ఉప రాష్ట్రపతి సచివాలయం
సమ్మేళనాలు / ఫంక్షన్లు నిర్వహించవద్దని మత పెద్దలకు సలహా ఇవ్వాలని గవర్నర్లు / లెఫ్టినెంట్ గవర్నర్లను ఉపరాష్ట్రపతి కోరారు
ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయ ఉత్పత్తుల కోత, సేకరణపై దృష్టి పెట్టాలని సూచించారు .
వైద్యులపై దాడుల ఘటనల పై ఆందోళన, ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
వలస కూలీలకు ఆహారం,ఆశ్రయం కల్పించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున ముందుకు రావాలని పిలుపు
Posted On:
03 APR 2020 2:01PM by PIB Hyderabad
ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల గవర్నర్లు లెఫ్టినెంట్ గవర్నర్లతో ఈరోజు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఆధ్యాత్మిక నాయకులు, మత పెద్దలు ,తమ తమ అనుచరులు ఏరకమైన సమ్మేళనాలు నిర్వహించకుండా చూసేవిధంగా వారికి ప్రేరణ నివ్వాలని, కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టేందుకు సామాజిక దూరం పాటించేలా చేయాలని వారికి సూచించారు. వ్యవసాయ ఉత్పత్తుల పంట కోత, నిల్వ, సేకరణకు సంబంధించి ఆయా రాష్ట్రాలలో తగిన చర్యలు తీసుకోవాలని ఆయన వారికి సూచించారు.
గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్లతో రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్ తో కలిసి ఆయన మాట్లాడారు. తమ తమ ప్రాంతాలలోని ఆథ్యాత్మిక మత పెద్దలను వారి శిష్యులు సామాజిక దూరానికి సంబంధించిన మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించేలా చూడాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించాల్సిందిగా కోరారు.
ఇటీవల జరిగిన ఒక నివారించదగిన చర్య దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రభావానికి కారణమైందని, ఆయన అన్నారు. గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు దీనిని ఒక హెచ్చరికగా తీసుకోవాలన్నారు.
ఎలాంటి మతపరమైన సమ్మేళనాలు మీ రాష్ట్రంలో జరగకుండా చర్యలు తీసుకోండి అని ఉపరాష్ట్రపతి సూచించారు.
పంట కోతల సీజన్ గురించి ప్రస్తావిస్తూ శ్రీ వెంకయ్యనాయుడు, పంట కోతలకు సంబంధించి వ్యవసాయ యంత్రాలు ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా సాగిపోయేందుకు చర్యలు తీసుకోవాలని, ఈ విషయయంలో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని ఆయన కోరారు.రైతులనుంచి నూరుశాతం ఉత్పత్తులు సేకరించేలా చూడాలన్నారు. ప్రస్తుత సమయంలో ఇది అత్యంత అవసరమని ఉపరాష్ట్రపతి అన్నారు.
కొన్నిరాష్ట్రాలలో డాక్టర్లపై దాడుల ఘటనలపై ఉపరాష్ట్రపతి ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి దురృష్టకరమైన, ఖండించదగిన చర్యలని శ్రీ వెంకయ్యనాయుడు అన్నారు. కోవిడ్ -19 పై ముందుండి పోరాడుతున్న డాక్టర్లు, నర్సులు, పోలీసులు,పారిశుధ్యకార్మికులు, ఇతర సిబ్బంది ప్రజల ప్రాణాలు కాపాడే కీలకపాత్ర పోషిస్తున్న విషయంపై ప్రజలను చైతన్యవంతులను చేయాలని ఉపరాష్ట్రపతి సూచించారు. ఇలాంటి ఘటనలు డాక్లర్లు, ఇతరుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని ఆయన అన్నారు. వారు చేస్తున్నసేవలను ప్రశంసిస్తూ ఉపరాష్ట్రపతి, ఇలాంటి ఘటనల వెనుక ఉన్న వాస్తవ కారణాలను తెలుసుకుని, డాక్టర్లు,నర్సులు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఇతరుల ప్రాణాలు కాపాడేందుకు కృషిచేస్తున్న విషయంపై ప్రజలను చైతన్యపరచాలని ఉపరాష్ట్రపతి సూచించారు.
విద్యార్థులు తమ చదువు కొనసాగించడానికి ఆన్‌లైన్ కోర్సుల నిర్వహణకు చేపడుతున్న ఏర్పాట్ల గురించి కూడా ఉపరాష్ట్రపతి గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లను అడిగి తెలుసుకున్నారు.
వలస కార్మికుల దుస్థితి, ప్రజలకు అవసరమైన వస్తువులు , మందుల సరఫరా గురించి కూడా ఉపరాష్ట్రపతి అడిగి తెలుసుకున్నారు. వలస కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలను తగ్గించడంలో , కేంద్ర ప్రభుత్వం,రాష్ట్రాలు తమ వంతు కృషి సాగిస్తున్నాయని అలాంటపుడు, వలసకార్మికులకు ఆహారం , ఆశ్రయం కల్పించే విషయంలో వారికి సహాయపడడం సమాజం విధి అని ఆయన అభిప్రాయపడ్డారు.
లాక్‌డౌన్ స్ఫూర్తిని పాటించినందుకు దేశవ్యాప్తంగా ప్రజలను ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు ప్రశంసించారు. సామాజిక దూరానికి సంబంధించిన నిబంధనలను ప్రజలు సమర్థవంతంగా అమలు చేయాలని పిలుపునిచ్చారు. ఎటువంటి ఉల్లంఘనలు లేకుండా, నిబంధనలను పక్కదారి పట్టించకుండా, తేలికగా తీసుకోకుండా, నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
గౌరవనీయ రాష్ట్రపతి, గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన సలహాలను పాటించాల్సింది ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.వైద్యులు, శాస్త్రవేత్తలు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ, ఐసిఎంఆర్ జారీచేసిన సూచనలను పాటించాలని సూచించారు.
35 మంది గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు , రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్లు కోవిడ్ -19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు తమ తమ ప్రాంతాలలో తీసుకుంటున్న చర్యలను ఈ సమావేశంలో వివరించారు.
(Release ID: 1610700)
Visitor Counter : 180
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam