PIB Headquarters

కోవిడ్‌-19పై పత్రికా సమాచార సంస్థ (PIB) రోజువారీ సమాచార పత్రం

• దేశంలో ఇప్పటిదాకా నిర్ధారిత కేసులు 2,902 కాగా, 68 మరణాలు నమోదయ్యాయి.
• ప్రధానమంత్రి అధ్యక్షతన సాధికార బృందాల సమావేశం
• రేపు రాత్రి 9 గంటలకు విద్యుద్దీపాలు ఆర్పివేసినప్పుడు గ్రిడ్‌ సుస్థిరత నిర్వహణకు తగిన ఏర్పాట్లు, ప్రక్రియలు సిద్ధంగా ఉన్నాయి.
• దిగ్బంధం నుంచి వ్యవసాయ యంత్రాల-ట్రక్కుల విడి పరికరాల, మరమ్మతు దుకాణాలకు, టీ పరిశ్రమకు మినహాయింపు ఇచ్చిన దేశీయాంగ శాఖ
• వ్యవసాయ, విత్తనాలు నాటే పనులు సజావుగా సాగేలా చూడాలని రాష్ట్రాలకు సూచన

Posted On: 04 APR 2020 7:02PM by PIB Hyderabad

కోవిడ్‌-19పై ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నుంచి తాజా సమాచారం

దేశంలో కోవిడ్‌-19పై ఇప్పటిదాకా అందిన సమాచారం ప్రకారం- నిర్ధారిత కేసుల సంఖ్య 2,902 కాగా- 68 మరణాలు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడి కోలుకున్న/పూర్తిగా నయమైన 132 మంది ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లారు. కాగా, 17 రాష్ట్రాల్లో తబ్లిఘీ-జమాత్‌తో ముడిపడిన కేసుల సంఖ్య 1,023గా నమోదైంది. ఇప్పటిదాకా నమోదైన మరణాల్లో అధికశాతం వృద్ధులు లేదా మధుమేహం, అధిక రక్తపోటు, మూత్రపిండ/గుండె సంబంధ వ్యాధులు తదితరాలతో బాధపడుతున్నవారేనని తేలింది.

ప్రధానమంత్రి అధ్యక్షతన సాధికార బృందాల సమావేశం

దేశంలో కోవిడ్‌-19పై పోరులో దేశవ్యాప్త సంసిద్ధతను ప్రధానమంత్రి సమీక్షించారు. ఈ మేరకు ఆస్పత్రుల లభ్యత, తగిన ఏకాంత-దిగ్బంధ చికిత్సల సదుపాయాలతోపాటు వ్యాధి వ్యాప్తిపై నిఘా, నిర్ధారణ పరీక్షలు, కీలక సంరక్షణపై శిక్షణ తదితరాల గురించి వాకబు చేశారు. వ్యక్తిగత రక్షణ సామగ్రి, చేతి తొడుగులు, కృత్రిమ శ్వాస యంత్ర పరికరాలు వంటి అత్యవసర వైద్య ఉపకరణాల తయారీసహా కొనుగోళ్లు, లభ్యతకు భరోసా కల్పించాలని సంబంధిత బృందాలకు, ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చారు. https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611026

ఏప్రిల్‌ 5వ తేదీ రాత్రి 9 గంటలకు విద్యుద్దీపాలు ఆర్పివేసినప్పుడు గ్రిడ్‌ సుస్థిరత నిర్వహణకు తగిన ఏర్పాట్లు, ప్రక్రియలు సిద్ధంగా ఉన్నాయి.

ఏప్రిల్‌ 5వ తేదీన రాత్రి 9:00 నుంచి 9:09 గంటలదాకా స్వచ్ఛందంగా విద్యుద్దీపాలు ఆర్పివేయాలని ప్రధానమంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా విద్యుద్దీపాలు ఆర్పివేస్తే విద్యుత్‌ గ్రిడ్‌లో అనిశ్చితి ఏర్పడుతుందన్న ఆందోళన వ్యక్తమైంది. అయితే, ఈ విధమైన ఆందోళనకు స్థానం లేదని స్పష్టమైంది.

జాతీయ దిగ్బంధంలో నిత్యావసరాల గొలుసుకట్టు సరఫరా సజావుగా సాగేలా  చూడటంలో రాష్ట్రాలకు క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై దేశీయాంగ శాఖ స్పష్టీకరణ

క్షేత్రస్థాయిలో సందిగ్ధం తొలగించే దిశగా జిల్లా అధికార యంత్రాంగాలు, క్షేత్రస్థాయి ఏజెన్సీలకు స్పష్టీకరించిన అంశాలపై సమాచారం తెలియజేయాలని రాష్ట్రాలకు సూచన

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610911

దిగ్బంధం నిబంధనల నుంచి వ్యవసాయ యంత్రాల-విడిభాగాల-మరమ్మతు దుకాణాలతోపాటు ట్రక్కు రిపేరు షాపులు, టీ పరిశ్రమకు మినహాయింపుపై దేశీయాంగ శాఖ అనుబంధ ప్రకటన జారీ https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610910

కోవిడ్‌-19పై పోరాటంలో భాగంగా కొనసాగుతున్న 21 రోజుల దిగ్బంధం కాలంలో సామాజిక దూరం పాటింపును తప్పనిసరి చేస్తూ పంటకోతలు, విత్తనాలువేసే పనులకు ఆటంకం లేకుండా చూడాలని రాష్ట్రాలకు దేశీయాంగ శాఖ సూచనపత్రం

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610918

టీడీఎస్‌/టీసీఎస్‌ నిబంధనలకు కట్టుబాటులో పన్ను చెల్లింపుదారులకు ఎదురవుతున్న ఇబ్బందుల తొలగింపునకు ఆదాయపు పన్ను చట్టం-1961లోని సెక్షన్‌ 119కింద ఉత్తర్వులు జారీచేసిన సీబీడీటీ

కోవిడ్‌-19 ప్రపంచ మహమ్మారి వ్యాప్తివల్ల ప్రతి రంగంలోనూ కార్యకలాపాలు దాదాపు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు ఎదురవుతున్న ఇబ్బందులనుంచి ఉపశమనం దిశగా ఆదాయపు పన్ను చట్టం-1961లోని సెక్షన్‌ 119కింద తనకు దఖలుపడిన అధికారాల మేరకు సీబీడీటీ కొన్ని ఆదేశాలు/వివరణలతో ఉత్తర్వులు జారీచేసింది.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611093

కోవిడ్‌-19 సమస్యను అధిగమించేందుకు ప్రత్యేకం బాధ్యతలు అప్పగించిన లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ ఆస్పత్రిలో వైద్యచర్యల సంసిద్ధతను డాక్టర్‌ హర్షవర్ధన్‌ స్వయంగా పరిశీలించారు.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611156

రాష్ట్రాలకు రాష్ట్ర విపత్తు ముప్పు నిర్వహణ నిధి కింద రూ.11,092 కోట్ల విడుదలకు దేశీయాంగ శాఖ ఆమోదం

ముఖ్యమంత్రులతో దృశ్య-శ్రవణ మాధ్యమ సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ మేరకు- అన్ని రాష్ట్రాలకూ రాష్ట్ర విపత్తు ముప్పు నిర్వహణ నిధి (SDRMF) కింద రూ.11,092కోట్ల విడుదలకు దేశీయాంగ శాఖ మంత్రి శ్రీ అమిత్షా ఆమోదం తెలిపారు. https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610917

ప్రధానమంత్రి – ఇజ్రాయెల్‌ ప్రధాని మధ్య టెలిఫోన్‌ సంభాషణ

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ గౌరవనీయులైన ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో టెలిఫోన్‌లో సంభాషించారు. కోవిడ్‌-19 ప్రపంచ మహమ్మారిపై పోరులో తమతమ ప్రభుత్వాలు అనుసరించిన ప్రతిస్పందన వ్యూహాల గురించి దేశాధినేతలిద్దరూ ఈ సందర్భంగా చర్చించారు. https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610870

కోవిడ్‌-19 నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికలను మళ్లీ వాయిదావేసిన భారత ఎన్నికల సంఘం; తాజా తేదీలను తర్వాత ప్రకటిస్తామని వెల్లడి https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610914

రబీ పంటల నూర్పిళ్లు, వేసవి పంటల సాగు పనులు సజావుగా సాగేందుకు చర్యలు

జాతీయ దిగ్బంధంవల్ల రైతులకు కలిగే ప్రతికూలత నివారణలో భాగంగా రబీ పంటల నూర్పిళ్లు, వేసవి పంటల సాగుపనులు సజావుగా సాగేవిధంగా కేంద్ర వ్యవసాయ సహకార -రైతు సంక్షేమ విభాగం అనేక చర్యలు తీసుకుంటోంది.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610916

కోవిడ్‌-19 నిరోధానికి చేతితో చేసిన మాస్కుల తయారీపై కరదీపిక

కోవిడ్‌-19 నిరోధానికి చేతితో చేసిన మాస్కుల తయారీపై కరదీపిక పీడీఎఫ్‌ ప్రతి కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

కోవిడ్‌-19 నేపథ్యంలో జాతీయ గ్రామీణ జీవనోపాధి కార్యక్రమం కింద మాస్కుల తయారీకి చర్యలు

దేశంలోని 24 రాష్ట్రాల్లోగల 399 జిల్లాల్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పర్యవేక్షణ కింద జాతీయ జీవనోపాధి కార్యక్రమంలో భాగంగా మాస్కుల తయారీని మహిళా స్వయం సహాయ బృందాలకు ప్రభుత్వం అప్పగించింది.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611053

కోవిడ్‌-19 నమూనాల పరీక్ష బాధ్యతలు స్వీకరించిన సీఎస్‌ఐఆర్‌-ఐఎంటెక్‌
ఆరోగ్య సంరక్షణ రంగ వృత్తి నిపుణులకు వ్యక్తిగత రక్షణ సామగ్రి సరఫరా రూపంలోనూ సీఎస్‌ఐఆర్‌-ఐఎంటెక్‌ తోడ్పాటునిస్తున్నాయి. https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611034

కోవిడ్‌-19 దిగ్బంధం నేపథ్యంలో విద్యుత్‌, రవాణాసహా కీలక మౌలిక సదుపాయాల రంగాలకు నిరంతర సరఫరాలకు రైల్వేశాఖ భరోసా

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611193

కోవిడ్‌-19పై భారత్‌ పోరాటానికి దేశీయ సరకు రవాణా విమానాల సేవలతో మరింత బలం.    https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611089

పర్యాటక, ఆతిథ్య రంగాలకు చెందిన పరిశ్రమల సంఘాలతో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రత్యక్ష దృశ్యమాధ్యమ సమావేశం నిర్వహణ

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611159

కోవిడ్‌-19పై దేశంలోని అనేక విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలల్లోని విభాగాధిపతులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి చర్చాగోష్ఠి

కోవిడ్‌-19పై పోరాటంలో ఉపాధ్యాయులు, విద్యార్థులందరూ చురుకైన పాత్ర పోషించడంపై శ్రీ నిషాంక్‌ కృతజ్ఞతలు తెలిపారు. https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610933

కోవిడ్‌-19పై విద్యార్థి సహాయ పోర్టల్‌ను ప్రారంభించిన ఎంహెచ్‌ఆర్‌డీ-ఏఐసీటీఈ

కోవిడ్‌-19 ప్రభావం, జాతీయ దిగ్బంధం నేపథ్యంలో కళాశాలలు, హాస్టళ్లు మూసివేయడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి చిక్కుల్లో ఉన్న విద్యార్థులకు సాయం, తోడ్పాటు అందించేందుకు ఏఐసీటీఈ వినూత్న ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మేరకు ‘ఎంహెచ్‌ఆర్‌డీ-ఏఐసీటీఈ కోవిడ్‌-19’ విద్యార్థి సహాయ పోర్టల్‌ను ప్రారంభించింది. సదరు పోర్టల్‌ యూఆర్‌ఎల్‌ ఇదే: https://helpline.aicte-india.org

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610881

కోవిడ్‌-19 పరిస్థితిని ఎదుర్కొనడంపై వివిధ రేవుల భాగస్వాములతో నౌకాయాన శాఖ మంత్రి దృశ్య-శ్రవణ మాధ్య సమావేశం

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610906

సహాయం అవసరమైనవారికి గోవాలోని నావికాదళ స్థావరం చేయూత

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610875

కరోనావైరస్‌పై పోరాటానికి మద్దతు కొనసాగిస్తున్న భారత వాయుసేన (IAF)

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610876

‘హ్యాక్‌ ది క్రైసిస్‌ - ఇండియా’... కోవిడ్‌-19 ప్రపంచ మహమ్మారి నిర్మూలనకు తగిన పరిష్కారాల అన్వేషణ దిశగా ఆన్‌లైన్‌ హ్యాకథాన్‌కు శ్రీకారం. https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610850

డీఎస్‌టీ నిధుల తోడ్పాటు ఏర్పాటైన అంకుర సంస్థలో కోవిడ్‌-19పై పోరులో భాగంగా రసాయనరహిత వెండి ఆధారిత పరిశుభ్రత ద్రవం తయారీ https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611165

‘కోవిడ్‌-19పై సవాలు’ పేరిట నిర్వహిస్తున్న పోటీలో ఆవిష్మరణాత్మక నిండిన పౌరులు పాల్గొనాల్సిందిగా జాతీయ ఆవిష్కరణల ఫౌండేషన్‌ ఆహ్వానం.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611218



(Release ID: 1611227) Visitor Counter : 171