్గాల వారు అంగీకరించారు. క్షేత్ర‌స్థాయిలో ప‌రీక్షించి చూడ‌డానికి కూడా ఆసుపత్రి వ‌ర్గాల వారు త‌గిన స‌హ‌కారాన్ని అందించేందుకు కూడా వారు స‌మ్మ‌తి తెలిపారు. వీటి త‌యారికి అవ‌స‌ర‌మైన వివిధ విడిభాగాల‌ను ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ చేశారు. ఇవి కేంద్రానికి రాగానే
ఈ ప్రోటోటైప్ వెంటిలేట‌ర్ త‌యారీని పూర్తి చేయ‌నున్నారు. దీనికి తోడు ఈ కేంద్రం ఫేస్ షీల్డ్ ప్రోటోటైప్‌ల‌ను కూడా అభివృద్ధి చేసింది. నెల‌కు క‌నీసం 20000 వ‌ర‌కు అందుబాటులోకి తెచ్చేలా
వీటి ఉత్ప‌త్తిని త్వ‌ర‌లోనే ప్రారంభించ‌నున్నారు. ఒక్కో ఫేస్ షీల్డ్ ను రూ.15 నుంచి రూ.20ల‌కే అందించేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. కన్నౌజ్ లోని ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ వారు  ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ల తయారీని ప్రారంభించి ఫరూఖాబాద్ లోని డీఎంకు సరఫరా చేసింది. దీనితో పాటు ఈ ఈ శానిటైజ‌ర్ల‌ను రైల్వేతో పాటు ఇతర సంస్థలకు కూడా సరఫరా చేయ‌నున్నారు. మ‌రోవైపు ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ డిజైన్ ఆఫ్ ఎలక్ట్రికల్ మెజరింగ్ ఇన్‌స్ర్టూమెంట్స్ (ఐడీఈఎంఐ) అయాన్ ఆధారిత శానిటైజర్‌ను అభివృద్ధి చేస్తోంది. బార్క్ పరిశోధనా పత్రంలో మాదిరాగా ఇది సాగుతోంది. ఈ ప్ర‌య‌త్నం విజయవంతమైతే దీనివ‌ల్ల బహుళ ప్ర‌యోజ‌నాలు
ఉంటాయి. హైదరాబాద్, భువనేశ్వర్, జంషెడ్‌పూర్ల‌లో ఉన్న ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ కేంద్రాలు
650 కరోనా టెస్టింగ్ కిట్‌లకు కావాల్సిన విడి భాగాల‌ను తయారు చేస్తుంది. ప్రతి కిట్‌లో 20 హార్డ్‌వేర్ భాగాలు ఉంటాయి. విడిభాగాల మొద‌టి సెట్ త‌యారీ భువనేశ్వర్లో త్వ‌ర‌లోనే సిద్ధం
కానున్నాయి. వీటికి రావాల్సిన స‌మ్మ‌తి ల‌భిస్తే విడిభాగాల ఉత్ప‌త్తిని వివిధ టెక్నాల‌జీ కేంద్రాల్లో త‌యారు చేయ‌నున్నారు. ఏఎంటీజెడ్ వెంటిలేట‌ర్ల త‌యారీకి 10,000 విడిభాగాలు అవ‌స‌రం. ప్రెస్ టూల్స్ సిద్ధం చేయడానికి అవ‌స‌ర‌మైన డ్రాయింగ్లు పంపిణీ చేయబడ్డాయి. భువ‌నేశ్వ‌ర్ టీసీ కేంద్రం జీఎం ఆయా ఉపకరణాలు మరియు భాగాలను తయారు చేసే పనిని లూథియానాలోని సీటీఆర్‌, ఐడీఈఎంఐ, ఇండో జర్మన్ టూల్ రూమ్ (ఐజీటీఆర్), ఔరంగ‌బాద్, కోల్‌క‌తాతో పాటు జంషెడ్‌పూర్‌లోని ఐడీటీర్‌ల‌కు అప్ప‌గించారు. మ‌రోవైపు రామ్‌న‌గ‌ర్ కేంద్రంగా ప‌ని చేస్తున్న
ఈఎస్‌టీసీ ఐవీ స్టాండ్‌ను రూపొందించింది. దీనికి తోడు కోవిడ్‌-19పై పోరున‌కు కావాల్సిన  ఉత్పత్తుల కోసం 70 మంది త‌యారీదారులు జీఈఎంలో నమోద‌య్యేలా ప్రేరేపించింది. 80 మంది వలస కార్మికులకు ఈఎస్‌టీసీ హాస్టల్‌ను షెల్టర్ హోమ్‌గా అందించారు. బివాడిలోని ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్, జంషెడ్‌పూర్‌లోని టీసీ కేంద్రాన్ని కోవిడ్ ఐసోలేషన్‌ కేంద్రాలుగా మార్చేందుకు వీలుగా ఖాళీ చేయించారు. ఆగ్రా కేంద్రంగా ప‌ని చేస్తున్న ప్రాసెస్ అండ్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ సెంటర్ (పీపీడీసీ), ఇండోర్‌లోని ఐసీటీఆర్ సంయుక్తంగా హాస్పిటల్ ఫర్నిచర్ కోసం ప్రణాళిక‌ల‌ను రూపొందిస్తున్నాయి. వీటి డిజైన్ల‌ తయారీ ప్రక్రియలో ఉన్నాయి. మీర‌ట్‌లోని పీపీడీసీ కేంద్రం వారు ఫేస్ మాస్క్‌లను త‌యారు చేసి ఉచితంగా పంపిణీ చేశారు. ఆగ్రా సీఎఫ్‌టీఐ వారు మెస‌ర్స్ రామ్సన్స్ వారికోసం మెడిక‌ల్ గౌన్ల‌ను ఫ్యాబ్రికేట్ చేసింది. దీనికి తోడు ట్రిపుల్ లేయర్డ్ ఫేస్ మాస్క్‌లను కూడా వీరూ ఫ్యాబ్రికేట్ చేయ‌డం విశేషం



(Release ID: 1611332) Visitor Counter : 218